ఇడుపులపాయ చేరుకున్న షర్మిల
Published Tue, Aug 6 2013 8:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
వైఎస్ఆర్ జిల్లా: మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగించుకుని తొలిసారి షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆమె వైఎస్ఆర్ ఘాట్ చేరుకుని మహానేతకు నివాళులు అర్పించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగించుకుని షర్మిల సోమవారం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.
మంగళవారం ఉదయం ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించటంతో పాటు ప్రార్థన కార్యాక్రమాలలో ఆమె పాల్గొంటారు. అనంతరం ఆమెను పలువురు సర్పంచ్లతో పాటు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు కలవనున్నారు.
3,112 కిలోమీటర్ల పాదయాద్రను పూర్తి చేసిన షర్మిల నిన్న చంచల్గూడలో ఉన్న జగన్ను కలిశారు. పాదయాత్ర విజయవంతమైనందుకు జగన్ ఆనందం వ్యక్తం చేశారని ఆమె భేటీ అనంతరం మీడియాకు తెలిపారు.
Advertisement
Advertisement