
సాక్షి, కడప: ఆపదలో ఉన్న ఓ అభాగ్యుడి కుటుంబానికి భరోసా కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోజూ కూలి పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్న తనకు పెద్ద ఆపద వచ్చి పడిందని, తన కుమారుడు నరసింహ (12) నరాల సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడని భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు కడప పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో శుక్రవారం గోడు వెళ్లబోసుకున్నాడు.
వెంటనే స్పందించిన సీఎం.. బాలుడికి మెరుగైన చికిత్స కోసం ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. మంచి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తక్షణ సాయంగా రూ.లక్ష ఇవ్వాలని చెప్పారు. సీఎం మేలును తాము జీవితాంతం మరచిపోమని బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.