మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్‌ ఘన నివాళి | CM YS Jagan Visits YSR Ghat | Sakshi
Sakshi News home page

మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్‌ ఘన నివాళి

Published Thu, Dec 24 2020 9:56 AM | Last Updated on Thu, Dec 24 2020 12:24 PM

CM YS Jagan Visits YSR Ghat - Sakshi

సాక్షి, ఇడుపులపాయ: మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలు పాల్గొన్నారు.

ఆ తర్వాత ఇడుపులపాయలోని ప్రార్థన మందిరం లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకల్లోతల్లి విజయమ్మ ,సతీమణి భారతి రెడ్డితో కలిసి సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,డిప్యూటీ సీఎం అంజాద్ భాష,ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ కొండారెడ్డి , వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement