క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, వైఎస్ జగన్‌ను ప్రేమించే అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.