
Actress Faria Abdullah Visits YSR Kadapa: కడప నగరంలో జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. గురువారం ఇక్కడి అల్మాస్‌పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వావ్ హీరో’ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై షో రూంను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు.
చదవండి: అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు
డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ సురేశ్ బాబు, ఎండీ నవీన్‌లో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసింది. అయితే షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన ఫరియా ఈ సందర్భంగా కడపలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకుంది. దర్గా సంపద్రాయం ప్రకారం ఫరియాకు దర్గా ముజావార్లు ఘనంగా స్వాగతం పిలికారు. దర్గా మాజర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఫరియా అనంతరం దర్గా విశిష్టతను అడిగి తెలుసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment