21న ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ ఎల్పీ భేటి!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఈ నెల 21న ఇడుపులపాయలో నిర్వహించనున్నట్టు పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. భవిష్యత్ లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను, కార్యక్రమాలను కూడా చర్చిస్తారు.
లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి సమాధివద్ద పార్టీ నేతలు నివాళలర్పిస్తారు.