చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ ప్రశ్నకైనా ఇట్టే సమాధానం లభిస్తోంది. ఇప్పటికే మనం చాట్‌జీపీటీని ఉపయోగించి రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆరోగ్యం కోసం చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నాం. ఈ కథనంలో పీడీఎఫ్ ఫైల్స్‌లో ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే ఏడు ఏఐ పవర్డ్ టూల్స్ గురించి ఇక్కడ చూసేద్దాం..
ఆస్క్ యువర్ పీడీఎఫ్ (AskYourPDF)
AskYourPdf అనేది PDFలను అప్‌లోడ్ చేయడానికి మాత్రమే కాకుండా సంబంధిత సమాచారాన్ని తొందరగా తిరిగి పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో మీ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తరువాత పీడీఎఫ్‌లోని ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు.. ప్రశ్నను ఎంటర్ చేయవచ్చు. మీరు ఎంటర్ చేసిన తరువాత ఆస్క్ యువర్ పీడీఎఫ్ మీకు సమాధానం అందిస్తుంది.
ఆస్క్ యువర్ పీడీఎఫ్ అనేది పూర్తిగా ఉచితం. ఇందులో కేవలం పీడీఎఫ్ మాత్రమే కాకుండా.. PPT, TXT, CSV వంటి వాటిని కూడా అప్‌లోడ్ చేయవచ్చు. తెలుసుకోవలసిన ప్రశ్నలను గురించి సర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అయితే అప్‌లోడ్ చేసే ఫైల్ సైజ్ 40 ఎంబీ పరిమాణంలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.
చాట్‌పీడీఎఫ్ (ChatPDF)
చాట్‌పీడీఎఫ్ జీపీటీ 3.5 టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఇది మల్టిపుల్ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో హిస్టరీ వంటి వాటిని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆస్క్ యువర్ పీడీఎఫ్ మాదిరిగానే.. చాట్‌పీడీఎఫ్ లింక్ ద్వారా కూడా డాక్యుమెంట్‌ను ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. దీనిని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు, పెయిడ్ ప్లాన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఉచితంగా ఉపయోగించుకోవాలంటే ఫైల్ సైజ్ 10 ఎంబీ, పేజీలు 120 వరకు మాత్రమే. పెయిడ్ ప్లాన్‌లో కొన్ని ఇతర ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు.
డాక్యుమైండ్ (Documind)
మల్టిపుల్ పీడీఎఫ్‌లలో ఒకేసారి సమాచారాన్ని వెతకడం కోసం ఈ డాక్యుమైండ్ ఉపయోగపడుతుంది. మీరు ఎక్కువ డాక్యుమెంట్లను ఒకేసారి అప్‌లోడ్ చేసిన తరువాత.. తెలుసుకోవలసిన ప్రశ్నలను సెర్చ్ చేసుకోవచ్చు, ఖచ్చితమైన సమాధానాలను అందించడానికి డాక్యుమైండ్ అప్‌లోడ్ చేసిన అన్ని పత్రాలను స్కాన్ చేస్తుంది. దీనిని కేవలం 15 సార్లు మాత్రమే ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత పెయిడ్ ప్లాన్ కోసం అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం నెలకు 5 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.
లైట్ పీడీఎఫ్ (LightPDF)
లైట్ పీడీఎఫ్ అనేది మీ ప్రశ్నలకు తొందరగా సమాధానాలను అందించడమే కాకుండా.. అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ కంటెంట్ ఆధారంగా సమ్మరీస్, అవుట్ లైన్స్, పట్టికలను రూపొందించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కేవలం పీడీఎఫ్ ఫైల్‌లకు మాత్రమే పరిమితం కాదు. ఎక్స్ఎల్, వర్డ్, పీపీటీ ఫైల్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు 200 కంటే ఎక్కువ పేజీలు ఉన్న పీడీఎఫ్ లేదా వేరే ఫార్మాట్‌లో ఫైల్‌లను అప్‌లోడ్ చేయాలనుకుంటే పెయిడ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది.
పీడీఎఫ్ ఏఐ (PDF.ai)
పీడీఎఫ్ ఏఐ అనేది అన్నింటికంటే సులభమైన ఇంటర్‌ఫేస్. ఇందులో ట్యాబ్ రెండు నిలువు వరుసలుగా కనిపిస్తుంది. ఒక వరుస డాక్యుమెంట్ కోసం, రెండో వరుస చాట్‌బాట్ కోసం. డ్యాష్‌బోర్డ్‌లో మీరు అప్‌లోడ్ చేసిన అన్ని డాక్యుమెంట్‌ను చాట్ హిస్టరీ యాక్సెస్ చేస్తుంది. మీరు నేరుగా డాక్యుమెంట్‌లోని సంబంధిత పేజీకి నావిగేట్ చేసుకునే అవకాశం కూడా ఇందులో లభిస్తుంది. డిస్‌ప్లే, జూమ్ సెట్టింగ్స్ వంటి వాటిని కూడా ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ అకౌంట్ ద్వారా కేవలం ఒక పీడీఎఫ్ మాత్రమే అప్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ మీరు నెలకు 17 డాలర్లను పే చేస్తే.. 100 డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయవచ్చు, అదే నెలకు 5000 ప్రశ్నలను అడగవచ్చు.
హుమాటా (Humata)
టీమ్ ఉపయోగించడానికి ఓ మంచి టూల్స్ కోసం సర్చ్ చేస్తున్నట్లయితే.. హుమాటా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఫైల్‌లను ఫోల్డర్‌లలో అమర్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది PDF, DOCX, PPT వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫ్రీ ప్లాన్ మాత్రమే కాకుండా పెయిడ్ ప్లాంట్ కూడా ఉంటుంది. ప్రతి పేజీకి 0.01 నుంచి 0.02 డాలర్ చెల్లించాల్సి ఉంటుంది.
బన్నీ (Bunni)
అమౌట్ పే చేసి ఉపయోగించడానికి ఇష్టపడితే.. ఈ టూల్ మంచి ఎంపిక అవుతుంది. ఇది మల్టిపుల్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో మీద సమాధానాలు మాత్రమే కాకుండా.. సూచలను కూడా అందిస్తుంది. ఇందులో సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు. ఇది వివిధ భాషలకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీ భాషలోనే సమాధానం పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment