Idupulapayala
-
వైఎస్సార్‌కు ముఖ్యమంత్రి జగన్ నివాళి
-
మహానేతకు తనయుడి ఘన నివాళి
సాక్షి, ఇడుపులపాయ: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్ 70వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే రైతు బాంధవుడు, వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
మహానేత వైఎస్ఆర్ కు ఘన నివాళి
ఇడుపులపాయలో వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, భారతి, కుటుంబసభ్యుల ప్రత్యేక ప్రార్థనలు వేంపల్లె: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కుటుంబ సభ్యులతో కలసి వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ 65వ జయంతి వేడుకలు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో జరిగాయి. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డితోపాటు వైఎస్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిలమ్మ, కోడలు భారతిరెడ్డి, షర్మిల కుమార్తె అంజలి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి, ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే వైఎస్ పురుషోత్తమరెడ్డి, జగన్ మామ ఈసీ గంగిరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, కమలమ్మ, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ అవినాష్‌రెడ్డి సతీమణి సమతారెడ్డి తదితరులు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెవరెండ్ నరేష్‌బాబు సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ ఆశయాలు సాధిస్తాం: ఎంపీలు వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి మహానేతను కోల్పోవడం రాష్ట్రానికే కాకుండా దేశానికి పెద్దలోటని వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో దివంగత వైఎస్సార్ ఆశయ సాధనకు అంతా కృషి చేస్తామని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని లోధీఎస్టేట్-26లో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాదరావు, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక పాల్గొన్నారు. వైఎస్ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం కేక్ కోశారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా రాజశేఖరరెడ్డి పరిపాలన కొనసాగిందన్నారు. అందుకే ప్రజలు ఆయనను ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతల శ్రద్ధాంజలి హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి.. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తరువాత యర్రగొండపాలెం, మార్కాపురం ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి సంయుక్తంగా కేక్‌ను కోసి పంచారు. ఆ తరువాత పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటుతో పాటు, పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు ఎన్.లక్ష్మీపార్వతి, నల్లా సూర్యప్రకాశరావు, వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావు, విజయచందర్, బి.జనక్‌ప్రసాద్, పీఎన్వీ ప్రసాద్, పుత్తా ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీ ఎల్పీ కార్యాలయంలో పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మహానేతకు కాంగ్రెస్ నివాళి వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం స్థానిక ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. పంజగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, నాయకులు వట్టి వసంతకుమార్, శైలజానాథ్, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
21న ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ ఎల్పీ భేటి!
-
21న ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ ఎల్పీ భేటి!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఈ నెల 21న ఇడుపులపాయలో నిర్వహించనున్నట్టు పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. భవిష్యత్ లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను, కార్యక్రమాలను కూడా చర్చిస్తారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి సమాధివద్ద పార్టీ నేతలు నివాళలర్పిస్తారు. -
మహానేత వైఎస్ఆర్ కు జననేత, కుటుంబ సభ్యుల ఘన నివాళి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయను సందర్శించారు. ఉదయం 9.15 సమయంలో వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్న జగన్ తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి కుటుంబ సమేతంగా ఘన నివాళులర్పించారు. చాలాకాలం తర్వాత ఇడుపులపాయకు రావడంతో ఘాట్‌వద్దకు రాగానే జగన్ ఉద్వేగానికి లోనయ్యారు. సమాధి వద్ద మోకాళ్లపైనే కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ సమయంలో అక్కడ గంభీర వాతావరణం నెలకొంది. జగన్‌తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు మహానేతకు నివాళులర్పించారు. తర్వాత అక్కడే ఉన్న వైఎస్ కాంస్య విగ్రహానికి కూడా పూలమాలలు వేశారు. ఎస్టేట్ చర్చి ఫాదర్ నరేష్ ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇడుపులపాయలోని అతిథిగృహానికి చేరుకున్న జగన్ పలుదఫాలుగా అభిమానులను పలకరించారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వాస్తవానికి చాలాకాలం తర్వాత వచ్చిన తమ అభిమాన నేతను చూసేందుకు జిల్లా ప్రజానీకం ఉదయం నుంచే పోటెత్తింది. వర్షపు తుంపర్లు కూడా జననేతను స్వాగతించాయి. జగన్ మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటలకు వైఎస్సార్ జిల్లా ఎరగ్రుంట్ల రైల్వేస్టే„షన్‌కు చేరుకున్నారు. సోమవారం రాత్రి నుంచే పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్టేషన్లో జాగారం చేస్తూ గడిపారు. ఉదయానికల్లా భారీ సంఖ్యలో అభిమానులు, మహిళలు తరలివచ్చారు. వారందరినీ జగన్ పలుకరించారు. ఎరగ్రుంట్ల నుంచి వీరపునాయునిపల్లి మీదుగా ఇడుపులపాయకు చేరుకున్న జగన్‌కు మధ్యలో ప్రతి పల్లె స్వాగతం పలికింది. ఇడుపులపాయ గెస్టహౌస్ వద్ద కార్యకర్తలు, అభిమానుల రద్దీతో గేటునుంచి వాహనం కూడా లోపలికి వెళ్లడం కూడా కష్టమైంది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్ నడుచుకుంటూనే లోపలికి వెళ్లారు. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకూ క్షణం తీరిక లేకుండా అభిమానుల మధ్యనే జననేత గడిపారు. రాత్రి 8.30 గంటలకు ఇడుపులపాయ నుండి బయలుదేరి ముద్దనూరు రైల్వేస్టే„షన్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి వెంకటాద్రి ఎక్సప్రెస్లో రాజధానికి తిరుగు పయనమయ్యారు. ఈ సమయంలోనూ జగన్ చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.