pulivendula church
-
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
-
క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్
-
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, విజయమ్మ, వైఎస్ భారతి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్, విజయమ్మ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సరేష్, అవంతి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. -
పులివెందుల చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనలకు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వైఎస్ జగన్‌తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ తదితరులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకు ముందు క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న అందరికీ వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలో ప్రతి ఒక్కరిని ఆయన ఆత్మీయంగా పలకరించారు. అంతేకాకుండా ప్రార్థనలలో పాల్గొన్న వారి యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. -
పులివెందుల చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు