
అమరావతి: దివంగత నేత వైఎస్సార్ 10వ వర్థంతిని పురస్కరించుకుని సోమవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే పులివెందుల నియోజకవర్గంలో జరిగే వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలకు వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ముందుగా తన తండ్రి వైఎస్సార్‌కు నివాళులర్పించిన తర్వాత పులివెందులలో నిర్వహించే వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
ఉదయం గం.8.00లకు సీఎం జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇడుపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అటు తర్వాత మధ్యాహ్నం గం.12.00లకు పులివెందుల ప్రాంత అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం గం.4.00లకు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.