వైఎస్‌ కుటుంబంపై పచ్చ కుట్ర | YS Vijayamma Open Letter Slams Yellow Media TDP Chandrababu | Sakshi
Sakshi News home page

వైఎస్‌ కుటుంబంపై పచ్చ కుట్ర

Published Mon, Apr 5 2021 8:14 PM | Last Updated on Tue, Apr 6 2021 5:24 PM

YS Vijayamma Open Letter Slams Yellow Media TDP Chandrababu - Sakshi

సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నా.. తనకు న్యాయం జరగడం లేదని సునీతమ్మ కుంగిపోతోందట. షర్మిలమ్మ కూడా సునీతకు మద్దతుగా నిలబడ్డారట. మా బంధువర్గం కూడా రెండుగా చీలిపోయిందట. జరుగుతున్న పరిణామాలు చూసి నేను మానసికంగా కుమిలిపోతున్నానట. ఏమి రాతలివి? అసలు జగన్‌.. వివేకానందరెడ్డి మీద చెయ్యి చేసుకున్నాడని రాయడమేంటి? వయసులో పెద్దయితే.. ఇంట్లో ఉన్న తోటమాలిని కూడా ‘అన్న’ అని సంభోదించే మనస్తత్వం జగన్‌ది.  – వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ 

సాక్షి, అమరావతి: ఎల్లో మీడియా గాలినంతా పోగేసి, తమ కుటుంబంపై దుర్మార్గపు రాతలు రాస్తోందని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, ఏపీ సీఎం మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై దాడి చేసిన విధంగానే.. ఇప్పుడు తన ఇద్దరు పిల్లలపై చిలువలు పలువలుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తన కుటుంబంలో కలహాలున్నాయనడం అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులెవరో నిగ్గు తేల్చాలని తమ కుటుంబంలో ప్రతి ఒక్కరూ డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. జనంలో జగన్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా విషం చిమ్ముతోందన్నారు. వైఎస్‌ కుటుంబంపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొడుతూ ఆదివారం ఆమె బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. 

ఎల్లో మీడియా వెకిలి రాతలు...
ఎల్లో మీడియా మూడు రోజులుగా మా కుటుంబం గురించి చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలను గమనించిన తర్వాత, వైఎస్‌ రాజశేఖరరెడ్డి భార్యగా ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను. డాక్టర్‌ వైఎస్సార్‌ 2009 సెప్టెంబర్‌ 2న మరణించిన నాటి నుంచి మా కుటుంబం ఎవరెవ రికి ఏయే కారణాల వల్ల లక్ష్యంగా మారిందో రాష్ట్రంలో రాజకీయాల మీద ప్రాథమిక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రజల్లో చంద్రబాబు బలాన్ని పెంచలేమనే నిర్ణయానికి వచ్చినప్పు డల్లా.. మమ్మల్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ, ఆ పార్టీకి మద్దతిచ్చే ఈనాడు– ఈటీవీ, ఆంధ్రజ్యోతి– ఏబీఎన్, టీవీ 5 వంటి మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా వార్తలు, చర్చలు ప్రసారం చేస్తు న్నాయన్నది జగమెరిగిన సత్యం. ఏడేళ్లుగా పవన్‌ కల్యాణ్‌ కూడా ఆ బాటలోనే మా కుటుంబాన్ని టార్గెట్‌ చేయటం అందరికీ తెలిసిన విషయమే.

ఈ ఎల్లో మీడియా ఎవరికోసం పనిచేస్తోందో అందరికీ తెలుసు
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీకి ప్రజలు చరిత్రలో కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు చంద్రబాబు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఇది ఎల్లో మీడియాకు కనిపించదు. ఈ ఎల్లో మీడియా రాజకీయంగా ఎవరి కోసం ఈ పని చేస్తోందో అందరికీ తెలుసు. చిన్న గీతను పెద్దది చేయలేం కాబట్టి, పెద్ద గీతను చెరిపి చిన్నది చేసేందుకు పైన చెప్పిన పార్టీలు, వ్యక్తులు ఒకే మాట, ఒకే బాటగా అబద్ధాలు చెప్పటం ప్రారంభించారు. వారి అసత్యాలను ప్రజలు ఏనాడూ పరిగణనలోకి తీసు కోలేదు కాబట్టే, ఆనాడు మహానేతకు, ఇప్పుడు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీకి అనుకూలంగా ప్రజలను ఒప్పించడం సాధ్యం కావటం లేదు కాబట్టి, మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మమ్మల్ని తగ్గించాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చూస్తున్నాడు. 

