వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
వేంపల్లె : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. పులివెందుల నుంచి రోడ్డు మార్గాన ఉదయం 9 గంటలకు ఆయన ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్సార్ సమాధి వద్ద పూలమాల వేసి కొద్దిసేపు శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అనంతరం వేంపల్లె మీదుగా రోడ్డు మార్గాన కడప విమానాశ్రయం చేరుకుని స్పెషల్ ఫ్లైట్‌లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.
ఆయన పర్యటనలో కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాష, ఎమ్మెల్యే అభ్యర్థులు వెంకటసుబ్బయ్య, సుధీర్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, చక్రాయపేట మండల ఇన్‌చార్జి వైఎస్ కొండారెడ్డి, రైతు విభాగపు జిల్లా అధ్యక్షుడు ఎస్.ప్రసాద్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎస్‌ఎఫ్ బాషా, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్‌వలి, మాజీ ఎంపీపీ కొండయ్య, పాస్టర్ రవికుమార్, మైనార్టీ కన్వీనర్ మునీర్, నాయకులు రుద్రభాస్కర్‌రెడ్డి, రామగంగిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, షేక్‌షావలి, మునేష్, రామాంజనేయరెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment