కురుపాం: మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎఫ్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్‌ఐ వి.బాలాజీరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు రావాడ కూడలిలో ఓ వ్యాపారి వద్ద అక్రమంగా పీడీఎఫ్ బియ్యం ఉన్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించగా నిల్వ ఉంచిన 1400 కేజీల పీడీఎఫ్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్‌డీటీకి అప్పజెప్పనున్నట్లు ఆయన తెలిపారు.
బియ్యం పట్టివేత
జామి: మండలంలో అట్టాడ గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రి గంట్యాడ మండలం నుంచి అట్టాడ మీదుగా అక్రమంగా బియ్యంతో వస్తున్న లారీ సమాచారం స్థానికులు పోలీసులకు తెలపడంతో జామి ఎస్‌ఐ బి.లక్ష్మణరావు సిబ్బంది కలిసి లారీని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లారీలో మొత్తం 201బస్తాలు బియ్యం ఉన్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఒక్కొక్క బస్తా సుమారు 50క్వింటాళ్లు ఉంటాయన్నారు.
గంట్యాడ మండలంలో చినవేమలి, పెదవేమలి, అట్టాడ తదితర గ్రామాల్లో కొందరి వద్ద గ్రామాల్లో రేషన్ బియ్యం బి.సన్యాసిరావు అనే వ్యక్తి కొనుగోలు చేసి వాటిని ఎల్.కోటకు చెందిన కె.మహేష్‌అనే వ్యక్తికి అమ్మకాలు చేస్తుంటాడని చెప్పారు. మహేష్ ఇక్కడ నుంచి కాకినాడ తదితర ప్రాంతాలకు తరలిస్తాడని తెలిపారు. సోమవారం పట్టుబడ్డ బియ్యం కూడ కాకినాడకు తరలిస్తున్నట్లు చెప్పారు. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment