మహానేతకు తనయుడి ఘన నివాళి | CMYS Jagan, Family Pay Homage To YSR On His 70th Birth Anniversary | Sakshi
Sakshi News home page

మహానేత వైఎస్సార్‌కు కుటుంబసభ్యులు ఘన నివాళి

Published Mon, Jul 8 2019 9:20 AM | Last Updated on Mon, Jul 8 2019 10:31 AM

CMYS Jagan, Family Pay Homage To YSR On His 70th Birth Anniversary - Sakshi

సాక్షి, ఇడుపులపాయ: దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్‌ 70వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డితో పాటు  పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే రైతు బాంధవుడు,  వైఎస్సార్‌ జయంతి సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement