lingala mandalam
-
Tomato Price: నెల క్రితం 3టన్నుల టమాటా లక్ష రూపాయలు.. మరి నేడు..?
సాక్షి, కడప: టమోట ధరలు భారీగా క్షీణించాయి. నెల రోజుల క్రితం 114 బాక్సుల లోడు గల బోలేరో వాహనంలో సుమారు 3టన్నుల టమాటాలు లక్ష రూపాయలు పలికాయి. ప్రస్తుతం అదే బోలేరో వాహనంలోని 114 బాక్సుల టమోటాలు రూ.6వేల ధర కూడా పలకడంలేదు. వాహనంలోకి లోడు ఎక్కించేందుకు కూలీలకు రూ.2,800, మార్కెట్కు తరలించడానికి వాహన బాడుగ రూ.4వేలు కలిపి మొత్తం రూ.6,800 చెల్లించాలి. లోడు టమాటాల ధర రూ.6వేలు పలికితే రైతు అదనంగా రూ.800 చేతినుంచి వేసుకుని చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో లింగాల మండలం కోమన్నూతలకు చెందిన వెంకటేష్ అనే రైతు తాను పండించిన టమాటాలను ఇలా మేకలకు మేతగా పడేశాడు. చదవండి: (జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి: సీఎం జగన్) -
లింగాల మండల ప్రజలతో వైఎస్ జగన్ భేటీ
-
లింగాల మండల ప్రజలతో వైఎస్ జగన్ భేటీ
పులివెందుల : పులివెందుల నియోజకవర్గం పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం లింగాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో విడివిడిగా సమావేశం అయ్యారు. సాగు, తాగునీటి సమస్యలపై ఆయన ప్రజలతో చర్చించారు. మండల ప్రజలు ఈ సందర్భంగా తమ ఇబ్బందులను వైఎస్ జగన్కు వివరించారు. చిత్రావతి జలాశయం నుంచి తగినంత నీటిని విడుదల చేయకపోవడంతో వారానికి ఒక్కసారి కూడా నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లో నీటి సమస్యలను తీర్చాలని వైఎస్ జగన్ అధికారులను కోరారు.