-
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీని దక్కించుకున్న పీడీఎఫ్
-
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్ ప్రశ్నలకు ఇట్టే సమాధానం
చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ ప్రశ్నకైనా ఇట్టే సమాధానం లభిస్తోంది. ఇప్పటికే మనం చాట్‌జీపీటీని ఉపయోగించి రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆరోగ్యం కోసం చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నాం. ఈ కథనంలో పీడీఎఫ్ ఫైల్స్‌లో ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే ఏడు ఏఐ పవర్డ్ టూల్స్ గురించి ఇక్కడ చూసేద్దాం..ఆస్క్ యువర్ పీడీఎఫ్ (AskYourPDF)AskYourPdf అనేది PDFలను అప్లోడ్ చేయడానికి మాత్రమే కాకుండా సంబంధిత సమాచారాన్ని తొందరగా తిరిగి పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో మీ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తరువాత పీడీఎఫ్‌లోని ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు.. ప్రశ్నను ఎంటర్ చేయవచ్చు. మీరు ఎంటర్ చేసిన తరువాత ఆస్క్ యువర్ పీడీఎఫ్ మీకు సమాధానం అందిస్తుంది.ఆస్క్ యువర్ పీడీఎఫ్ అనేది పూర్తిగా ఉచితం. ఇందులో కేవలం పీడీఎఫ్ మాత్రమే కాకుండా.. PPT, TXT, CSV వంటి వాటిని కూడా అప్లోడ్ చేయవచ్చు. తెలుసుకోవలసిన ప్రశ్నలను గురించి సర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అయితే అప్లోడ్ చేసే ఫైల్ సైజ్ 40 ఎంబీ పరిమాణంలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.చాట్‌పీడీఎఫ్ (ChatPDF)చాట్‌పీడీఎఫ్ జీపీటీ 3.5 టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఇది మల్టిపుల్ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో హిస్టరీ వంటి వాటిని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆస్క్ యువర్ పీడీఎఫ్ మాదిరిగానే.. చాట్‌పీడీఎఫ్ లింక్ ద్వారా కూడా డాక్యుమెంట్‌ను ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. దీనిని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు, పెయిడ్ ప్లాన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఉచితంగా ఉపయోగించుకోవాలంటే ఫైల్ సైజ్ 10 ఎంబీ, పేజీలు 120 వరకు మాత్రమే. పెయిడ్ ప్లాన్‌లో కొన్ని ఇతర ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు.డాక్యుమైండ్ (Documind)మల్టిపుల్ పీడీఎఫ్‌లలో ఒకేసారి సమాచారాన్ని వెతకడం కోసం ఈ డాక్యుమైండ్ ఉపయోగపడుతుంది. మీరు ఎక్కువ డాక్యుమెంట్లను ఒకేసారి అప్లోడ్ చేసిన తరువాత.. తెలుసుకోవలసిన ప్రశ్నలను సెర్చ్ చేసుకోవచ్చు, ఖచ్చితమైన సమాధానాలను అందించడానికి డాక్యుమైండ్ అప్లోడ్ చేసిన అన్ని పత్రాలను స్కాన్ చేస్తుంది. దీనిని కేవలం 15 సార్లు మాత్రమే ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత పెయిడ్ ప్లాన్ కోసం అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం నెలకు 5 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.లైట్ పీడీఎఫ్ (LightPDF)లైట్ పీడీఎఫ్ అనేది మీ ప్రశ్నలకు తొందరగా సమాధానాలను అందించడమే కాకుండా.. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ కంటెంట్ ఆధారంగా సమ్మరీస్, అవుట్ లైన్స్, పట్టికలను రూపొందించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కేవలం పీడీఎఫ్ ఫైల్లకు మాత్రమే పరిమితం కాదు. ఎక్స్ఎల్, వర్డ్, పీపీటీ ఫైల్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు 200 కంటే ఎక్కువ పేజీలు ఉన్న పీడీఎఫ్ లేదా వేరే ఫార్మాట్లో ఫైల్‌లను అప్లోడ్ చేయాలనుకుంటే పెయిడ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది.