idupulayapaya
-
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్
వేంపల్లె/ఇడుపులపాయ/ఒంటిమిట్ట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశంసించారు. శనివారం ఆయన వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. ముందుగా గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ అనుచరునిగా తనను గుర్తిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు కేబినేట్లో మంత్రి పదవి కల్పించడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారన్నారు. గండి క్షేత్రంలో వీరాంజనేయస్వామి 100 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం ఒంటిమిట్టకు చేరుకున్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని పలు ప్రధాన ఆలయాలను తొలిదశలో మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అన్యాక్రాంతమైన, కబ్జాకు గురైన దేవదాయ శాఖ భూములను సంరక్షిస్తామని చెప్పారు. దేవదాయ శాఖలో టీటీడీ తరహా ఆన్లైన్ పద్ధతిని పాటించేలా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గండి వీరాంజనేయస్వామి దేవస్థాన చైర్మన్ పి.రాఘవేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు
సాక్షి, అమరావతి: దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా, చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయింది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి ఆయన ఆశీర్వాద బలంతో 2017 నవంబర్ 6వ తేదీన జగన్ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర చరిత్రనే మలుపు తిప్పిన ఈ పాదయాత్రను జగన్ ఎండనక, వాననక 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా కొనసాగించారు. 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసిన ఈ యాత్రలో తొలి నుంచీ జనంతో మమేకం అవుతూ.. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగిన ఆయన పట్టుదలతో తన రాజకీయ ప్రస్థానాన్ని చేరుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక కూడా ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. అద్వితీయమైన రీతిలో 151 శాసనసభ, 22 లోక్‌సభా స్థానాల్లో విజయం సాధించి మే 30వ తేదీన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారు. పాదయాత్ర స్ఫూర్తితో 17 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పాలనను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్నదే నా కసి.. ‘చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు.. ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తే లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి.. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి’ అని జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో జగన్ ప్రజలకు మాట ఇచ్చారు. ► అక్కడి నుంచి అశేష జనవాహిని నడుమ దిక్కులు పిక్కటిల్లేలా పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుండగా ముందుకు కదిలారు. అశేష జనవాహినితో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు కిటకిటలాడాయి. 13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తొలుత అంచనా వేసినా, తుదకు అది 14 నెలల పాటు సాగింది. యాత్రకు అడ్డంకులు సృష్టించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చూసినా, సాధ్యం కాలేదు. ► వినమ్రంగా కోర్టు ఆదేశాలను శిరసావహిస్తూనే.. వారంలో ఆరు రోజులు యాత్రను కొనసాగించారు. పండుగలు, పబ్బాలను ప్రజల మధ్యనే గుడారాల్లో జరుపుకున్నారు. జగన్‌ను కలిసేందుకు రైతులు, నిరుపేద ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాల నేతలు తరలి వచ్చి, సమస్యలు విన్నవించారు. వారి ఆంకాంక్షలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ► 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్‌ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్ నడిచారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. భయపడే ప్రసక్తే లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి.. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి’ అని జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో జగన్ ప్రజలకు మాట ఇచ్చారు. ► అక్కడి నుంచి అశేష జనవాహిని నడుమ దిక్కులు పిక్కటిల్లేలా పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుండగా ముందుకు కదిలారు. అశేష జనవాహినితో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు కిటకిటలాడాయి. 13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తొలుత అంచనా వేసినా, తుదకు అది 14 నెలల పాటు సాగింది. యాత్రకు అడ్డంకులు సృష్టించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చూసినా, సాధ్యం కాలేదు. ► వినమ్రంగా కోర్టు ఆదేశాలను శిరసావహిస్తూనే.. వారంలో ఆరు రోజులు యాత్రను కొనసాగించారు. పండుగలు, పబ్బాలను ప్రజల మధ్యనే గుడారాల్లో జరుపుకున్నారు. జగన్‌ను కలిసేందుకు రైతులు, నిరుపేద ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాల నేతలు తరలి వచ్చి, సమస్యలు విన్నవించారు. వారి ఆంకాంక్షలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ► 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్‌ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్ నడిచారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. -
మహానేతకు నివాళులు
-
ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఇడుపుల పాయ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు వచ్చిన సీఎం జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఇతర అధికారులు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. వారితో కాసేపు ముచ్చటించిన సీఎం.. తర్వాతా వైఎస్సార్ ఎస్టేట్‌లో బస చేసేందుకు వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని రేపు(సెప్టెంబర్ 2) ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30కి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
వైఎస్సార్ జిల్లాకు బయలుదేరిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి సాయంత్రం 4. 45గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.15 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని 2వ తేదీ ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30కి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
నేడు ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం(నేడు) సాయంత్రం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5.16 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని 2వ తేదీ ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30కి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
వైఎస్సార్‌కు ఘన నివాళి
47 ఏళ్లుగా వైఎస్సార్‌తో, వైఎస్సార్ కుటుంబంతో పెనవేసుకున్న అనుబంధం ఉన్న వారందరికీ ఈ పుస్తకాన్ని అందిస్తాను. సహృదయంతో అందరూ చదవాలి. వైఎస్సార్ నాకు స్ఫూర్తి. ఆయన మాటలు మీ అందరిలోనూ స్ఫూర్తి నింపుతాయని నమ్ముతున్నాను. రాజశేఖరరెడ్డి నావాడే కాదు. అందరి వాడని గర్వంగా చెబుతున్నా. ఈ అనుబంధం కలకాలం నిలవాలని, మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలు నా బిడ్డలకు సదా ఉండాలని కోరుకుంటున్నాను. – వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ప్రతి మాట, ప్రతి అడుగు గురించి చాలా మంది తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. నాతోనే కాకుండా, రాష్ట్ర ప్రజలందరితోనూ ఆయనకు చెరగని బంధం ఉంది. ఆయన సహచర్యం ఒక మార్గదర్శకం. ఆయన పిలుపు ఓ భరోసా. ఆయన మాట విశ్వసనీయతకు మారుపేరు. వైఎస్సార్ నాయకత్వం, దార్శనికత, విలువలు మన జీవితాలను నడిపిస్తాయి. –వైఎస్ విజయమ్మ నాలో.. నాతో.. వైఎస్సార్’ అని అమ్మ.. నాన్నలో ఉన్న ఒక తండ్రి, ఒక భర్త, ఒక మంచి వ్యక్తి గురించి రాసింది. నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ రాసిన ఈ పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరించా. నాన్న బయట ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పరిచయమయ్యారు. నాన్నతోపాటు ప్రయాణం చేసిన సుదీర్ఘ ప్రయాణంలో ఆమె తెలుసుకున్న, చూసిన దానిని ఈ పుస్తకంలో రాశారు. – భావోద్వేగంతో సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం రాత్రి ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో బస చేసిన ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం 8.50 గంటల ప్రాంతంలో వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్నారు. పూలమాలలు వేసి దివంగత వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకం గురించి వైఎస్ జగన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. సీఎం భావోద్వేగాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడున్న వారందరూ చలించిపోయారు. అందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. అనంతరం 9.30 గంటలకు సీఎం సమీపంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణానికి చేరుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతమ్మ, షర్మిల. జగన్‌ను ముద్దాడుతున్న వైఎస్ విజయమ్మ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ► గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సాంకేతిక విద్యనందించేందుకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలోని ట్రిపుల్ ఐటీలో రూ.139.83 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరగతి భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ► రూ.10.10 కోట్ల అంచనాతో నిర్మించనున్న కంప్యూటర్ సెంటర్‌కు, రూ.40 కోట్ల అంచనాతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న డాక్టర్ వైఎస్సార్ ఆడిటోరియంకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆరు ఎకరాల్లో రెండస్తుల్లో ప్రపంచ స్థాయి ఆడిటోరియం నిర్మిస్తున్నారు. ► 3 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు. దీని ద్వారా విద్యుత్ బిల్లులు మరింత తగ్గి సంవత్సరానికి విశ్వవిద్యాలయానికి రూ.1.51 కోట్ల విద్యుత్ ఖర్చు ఆదా కానుంది. అనంతరం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ► తిరిగి 10 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం.. 10.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భారతమ్మ, షర్మిల, వైవీ సుబ్బారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతోపాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సురేష్, చీఫ్ విప్ గడికోట, విప్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వైఎస్సార్ జీవితం అందరికీ ఆదర్శం : వైఎస్ విజయమ్మ వైఎస్సార్ జీవితం అందరికీ ఆదర్శనీయమని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకం ఆవిష్కరణ అనంతరం ఆమె ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► నేను ఆయనలో చూసింది.. ఆయన మాటల్లో విన్నది.. నా 37 ఏళ్ల సహచర్యంలో ఆయన గురించి రాయాలనిపించింది. ఆయన మాటకిచ్చే విలువ గురించి రాయాలనిపించింది. ఎంతో మంది మా జీవితాల్లోకి వచ్చారు. ఎంతో మంది జీవితాలకు విలువనిచ్చారు ఆయన. ఆ విలువ నేను చూశాను. నేను విన్నాను. ఎంతో మంది మా జీవితాలకు వేసిన బాటలు అనుకుంటాను. ► ప్రతి ఒక్కరూ ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు చాలా మంది తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టారు. ఆయనతో చెరగని బంధం నాకే కాదు... చాలా చాలా మందికి కూడా. ► చెరగని చిరునవ్వు, స్వచ్ఛతకు మారుపేరు ఆయన చిరునవ్వు. వైఎస్సార్ స్థైర్యం, దక్షత సాటిలేనివి. అందుకే ఆయన అందరిలో యుగయుగాలుగా నిలిచి ఉంటాడు. రాజశేఖరరెడ్డి గారి నుంచి నేను, నా పిల్లలు చాలా చాలా నేర్చుకున్నాము. ► ఈ రోజుకు నా పిల్లలు.. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మన నాన్న ఏం చేసేవాడు.. మా మామయ్య ఏం చేసేవాడు.. అని ఆలోచించి ముందుకు వెళతారు. మీకు ఏదైనా సందేహం వచ్చినా, సంశయం వచ్చినా, ఏదై నా కష్టం వచ్చినా మీలో బాధ తొలిచి వేస్తున్నప్పుడు ఒక్కసారి ఈ పుస్తకం చదవమని మిమ్మల్ని కోరుతున్నా.. తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాంటిది ఆయన జీవితం. ► ‘తనకు మాత్రమే సొంతమైన కోణం నుంచి నాన్నను లోకానికి అమ్మ కొత్తగా పరిచయం చేసింది. పుస్తకం చదువుతున్నంత సేపు అమ్మతో, నాన్నతో కలసి ప్రయాణిస్తున్నట్లే అనిపించింది. నిజం చెప్పడం సులభం కాదు. అయినా అమ్మ ధైర్యంగా నిజం చెప్పింది. అందుకే ఈ బయోగ్రఫీ అందరం చదవాలి. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఎమెస్కో పబ్లిషర్ విజయ్‌కుమార్‌కు ధన్యవాదాలు’ అని షర్మిల పేర్కొన్నారు. -
ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం
-
ప్రజాసంకల్ప పాదయాత్రకు రెండేళ్లు
-
చరిత్రాత్మకం ప్రజా సంకల్పం
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చేసిన ప్రజా సంకల్ప యాత్రకు నేటి (బుధవారం)తో సరిగ్గా రెండేళ్లు నిండాయి. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకు రావాలన్న సంకల్పంతో వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర పొడవునా జన నేతను కలుసుకోని వర్గం లేదు. అన్ని జిల్లాల్లో జనం తండోపతండాలుగా తరలి వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. మరోవైపు పూలబాట వేసి స్వాగతం పలికారు. మద్యం మహమ్మారికి బలవుతున్న కుటుంబాల నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, అనాథలు, అర్హతలున్నా ఉద్యోగం, ఉపాధి లేని యువతీ యువకులు, విద్యార్థులు పాదయాత్రలో భాగస్వాములై బాధలు చెప్పుకున్నారు. జగన్ అనే నేను.. పాదయాత్రలో ప్రజలకు ‘జగన్ అనే నేను..’ అంటూ ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, భరోసాలే ఆయన్ను ‘జగన్ అనే నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను’ అని చెప్పే వరకు నడిపించాయి. ఈ ఏడాది మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతల పింఛన్‌ను రూ.2,250కి పెంచుతూ జగన్ తొలి సంతకం చేశారు. మంత్రివర్గ కూర్పులో తనదైన శైలిని ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచలనం కలిగించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేనివిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులను ఇచ్చి చరిత్రను తిరగరాశారు. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ‘మాట తప్పను, మడమ తిప్పను’ అనే మాటలను అక్షరాలా నిజం చేస్తూ కొత్త అసెంబ్లీ ఏర్పడిన తర్వాత తొలి సమావేశాల్లోనే 19 చట్టాలు చేసి భారీ ఎత్తున సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని తొలి రోజే ప్రకటించిన జగన్ అందులో పేర్కొన్న ‘నవరత్నాలు’ అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పద వులు, నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అదొక మహా యజ్ఞం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఒక మహాయజ్ఞం. ఆయన సంకల్ప బలమే ఆయన్ను 3,648 కిలోమీటర్లు నడిపించింది. ప్రపంచంలోనే చిరస్థాయిగా నిలిచి పోయిన యాత్ర ఆద్యంతం జగన్‌లో ఏ మాత్రం అలసట అనేది కనిపించలేదు. మధ్యలో హత్యాయత్నం జరిగినా ఆయన ఏమాత్రం జంకలేదు. – తలశిల రఘురామ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ -
రేపు ఇడుపులపాయకు సీఎం జగన్
అమరావతి: దివంగత నేత వైఎస్సార్ 10వ వర్థంతిని పురస్కరించుకుని సోమవారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే పులివెందుల నియోజకవర్గంలో జరిగే వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలకు వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ముందుగా తన తండ్రి వైఎస్సార్‌కు నివాళులర్పించిన తర్వాత పులివెందులలో నిర్వహించే వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం గం.8.00లకు సీఎం జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇడుపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అటు తర్వాత మధ్యాహ్నం గం.12.00లకు పులివెందుల ప్రాంత అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం గం.4.00లకు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. -
2న ఇడుపులపాయకు ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పదో వర్థంతిని పురస్కరించుకుని ఆయన విజయవాడలో సోమవారం ఉదయం బయల్దేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ సమాధి వద్ద వర్థంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని అదే రోజు సాయంత్రానికి విజయవాడకు తిరిగి వస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
దర్శనీయ ప్రాంతంగా ఇడుపులపాయ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, ఎకో టూరిజం కేంద్రాన్ని పచ్చని ఉద్యానవనంలా ఆహ్లాదకర దర్శనీయ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గతంలో ఇడుపులపాయంలో ఎకోటూరిజం కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని రూపకల్పన చేసి మధ్యలో వదిలేశారని, దీన్ని ఇప్పుడు అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకవసరమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలోని వైఎస్సార్ స్మృతివనం విశేషాలపై రూపొందించిన ‘మహానేతకు హరిత హారం’ (గ్రీన్ ట్రిబ్యూట్ టు ఎ గ్రేట్ లీడర్) పుస్తకాన్ని శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్ నుంచి రచ్చబండలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లాకు వెళుతుండగా కర్నూలు జిల్లా ఆత్మకూరు అభయారణ్యంలో హెలికాప్టర్ కూలిపోయి మరణించడం తెలిసిందే. ఆయన స్మారక చిహ్నంగా నల్లకాలువ సమీపంలో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి నిధులు కేటాయించింది. వైఎస్సార్ స్మృతివనం ప్రాజెక్టు డైరెక్టర్‌గా అప్పట్లో పనిచేసిన ఎన్.