తిరుపతి: తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి యెండవల్లి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి, టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామయ్య పై 3,240 ఓట్లకు పైగా మెజార్టీతో యెండవల్లి గెలుపొందారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయన తన సమీప ప్రత్యర్థి, టీడీపీ కేజే రెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర(విశాఖ) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీవీఎస్ మాధవ్ ముందంజలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి మాధవ్ 5,045 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి అజయ్ శర్మ రెండో స్థానానికి పరిమితమైపోయారు.