పీడీఎఫ్ ఏఐ (PDF.ai)పీడీఎఫ్ ఏఐ అనేది అన్నింటికంటే సులభమైన ఇంటర్ఫేస్. ఇందులో ట్యాబ్ రెండు నిలువు వరుసలుగా కనిపిస్తుంది. ఒక వరుస డాక్యుమెంట్ కోసం, రెండో వరుస చాట్‌బాట్ కోసం. డ్యాష్‌బోర్డ్‌లో మీరు అప్లోడ్ చేసిన అన్ని డాక్యుమెంట్‌ను చాట్ హిస్టరీ యాక్సెస్ చేస్తుంది. మీరు నేరుగా డాక్యుమెంట్‌లోని సంబంధిత పేజీకి నావిగేట్ చేసుకునే అవకాశం కూడా ఇందులో లభిస్తుంది. డిస్ప్లే, జూమ్ సెట్టింగ్స్ వంటి వాటిని కూడా ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ అకౌంట్ ద్వారా కేవలం ఒక పీడీఎఫ్ మాత్రమే అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ మీరు నెలకు 17 డాలర్లను పే చేస్తే.. 100 డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయవచ్చు, అదే నెలకు 5000 ప్రశ్నలను అడగవచ్చు.హుమాటా (Humata)టీమ్ ఉపయోగించడానికి ఓ మంచి టూల్స్ కోసం సర్చ్ చేస్తున్నట్లయితే.. హుమాటా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఫైల్‌లను ఫోల్డర్లలో అమర్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది PDF, DOCX, PPT వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫ్రీ ప్లాన్ మాత్రమే కాకుండా పెయిడ్ ప్లాంట్ కూడా ఉంటుంది. ప్రతి పేజీకి 0.01 నుంచి 0.02 డాలర్ చెల్లించాల్సి ఉంటుంది.బన్నీ (Bunni)అమౌట్ పే చేసి ఉపయోగించడానికి ఇష్టపడితే.. ఈ టూల్ మంచి ఎంపిక అవుతుంది. ఇది మల్టిపుల్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో మీద సమాధానాలు మాత్రమే కాకుండా.. సూచలను కూడా అందిస్తుంది. ఇందులో సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు. ఇది వివిధ భాషలకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీ భాషలోనే సమాధానం పొందవచ్చు. -
సాయుధ తెలంగాణకు ఓటు ఆయుధమై..
అది 1952 మార్చి 27... కాలినడకన కొందరు, ఎడ్ల బండ్లపై మరికొందరు సుదూరాన ఉన్న పోలింగ్ బూత్‌లకు ఒకరెనక ఒకరు వెళ్లి తమ ఓటుతో తొట్టతొలి ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకున్న రోజు. సుమారు 224 ఏళ్ల అసఫ్‌జాహీల రాచరికం, ఆపై నాలుగేళ్ల సైనిక పాలన అనంతరం హైదరాబాద్ రాష్ట్రంలో ఓటు వేసేందుకు జనం వస్తారో లేదోనన్న అధికారుల అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలి ఎన్నికలోనే జనచైతన్యం ఓటెత్తింది. అప్పటివరకు తుపాకుల నీడలో అభద్రత, భయం నీడలో తలదాచుకున్న వారంతా ఊరూరా కదిలి మొత్తంగా 52,02,214 మంది ఓటు వేయడంతో అధికార యంత్రాంగం సంబురపడింది. నాటి ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మాపూర్‌కు చెందిన జరుపాటి రాములమ్మ (110) తొలి ఓటు వేసి తమకు స్వాతంత్య్రం రావడం నిజమేనని నమ్మినట్టు పేర్కొంది. మిశ్రమ ఫలితాలు... నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థులు విజయం సాధించగా సత్యాగ్రహ పోరాటాలు జరిగిన హైదరాబాద్, ఔరంగాబాద్, గుల్బర్గా డివిజన్లలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తంగా తెలుగు ప్రజలు ప్రభావం చూపే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు, పీడీఎఫ్ 35 స్థానాల్లో, సోషలిçస్టు పార్టీ 11 చోట్ల, మరో 10 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. బీఆర్ అంబేడ్కర్ ఆధ్వరంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎస్సీఎఫ్) 5 చోట్ల గెలవగా అందులో తెలంగాణలోని ద్విసభ నియోజకవర్గాలైన జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్ స్థానాలను కైవసం చేసుకుంది. అంటే మొత్తంగా తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోని ఓటర్లు 66 స్థానాల్లో కాంగ్రేసేతర అభ్యర్థులను గెలిపించారు. అప్పటి ఓటు.. ఇంకా గుర్తుంది నాకు ఓటు వచ్చే సరికి 40 ఏళ్లు . ఇప్పుడు 110 ఏళ్ల వరకు ఉంటాయనుకుంటా. అప్పుడు ఎండాకాలం. ఊరోళ్లమంతా నడుచుకుంటూ వెళ్లి ఓటు వేసినం. ఇంకా నాకు గుర్తుంది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు తప్పకుండా వేస్తున్న. – జరుపాటి రాములమ్మ, లక్ష్మాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా తొలి సభలో అత్యధికం విద్యావంతులే.. హైదరాబాద్ తొలి శాసనసభకు ఉన్నత విద్యావంతులే అత్యధికంగా ఎన్నికైయ్యారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివిన మాసూమాబేగం శాలీబండ స్థానం నుంచి ప్రముఖ కవి ముగ్ధూం మోహియొద్దీన్‌ను ఓడించారు. 1927లో ఉస్మానియాలో గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ జీఎస్ మెల్కొటే ముషీరాబాద్ నుంచి విజయం సాధించారు. చాదర్‌ఘాట్ నుంచి జస్టిస్ గోపాలరావు ఎక్బోటే, సోమాజిగూడ నుంచి మెహిది నవాజ్ జంగ్, వనపర్తి నుంచి సురవరం ప్రతాపరెడ్డి, షాద్‌నగర్ నుంచి బూర్గుల రామకృష్ణారావు, వికారాబాద్ నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, బేగంబజార్ నుంచి కాశీనాథ్ వైద్య గెలుపొందారు. ఓటు వేయకపోవడం చనిపోవడంతో సమానం.. నాకిప్పుడు 103 ఏళ్లు. తొలి ఎన్నికలప్పుడు మా ఊర్లో డప్పు చాటింపు వేసి ఓటు వేసేందుకు పిలుచుకొనిపోయిండ్రు. అప్పటి నుంచి ఓటు తప్పకుండా వేస్తున్న. ఓటు వేయకపోతే చనిపోవడంతో సమానమని నమ్ముత. వచ్చే ఎన్నికల్లోనూ ఓటు వేస్త. – మల్తుం బాలవ్వ, చిట్యాల, కామారెడ్డి అజ్ఞాతం నుంచి చట్ట సభకు.. తొలుత నిజాం, ఆపై భారత సైన్యంపై తుపాకులు ఎక్కుపెట్టిన కమ్యూనిస్టు పార్టీల నాయకులు అనేక మంది అజ్ఞాతం వీడిన అనంతరం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. భువనగిరి అసెంబ్లీ నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన రావి నారాయణరెడ్డి జైలు నుంచే నామినేషన్ వేసి స్వయానా తన బావమరిది భూదాన్ రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. గత 70 ఏళ్లలో ఓటు తప్పలేదు.. నాకిప్పుడు 98 ఏళ్లు. రజాకార్ల బాధలు ప్రత్యక్షంగా చూసినం. వారిపై తిరగబడినం. స్వతంత్రం వచ్చినంక తొలి ఎన్నికలో ఓటు వేసేందుకు ఎడ్లబండిలో పోయినం. 1952 ఎన్నికల నుంచి ప్రతిసారీ ఓటు వేస్తూనే ఉన్న... – చల్లారం మధురవ్వ, తిమ్మాయపల్లి, సిద్దిపేట - శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి -
దురుద్దేశంతోనే నకిలీ పీడీఎఫ్: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, అమరావతి: ‘‘నాలో..నాతో..వైఎస్సార్’’ పుస్తకం పేరుతో పీడీఎఫ్ ఫైల్‌ను సామాజిక మాధ్యమాల్లో సర్క్యూలేట్ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, వైఎస్ విజయమ్మ రాసిన పుస్తకానికి, దీనికి సంబంధం లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎమెస్కో పబ్లిషర్స్ అచ్చువేసిన పుస్తకమే అసలైన పుస్తకమని ఆయన స్పష్టం చేశారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న పీడీఎఫ్ ఫైల్లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయి. దురుద్దేశంతో ఈ పీడీఎఫ్‌ఫైల్‌ను సర్క్యులేట్‌చేస్తున్నారు. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామని, వైఎస్సార్ అభిమానులు కూడా ఈ అంశాన్ని గమనించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. -
ఎస్వీయూలో ఆందోళనల పర్వం
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక వైపు ఎన్ఎంఆర్ ఉద్యోగులు, మరో వైపు పోస్ట్ డాక్టరల్ ఫెలో(పీడీఎఫ్)లు విడివిడిగా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టారు. టైంస్కేల్ డిమాండ్ చేస్తూ ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఈ నెల 19 నుంచి పోరుబాట పట్టారు. మరో వైపు తమకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని పీడీఎఫ్‌లు సోమవారం నుంచి దీక్షలు చేపట్టారు. కాగా హాస్టల్ ఉద్యోగులు కూడా ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఈ ఆందోళనల్లో భాగంగా మంగళవారం ఎన్ఎంఆర్ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మహిళా ఉద్యోగులు కళ్లకు గంతలతో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ముందుగా గోల్డన్ జూబ్లీ ఆర్చి వద్ద నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ చేశారు. పరిపాలన భవనం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు ఆముదాల చిరంజీవి, నాగవెంకటేశు, బాలనరసింహారెడ్డి, మఠం గిరిబాబు పాల్గొన్నారు. అలాగే ఉద్యోగ భధ్రత కోరుతూ పీడీఎఫ్‌లు నిరసన దీక్ష కొనసాగించారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు వెంకటస్వామి, కాసారం లత, గంగాధర్ తదతరులు పాల్గొన్నారు. -
పీడీఎఫ్ బియ్యం పట్టివేత
కురుపాం: మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎఫ్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్ఐ వి.బాలాజీరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు రావాడ కూడలిలో ఓ వ్యాపారి వద్ద అక్రమంగా పీడీఎఫ్ బియ్యం ఉన్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించగా నిల్వ ఉంచిన 1400 కేజీల పీడీఎఫ్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్‌డీటీకి అప్పజెప్పనున్నట్లు ఆయన తెలిపారు. బియ్యం పట్టివేత జామి: మండలంలో అట్టాడ గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రి గంట్యాడ మండలం నుంచి అట్టాడ మీదుగా అక్రమంగా బియ్యంతో వస్తున్న లారీ సమాచారం స్థానికులు పోలీసులకు తెలపడంతో జామి ఎస్ఐ బి.లక్ష్మణరావు సిబ్బంది కలిసి లారీని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లారీలో మొత్తం 201బస్తాలు బియ్యం ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. ఒక్కొక్క బస్తా సుమారు 50క్వింటాళ్లు ఉంటాయన్నారు. గంట్యాడ మండలంలో చినవేమలి, పెదవేమలి, అట్టాడ తదితర గ్రామాల్లో కొందరి వద్ద గ్రామాల్లో రేషన్ బియ్యం బి.సన్యాసిరావు అనే వ్యక్తి కొనుగోలు చేసి వాటిని ఎల్.కోటకు చెందిన కె.మహేష్అనే వ్యక్తికి అమ్మకాలు చేస్తుంటాడని చెప్పారు. మహేష్ ఇక్కడ నుంచి కాకినాడ తదితర ప్రాంతాలకు తరలిస్తాడని తెలిపారు. సోమవారం పట్టుబడ్డ బియ్యం కూడ కాకినాడకు తరలిస్తున్నట్లు చెప్పారు. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు చెప్పారు. -
తూర్పు రాయలసీమలో పీడీఎఫ్ అభ్యర్థి గెలుపు
తిరుపతి: తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి యెండవల్లి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి, టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామయ్య పై 3,240 ఓట్లకు పైగా మెజార్టీతో యెండవల్లి గెలుపొందారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయన తన సమీప ప్రత్యర్థి, టీడీపీ కేజే రెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర(విశాఖ) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీవీఎస్ మాధవ్ ముందంజలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి మాధవ్ 5,045 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి అజయ్ శర్మ రెండో స్థానానికి పరిమితమైపోయారు. -
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ
-
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ
తూర్పు రాయలసీమలో ‘విఠపు’, పశ్చిమ రాయలసీమలో ‘కత్తి’ ఘనవిజయం సాక్షి, చిత్తూరు/సాక్షి, ప్రతినిధి, అనంతపురం/సాక్షి, విశాఖపట్నం: రాయలసీమలో సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు రాయలసీమ, (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం), పశ్చిమ రాయలసీమ (అనంతపురం, కడప, కర్నూలు) శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. తూర్పు రాయలసీమలో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం ఘన విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. వైఎస్సార్సీపీ మద్దతుతో విఠపు బాలసుబ్రహ్మణ్యం.. తన సమీప ప్రత్యర్థి, అధికార టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడుపై 3,553 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి.. సిట్టింగ్ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బచ్చలపుల్లయ్య కనీస పోటీ కూడా ఇవ్వలేక ఓటమి పాలయ్యారు. కత్తి నరసింహారెడ్డికి 3,763 ఓట్ల మెజారిటీ వచ్చింది. అటు ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. -
మీ సమయాన్ని ఆదాచేసే 7 ఉచిత పీడీఎఫ్ టూల్స్
టూల్స్ ఎప్పుడైనా పీడీఎఫ్ ఫైలుతో మీరు విసిగిపోయారా? పీడీఎఫ్ ఫైల్ ఫార్మాట్‌ను మనం విరివిగా ఉపయోగిస్తున్నా కూడా.. అది కొన్నిసార్లు మనల్ని చాలా విసిగిస్తుంటుంది. పీడీఎఫ్ కేవలం చదవడమే అయితే ఈజీనే. కానీ, దాన్ని క్రియేట్ చేయడమో లేక ఎడిట్ చేయడమో చేయాలంటే కొన్నిసార్లు తలప్రాణం తోకకొస్తుంటుంది. ఇంతకుమించిన పనులేమైనా పీడీఎఫ్‌తో చేయాలంటే.. ఆ పని ఎక్కడో చోట ఆగినా ఆగిపోతుంది. అదష్టవశాత్తూ వెబ్‌లో మనకు ఎన్నెన్నో పీడీఎఫ్ పనిముట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అందరికీ పెద్దగా తెలియని ఉపయుక్తమైన టూల్స్ మీ కోసం. వీటిలో సాదాసీదా ఎడిటింగ్, క్రియేటింగ్ గురించి కాకుండా కొన్ని కొత్త సంగతులకు సంబంధించిన వాటినే వివరించాం.. జొటి మాల్వేర్ స్కాన్ EXE , ZIP ఫైల్లో వైరస్లు దాక్కొని ఉండే అవకాశముందని మనకు తెలిసిందే. కానీ పీడీఎఫ్‌లలో కూడా అంతర్గతంగా వైరస్లు ఉండే చాన్స్ ఉందని ఎంత మందికి తెలుసు? అలా ఏదైనా పీడీఎఫ్‌లో వైరస్ ఉందా అని చెక్ చేయాలంటే ఈ జొటి మాల్వేర్ స్కాన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్లోకి మీ ఫైలును అప్లోడ్ చేస్తే అది 20కిపైగా వేర్వేరు మాల్వేర్ స్కానర్లతో పరీక్షిస్తుంది. కేవలం క్షణాల్లోనే ఫలితం చూపిస్తుంది. ఆన్లైన్ ఓసీఆర్ మీరు ఓ పీడీఎఫ్ ఫైలు నుంచి ఒక పారాను టెక్ట్స్ రూపంలో కాపీ చేసుకోవాలనుకున్నారు. కొన్ని రీడర్లలో ఈ పని చాలా సులువుగా అయిపోతుంది. కానీ కొన్నిసార్లు మాత్రం చాలా చికాకు తెప్పిస్తుంది. దీనికి సరైన సలహా.. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్) టూల్ వాడడమే. ఇది ఫైలులోని ప్రతి క్యారెక్టర్‌నూ టెక్ట్స్ రూపంలో మార్చి అందిస్తుంది. చూడ్డానికి పీడీఎఫ్‌ను వర్డ్ లోకి కన్వర్ట్ చేసినట్లు అనిపించవచ్చుగానీ.. నిజానికి ఇది కొంచెం వేరే ప్రక్రియే. ఇందులో కేవలం టెక్ట్స్ మాత్రమే కన్వర్టవుతుంది. ఇది కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. డిఫ్ నౌ మీరు ఎప్పుడైనా ఒకే ఫైలుకు సంబంధించి రెండు వర్షన్లు అందుకొని వాటిలో ఏం మార్పు జరిగిందబ్బా అని ఆలోచించే పరిస్థితి ఎదుర్కొన్నారా? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఫైళ్లను డిఫ్ నౌ లోకి అప్లోడ్ చేస్తే.. ఏమేం మార్పులు జరిగాయో అది ఇట్టే చెప్పేస్తుంది. ఏం కలిపారు? ఏం తీసేశారు? ఏం మార్చారు? అన్న వివరాలు తెలియజేస్తుంది. హెచ్‌టీఎంఎల్ టు పీడీఎఫ్ ఏదైనా వెబ్ పేజీని పీడీఎఫ్‌లో సేవ్ చేసుకోవాలంటే ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఈ ఆన్లైన్ టూల్‌లోకి మీరు కోరుకున్న యూఆర్ఎల్ ఇచ్చి పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడమే. అలాంటి మరికొన్ని టూల్స్: పీడీఎఫ్ ప్రొటెక్ట్, పీడీఎఫ్ అన్‌లాక్, పీడీఎఫ్ కంప్రెస్... వీటి పేరును బట్టి అవి ఎందుకు ఉపయోగపడతాయో అర్థమైపోతుందిగా. -razesh007@gmail.com