దురుద్దేశంతోనే నకిలీ పీడీఎఫ్‌: వైవీ సుబ్బారెడ్డి | Naalo Natho Ysr Book PDF File Is Being Circulated On Malicious Intent With Social Media | Sakshi
Sakshi News home page

దురుద్దేశంతోనే నకిలీ పీడీఎఫ్‌: వైవీ సుబ్బారెడ్డి

Published Sat, Jul 11 2020 2:30 PM | Last Updated on Sat, Jul 11 2020 2:39 PM

Naalo Natho Ysr Book PDF File Is Being Circulated On Malicious Intent With Social Media  - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘నాలో..నాతో..వైఎస్సార్‌’’ పుస్తకం పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ను సామాజిక మాధ్యమాల్లో సర్క్యూలేట్‌ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, వైఎస్ విజయమ్మ రాసిన పుస్తకానికి, దీనికి సంబంధం లేదని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. ఎమెస్కో పబ్లిషర్స్‌ అచ్చువేసిన పుస్తకమే అసలైన పుస్తకమని ఆయన స్పష్టం చేశారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న పీడీఎఫ్‌ ఫైల్‌లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయి. దురుద్దేశంతో ఈ పీడీఎఫ్‌ఫైల్‌ను సర్క్యులేట్‌చేస్తున్నారు. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామని, వైఎస్సార్‌ అభిమానులు కూడా ఈ అంశాన్ని గమనించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement