'వైఎస్‌ జగన్‌' ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు | YS Jagan's Praja Sankalpa Yatra Completes 3Years - Sakshi
Sakshi News home page

ప్రజా సంకల్పమే నిత్య స్ఫూర్తి

Published Fri, Nov 6 2020 3:56 AM | Last Updated on Fri, Nov 6 2020 2:38 PM

CM YS Jaganmohan Reddy Praja Sankalpa Yatra Completed Three Years - Sakshi

సాక్షి, అమరావతి:  దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా, చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయింది. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి ఆయన ఆశీర్వాద బలంతో 2017 నవంబర్‌ 6వ తేదీన జగన్‌ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర చరిత్రనే మలుపు తిప్పిన ఈ పాదయాత్రను జగన్‌ ఎండనక, వాననక 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా కొనసాగించారు. 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసిన ఈ యాత్రలో తొలి నుంచీ జనంతో మమేకం అవుతూ.. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగిన ఆయన పట్టుదలతో తన రాజకీయ ప్రస్థానాన్ని చేరుకున్నారు.

ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక కూడా ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. అద్వితీయమైన రీతిలో 151 శాసనసభ, 22 లోక్‌సభా స్థానాల్లో విజయం సాధించి మే 30వ తేదీన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారు. పాదయాత్ర స్ఫూర్తితో 17 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పాలనను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్నదే నా కసి.. ‘చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు.. ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తే లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి.. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి’ అని జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో జగన్‌ ప్రజలకు మాట ఇచ్చారు.  

అక్కడి నుంచి అశేష జనవాహిని నడుమ దిక్కులు పిక్కటిల్లేలా పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుండగా ముందుకు కదిలారు. అశేష జనవాహినితో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు కిటకిటలాడాయి. 13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తొలుత అంచనా వేసినా, తుదకు అది 14 నెలల పాటు సాగింది. యాత్రకు అడ్డంకులు సృష్టించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చూసినా, సాధ్యం కాలేదు. 

► వినమ్రంగా కోర్టు ఆదేశాలను శిరసావహిస్తూనే.. వారంలో ఆరు రోజులు యాత్రను కొనసాగించారు. పండుగలు, పబ్బాలను ప్రజల మధ్యనే గుడారాల్లో జరుపుకున్నారు. జగన్‌ను కలిసేందుకు రైతులు, నిరుపేద ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాల నేతలు తరలి వచ్చి, సమస్యలు విన్నవించారు. వారి ఆంకాంక్షలకు అనుగుణంగానే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు.   

► 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్‌ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్‌ నడిచారు. 13 జిల్లాలు, 134  నియోజకవర్గాలు, 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్‌ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. భయపడే ప్రసక్తే లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి.. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి’ అని జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో జగన్‌ ప్రజలకు మాట ఇచ్చారు.  

► అక్కడి నుంచి అశేష జనవాహిని నడుమ దిక్కులు పిక్కటిల్లేలా పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుండగా ముందుకు కదిలారు. అశేష జనవాహినితో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు కిటకిటలాడాయి. 13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తొలుత అంచనా వేసినా, తుదకు అది 14 నెలల పాటు సాగింది. యాత్రకు అడ్డంకులు సృష్టించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చూసినా, సాధ్యం కాలేదు. 

► వినమ్రంగా కోర్టు ఆదేశాలను శిరసావహిస్తూనే.. వారంలో ఆరు రోజులు యాత్రను కొనసాగించారు. పండుగలు, పబ్బాలను ప్రజల మధ్యనే గుడారాల్లో జరుపుకున్నారు. జగన్‌ను కలిసేందుకు రైతులు, నిరుపేద ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాల నేతలు తరలి వచ్చి, సమస్యలు విన్నవించారు. వారి ఆంకాంక్షలకు అనుగుణంగానే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు.   

► 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్‌ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్‌ నడిచారు. 13 జిల్లాలు, 134  నియోజకవర్గాలు, 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్‌ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement