టీడీపీలో నాలుగన్నరేళ్లు నరకయాతన అనుభవించా | Rajampet MLA Meda Mallikarjuna Reddy Likely To Join YSRCP | Sakshi

టీడీపీలో నాలుగన్నరేళ్లు నరకయాతన అనుభవించా

Jan 22 2019 6:28 PM | Updated on Mar 22 2024 11:10 AM

టీడీపీలో నాలుగన్నరేళ్లు నరకయాతన అనుభవించానని మేడా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును నమ్మి ఇంకా అక్కడ ఉండలేనని, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అని విమర్శించారు. రైతులకు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని, కాపులకు రిజర్వేషన్‌ ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి గెలిచిన చంద్రబాబును ప్రజలు ఇప్పుడు నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. బాబును ఇంకా నమ్మితే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అన్నారు. వైఎస్సార్‌ రాజకీయ భిక్షం పెడితే ఆదినారాయణ రెడ్డి గెలిచారని.. తర్వాత వంచన చేసి, టీడీపీలో చేరి.. మంత్రి అయ్యారని గుర్తుచేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement