వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తిరుమల వెళ్లనున్నారు. ఎల్లుండి (బుధవారం) ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. కాగా వైఎస్ జగన్ రేపు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన తాడేపల్లి నుంచి నేరుగా పులివెందుల వెళతారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని తన తండ్రి, మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అదేరోజు సాయంత‍్రం వైఎస్ జగన్ తిరుమల చేరుకుంటారు. రాత్రి తిరుమలలోనే బస చేసి, బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.