చంద్రమోహన్‌రెడ్డి (ప్రస్తుతం ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్) చక్కటి ప్రణాళికతో స్మృతివనాన్ని అభివృద్ధిచేశారు. మొత్తం 3,500 ఎకరాల అభయారణ్యాన్ని వైఎస్సార్ స్మృతి వనంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే అభయారణ్యంలో కట్టడాలు ఉండరాదన్న నిబంధన నేపథ్యంలో దీనిపక్కనే 22.20 ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి ఇందులో 20 అడుగుల ఎత్తయిన వైఎస్సార్ విగ్రహం, బయో డైవర్సిటీ పార్కు, వాటర్ ఫౌంటెన్లు, ఉద్యానవనాలు, బటర్‌ఫ్లై పార్కు లాంటివి ఏర్పాటు చేశారు. ఐదంతస్తులతో వ్యూపాయింట్ కూడా నిర్మించారు. మొత్తం పార్కుతోపాటు వైఎస్సార్ మరణించిన కొండ కూడా కనిపించేలా వ్యూపాయింట్‌ను రూపొందించారు. ఈ వివరాలన్నింటితో దివంగత ముఖ్యమంత్రికి నివాళిగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు ఎన్.చంద్రమోహన్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇందుకు రూ.10 కోట్లు అవసరమన్నారు. అన్ని అంశాలను ఆసక్తిగా విన్న సీఎం జగన్ తాను స్మృతివనాన్ని సందర్శించానని, చాలా బాగా అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఇదేతరహాలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, ఎకో టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని సూచించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీరు బలరామిరెడ్డి కూడా పాల్గొన్నారు. -
మహానేతకు వైఎస్ జగన్ ఘన నివాళి
వేంపల్లె : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. పులివెందుల నుంచి రోడ్డు మార్గాన ఉదయం 9 గంటలకు ఆయన ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్సార్ సమాధి వద్ద పూలమాల వేసి కొద్దిసేపు శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అనంతరం వేంపల్లె మీదుగా రోడ్డు మార్గాన కడప విమానాశ్రయం చేరుకుని స్పెషల్ ఫ్లైట్‌లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయన పర్యటనలో కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్బాష, ఎమ్మెల్యే అభ్యర్థులు వెంకటసుబ్బయ్య, సుధీర్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, చక్రాయపేట మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, రైతు విభాగపు జిల్లా అధ్యక్షుడు ఎస్.ప్రసాద్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎస్ఎఫ్ బాషా, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్‌వలి, మాజీ ఎంపీపీ కొండయ్య, పాస్టర్ రవికుమార్, మైనార్టీ కన్వీనర్ మునీర్, నాయకులు రుద్రభాస్కర్‌రెడ్డి, రామగంగిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, షేక్షావలి, మునేష్, రామాంజనేయరెడ్డి తదితరులున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మహానేతకు నివాళులర్పించిన వైఎస్ జగన్
-
ఇడుపులపాయ - ఇచ్ఛాపురం విజయసంకల్పం
-
మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి
-
ఇడుపులపాయలో నివాళులు అర్పించనున్న వైఎస్ఆర్ కుటుంబసభ్యులు
-
మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి
సాక్షి,ఇడుపులపాయ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించినవారిలో మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్‌కు నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా మహానేత సేవలను, ప్రజాసంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ కారణజన్ముడు: వైఎస్ విజయమ్మ దివంగత మహానేత వైఎస్సార్ ఒక కారణజన్ముడని, ఆయన చేసిన కార్యక్రమాలు, పథకాలు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని వైఎస్సార్ సతీమణి, వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ రాజశేఖరరెడ్డిగారు ఇవాళ దేవుడి దగ్గర ఉన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఆయన నిజంగా ఒక కారణజన్ముడు. ఆయన వచ్చి.. చేయాల్సిన కార్యాలన్నీ చేసి.. దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. వైఎస్సార్ ఆశయాలను కాపాడేందుకు జగన్‌బాబు ప్రజాసంకల్పయాత్రలో ప్రజలందరి దగ్గరకు వస్తున్నారు. ఆయనను ఆశీర్వదించండి. జగన్ ప్రజలందరికీ అండగా ఉంటాడు. మీ అందరికి ఒక అన్నగా, తమ్ముడిగా, ఒక మనవడిగా కాపాడుతాడు. రాజశేఖరరెడ్డి రాజ్యాన్ని మరల తెచ్చుకుందాం. వైఎస్ జగన్‌కు అండగా నిలువండి’ అని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. -
వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, ఇడుపులపాయ : ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించేందుకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించి అనంతరం సభావేదికకు చేరుకుంటారు. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించి మారుతినగర్ మీదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి వీరన్నగట్టుపల్లె కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో రాత్రి బస చేస్తారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇడుపులపాయలో జోరందుకున్న ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి ప్రారంభించనున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు ఇడుపులపాయలో ఏర్పాట్లు జోరందుకున్నాయి. సోమవారం ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ నుంచి ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా 180 రోజులు మూడువేల కిలోమీటర్లు సాగే ప్రజాసంకల్ప పాదయాత్రకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో ఇడుపులపాయ నుంచి దువ్వూరు దాకా పాదయాత్రకు స్వాగతం పలుకుతూ పెద్దసంఖ్యలో ఫ్లెక్సీలు, ఆర్చీలు ఏర్పాటు చేశారు. బహిరంగసభ వేదిక ఏర్పాటు పనులు శనివారం ప్రారంభమయ్యాయి. వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి, జిల్లా ఇన్చార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, జెడ్పీటీసీ ప్రవీణ్‌తో పాటు పలువురు నాయకులు సభావేదిక, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి ఈ బాధ్యతలు చూస్తున్న నేతలకు సూచనలు ఇచ్చారు. ఉదయం 9.40 గంటల్లోగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి 9.45 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా బహిరంగసభ వేదికకు చేరుకుని అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, కార్యకర్తల కోసం వైఎస్ మనోహర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం భోజన ఏర్పాట్లు చేస్తోంది. శనివారం నుంచి ఇడుపులపాయలో సందడి ప్రారంభమైంది. నేడు జగన్ రాక... ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం కోసం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పులివెందులకు వెళ్లి మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం ఆరు గంటలకు కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని తిరిగి ఇడుపులపాయకు వెళతారు. రాత్రికి అక్కడే బస చేసి సోమవారం ఉదయం ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభిస్తారు. -
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు
సి.హెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖపట్నం), రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ (కాకినాడ), బొమ్మన రాజ్‌కుమార్ (రాజమండ్రి), జలీల్‌ఖాన్ (ఏలూరు), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు అర్బన్), కుప్పం ప్రసాద్ (ఒంగోలు), ఆనం వెంకటరమణారెడ్డి (నెల్లూరు), పాలగిరి ప్రతాప్‌రెడ్డి (తిరుపతి), రంగంపేట గోపాల్‌రెడ్డి, ధాత్రీక రత్నం (నిజామాబాద్) తుమికి రమేష్‌బాబు (వరంగల్). రూ.3 కోట్ల విరాళాలు సాక్షి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధులు దాదాపు రూ.3 కోట్ల విరాళాలు ప్రకటించారు. విరాళాలు ప్రకటించిన వారిలో కొందరి వివరాలు.. బి.బ్రహ్మనాయుడు(రూ.25 లక్షలు), మేకపాటి గౌతంరెడ్డి (రూ.25 లక్షలు), వైఎస్ అనిల్‌రెడ్డి (రూ.20 లక్షలు), పి శ్రీనాథరెడ్డి(రూ.10 లక్షలు), చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(రూ.7 లక్షలు), సునీల్‌రెడ్డి-సీఎంఆర్ గార్డెన్స్ (రూ.5 లక్షలు), జనక్‌ప్రసాద్(రూ.10 లక్షలు), కొత్తపల్లి గీత(రూ.10 లక్షలు), ఎన్డీ ముస్తాఫా(రూ.5 లక్షలు), గుంటూరు జిల్లా సమన్వయకర్తలు (రూ.10 లక్షలు), చెలిమిశెట్టి సునీల్(రూ.5 లక్షలు), బుడ్డా వెంకటరమణ చౌదరి(రూ.5 లక్షలు), ఆదిరెడ్డి అప్పారావు (రూ.5.50 లక్షలు), సి.సత్యనారాయణరెడ్డి(రూ.3 లక్షలు), పినిపె విశ్వరూప్ (రూ.5 లక్షలు), గొట్టిపాటి రవికుమార్/భరత్(రూ.5 లక్షలు), సామినేని ఉదయభాను(రూ.2.25 లక్షలు), పొంగులేటి శ్రీనివాసులరెడ్డి(రూ.2 లక్షలు), ఈసీ శేఖర్‌గౌడ్ (లక్ష), కె.రాజబాబు(లక్ష), డి. నాగేశ్వరరావు(లక్ష), డాక్టర్ సూర్యనారాయణ(లక్ష), పీఏ రాజశేఖరరెడ్డి(లక్ష), జోగిరమేశ్(లక్ష), కావలి సుధాకర్(లక్ష), జ్యోతుల నెహ్రూ(లక్ష), ఓ. శ్రీనివాసయాదవ్(లక్ష), ధర్మాన కృష్ణదాస్ దంపతులు(లక్ష), గట్టు శ్రీకాంత్(లక్ష), నందమూరి లక్ష్మీపార్వతి(లక్ష), కొలను శ్రీనివాసరెడ్డి(లక్ష), కొణతాల రామకృష్ణ(లక్ష), చల్లమధుసూదన్(రూ.1,11,116). వీరితో పాటు పలు జిల్లాల ప్రతినిధులు విరాళాలు ప్రకటించారు. ఆకట్టుకున్న థీమ్ సాంగ్ ఆదివారం ఇడుపులపాయలో జరిగిన వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశానికి ముందు థీమ్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ‘మన రిథం వైఎస్ఆర్.. మన జెండా వైఎస్ఆర్.. మనకు స్ఫూర్తి వైఎస్ఆర్.. మన ఆశయం వైఎస్ఆర్..’ అంటూ సాగిన పాటలో మహానేత రూపకల్పన చేసిన పలు పథకాలను ప్రస్తావించారు.