వివేకా హత్య దర్యాప్తు ఎవరి చేతుల్లో ఉంది? 
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేయాల్సింది సీబీఐ, ఎన్‌ఐఏ. ఈ రెండూ కూడా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కావు. ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. దర్యాప్తు వేగం పెంచాలని, వైఎస్‌ జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. నిజాలు ఇలా ఉంటే రాధాకృష్ణ ఏం రాశారు? డాక్టర్‌ సునీత ప్రశ్నలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలంటా డు! వివేకానంద మీద జగన్‌ చేయి చేసుకున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయంటాడు. సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నా.. తనకు న్యాయం జరగడం లేదని సునీతమ్మ కుంగిపోతోందని రాశాడు. అదే సమయంలో షర్మిలమ్మ కూడా సునీతకు మద్దతుగా నిలబడ్డారని రాశాడు. మా బంధువర్గం కూడా రెండుగా చీలిపోయిందని, జరుగుతున్న పరిణామాలు చూసి నేను మానసికంగా కుమిలిపోతున్నట్టు రాశాడు. అసలు జగన్‌.. వివేకానందరెడ్డి మీద చెయ్యి చేసుకోవడమేంటి? వయసులో పెద్దయితే.. ఇంట్లో ఉన్న తోటమాలిని కూడా ‘అన్న’ అని సంబోధించే మనస్తత్వం జగన్‌ది. 

జగన్‌ మనస్తత్వం జనానికి తెలియదా? 
సంవత్సరాల తరబడి జరిగిన ప్రజా సంకల్ప పాదయాత్ర, ఓదార్పు యాత్రలో జగన్‌ స్వభావం, మనస్తత్వం ఎలాంటివో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఈ విషయాలు అందరికీ తెలుసు. ఇంత తీవ్రమైన అసత్య ఆరోపణలను రాధాకృష్ణ ఏ నోటితో చేయగలుగుతున్నాడు. వివేకానంద రెడ్డి వర్ధంతికి నివాళులు అర్పించకుండా ఎవరో అడ్డుకున్నారని రాశాడు. నిజానికి ఆ సందర్భంలో నన్ను హాజరుకమ్మని జగనే నాకు చెప్పాడు. ఇలాంటి సందర్భాల్లో వెళ్లవద్దనే కుసంస్కారం మా ఇంటావంటా లేవు.

షర్మిల తెలంగాణలో ఉండాలనుకుంది
ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, తనకు పొరుగున ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, అక్కడి ప్రభుత్వంతోనైనా తన రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా సత్సంబంధాలు ముఖ్యమని భావించినందువల్లే వైఎస్సార్‌సీపీని తెలంగాణలో నడిపించడం కుదరదని స్పష్టం చేశారు. అందువల్లే ఈ ప్రాంత కోడలిగా ప్రజల్లో, ప్రజా సేవలో ఉండాలని షర్మిలమ్మ నిర్ణయించుకుంది. ఇది వేరెవరో అభిప్రాయాలే తప్ప, వారిద్దరి మధ్య విభేదాలు మాత్రం కావు. అయినా ఓ వీక్లీ సీరియల్‌గా అసత్యాలతో కథలు రాశారు. ఇక సునీత విషయానికొద్దాం. వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్టి, శిక్షించాలనేదే సునీత డిమాండ్‌. అదే మా కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఈ విషయంలో మా అందరి మద్దతు ఆమెకు ఉంది. మహిళల పట్ల జగన్‌కున్న అత్యంత గౌరవం, అభిమానం ఆయన పాలనలో, అనేక పథకాల్లో కన్పిస్తున్నాయి.

సన్యాసం చేసిన బాబుకు బాకా ఎందుకు?
నేను ముందుగానే చెప్పినట్టు.. వీరు తమ మీడియాలో ఎంతగా చంద్రబాబు భజన చేస్తున్నా దాని వల్ల ప్రయోజనం లేదు. చంద్రబాబే రాజకీయ సన్యాసం చేస్తున్నాడు. కాబట్టి వీరికి ఇక మిగిలిన దారేంటి? అసత్యాలు, కట్టుకథలతో వైఎస్సార్‌ కుటుంబం మీద పడాలన్న నిర్ణయంతోనే గడచిన ఏడాదిగా ఇలాంటి రాతలు మరీ ఎక్కువయ్యాయి. వైఎస్‌ జగన్, రాష్ట్రపతి ఏం మాట్లాడుతున్నారు? ప్రధాని, జగన్‌ ఏం మాట్లాడుకున్నారు?.. వారి మధ్య వీళ్లే ఉన్నట్టుగా, పరస్పర సంభాషణలను కూడా ఊహించుకుని, దాన్ని ప్రచారం చేసే పత్రికలతో, అలాంటి వార్తలను పట్టుకుని ప్రెస్‌మీట్లు పెట్టే పార్టీలతో మా కుటుంబం గత నాలుగున్నర దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. అసత్యాలను ఇంతగా నమ్ముకుని పత్రికలను, పార్టీలను నడుపుకునేకంటే, వీళ్లంతా వేరే పని చేసుకుంటే బాగుంటుంది. 

వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబే సీఎం
మా మరిది, వైఎస్‌ వివేకానందరెడ్డిని 2019 మార్చిలో ఎవరు హత్య చేశారన్నది కచ్చితంగా నిగ్గు తేలాల్సిందే. నాది.. జగన్‌ది.. షర్మిలమ్మది ఇదే మాట. మా కుటుంబంలో ఎప్పటికీ రెండు మాటల్లేవు. వివేకా హత్య జరిగింది 2019 మార్చి లో. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబే. ఆ హత్య తర్వాత కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ హత్యకు సంబంధించిన విషయం లో.. చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసి, ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన ఆదినారాయణరెడ్డి పాత్రపై అనేక అనుమానాలున్నాయి. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయనను పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో స్టేజీ మీద పెట్టుకున్నారు. దర్యాప్తు సీబీఐ చేతిలో.. అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిసీ, జగన్‌ మీద విమర్శలు చేశారు. ఇక జగన్‌ మీద హత్యాయత్నం 2018 అక్టోబర్‌లో జరిగితే.. 2019 మే వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్నారు. దర్యాప్తునకు సంబంధించిన కీలక సమయంలో చంద్రబాబే కేసులను డీల్‌ చేశారన్న నిజాన్ని మరచిపోయి, ఇప్పుడా దర్యాపు కేంద్రం చేస్తోందని తెలిíసీ.. ఈ రోజు ఏదిపడితే అది మాట్లాడుతున్నాడు.

మా సంస్కారం ఎల్లో మీడియాకేం తెలుసు? 
ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్‌ స్వయంగా తనకు సంబం«ధించిన కేసే అయినా, లేక తన బాబాయి హత్య కేసయినా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నప్పుడు తాను చేసేది మాత్రం ఏముంటుంది? ఇవన్నీ అందరికీ అర్థమవుతున్న నిజాలు. అంతెందుకు.. వైఎస్సార్‌ది ప్రమాద మరణమా? లేక హత్యా? అన్న అను మానం ఆ రోజు అందరిలో ఉంది. మాకూ ఆ అనుమానం ఉంది. కానీ అప్పుడైనా మేం ఏం చేయగలిగాం? మా సంస్కారాన్ని తెలుగుదేశం నేతలు, వాళ్ల అనుకూల మీడియా అధిపతులు గౌరవించకపోయినా ఫర్వాలేదు. కానీ కుటిలమైన రాతలేంటి? బురద పూయడం వాటి పని. శుభ్రం చేసుకోవడం మా పని అన్నట్టుగా రాస్తున్నాయి. చంద్రబాబుకు అధికారం పోయిందన్న కడుపు మంటను ఈ రాతలే స్పష్టం చేస్తున్నాయి. 

నా పిల్లల్ని చూసి గర్వపడుతుంటే...
నా పిల్లలను చూసి, వైఎస్సార్‌ భార్యగా, వారి తల్లిగా ఎప్పుడూ గర్వపడ్డానే తప్ప.. నేనెప్పుడూ కుంగిపోలేదు. నా పిల్లలు ఇద్దరు ప్రజాసేవలో ఉన్నారని, పట్టుదలతో అడుగులు ముందుకేస్తున్నారని, ఎలాంటి ఎదురు గాలినైనా తట్టుకుని జగన్‌ నిలబడ్డాడని, పాలనలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడని, మహానేతకు భార్యగా, ఏపీ ముఖ్యమంత్రి తల్లిగా ఉన్న నేను.. గర్వపడతానా? లేక కుంగిపోతానా? షర్మిలమ్మ  రాజకీయ భవిష్యత్‌ తెలంగాణలో ఉందని నమ్మింది. ఓదార్పు యాత్ర కావచ్చు.. పాదయాత్ర కావచ్చు.. తెలంగాణలో అవకా శాన్ని దేవుడు తనకే ఇచ్చాడంటే.. దాని అర్థం తెలంగాణ ప్రజలతో తనకు అనుబం«ధాన్ని దేవుడు ఆనాడే రాశాడని షర్మిలమ్మ నమ్ముతోంది. కాబట్టే ఆమె తెలంగాణలో ముందడుగు వేస్తోంది. ఎల్లో మీడియా పిచ్చి రాతలతో నా బిడ్డల మధ్య విభేదాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఏనాటికీ జరగదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement