సాక్షి, వైఎస్సార్ జిల్లా : మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో రాజుకున్న రాజంపేట గొడవ అమరావతికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేట టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో టికెట్ ఆశావహులు వేమన సతీశ్ తన అనుచర వర్గంతో అమరావతికి తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, చరణ్‌రాజ్ తదితరులు కూడా అక్కడికి చేరుకున్నారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. (రాజంపేట టీడీపీలో రభస!)
కాగా ఆర్‌అండ్‌బీ బంగ్లా వేదికగా జరిగిన సమావేశం సాక్షిగా రాజంపేట టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి తెలియకుండా మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సమావేశం నిర్వహించడం, రాజంపేట నియోజకవర్గంలో మేడా కంటే బలమైన అభ్యర్ధిని రానున్న ఎన్నికల్లో పోటీకి దింపుతామని వ్యాఖ్యానించడంతో రభస జరిగింది. ఈ క్రమంలో సీఎంతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటూ మేడా పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment