విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలి: వైఎస్‌ విజయమ్మ | YS Vijayamma Pays Tribute At YSR Ghat Idupulapaya | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన వైఎస్‌ విజయమ్మ

Published Fri, Mar 29 2019 7:12 AM | Last Updated on Fri, Mar 29 2019 8:58 AM

YS Vijayamma Pays Tribute At YSR Ghat Idupulapaya - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ శుక్రవారం ఉదయం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌ పాలనతో పోల్చినప్పుడు ప్రస్తుత పాలన చూస్తే చాలా బాధ వేస్తుంది. రాజన్న పాలన మళ్లీ చూడాలంటే అది వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని నమ్ముతాను. ఈ పదేళ్ల పాటు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబం మధ్య కంటే ప్రజలతోనే ఎక్కువ మమేకమై ఉన్నారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజల కష్టాలు చూశాడు.. విన్నాడు. ప్రతి ఒక్కరికి నేనున్నానే భరోసా ఇచ్చాడు. విలువలకు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టాలి. తాను చేసిన అభివృద్ధి కూడా చెప్పుకోలేని చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వైఎస్‌ జగన్‌ జపం చేస్తున్నార’ని తెలిపారు.

నేడు ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో విజయమ్మ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు కందుకూరులో జరిగే ప్రచార సభలో ఆమె పాల్గొన్ని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కనిగిరిలో జరిగే సభలో విజయమ్మ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మార్కాపురంలో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి విజయమ్మ మర్కాపురంలోనే బస చేస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు  యర్రగొండపాలెంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో విజయమ్మ పాల్గొననున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement