సాక్షి, కడప: టమోట ధరలు భారీగా క్షీణించాయి. నెల రోజుల క్రితం 114 బాక్సుల లోడు గల బోలేరో వాహనంలో సుమారు 3టన్నుల టమాటాలు లక్ష రూపాయలు పలికాయి. ప్రస్తుతం అదే బోలేరో వాహనంలోని 114 బాక్సుల టమోటాలు రూ.6వేల ధర కూడా పలకడంలేదు.
వాహనంలోకి లోడు ఎక్కించేందుకు కూలీలకు రూ.2,800, మార్కెట్‌కు తరలించడానికి వాహన బాడుగ రూ.4వేలు కలిపి మొత్తం రూ.6,800 చెల్లించాలి. లోడు టమాటాల ధర రూ.6వేలు పలికితే రైతు అదనంగా రూ.800 చేతినుంచి వేసుకుని చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో లింగాల మండలం కోమన్నూతలకు చెందిన వెంకటేష్ అనే రైతు తాను పండించిన టమాటాలను ఇలా మేకలకు మేతగా పడేశాడు.
చదవండి: (జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment