
సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, విజయమ్మ, వైఎస్ భారతి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్, విజయమ్మ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సరేష్, అవంతి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment