rice bags
-
మంత్రి నాదెండ్లకు షాక్.. పోర్టులో బియ్యానికి క్లీన్ చిట్
సాక్షి, విశాఖ: ఏపీలో మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి తాజాగా కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ పట్టుకున్న బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏపీ(Andhra Pradesh)లో కూటమి సర్కార్ పాలన హడావుడికి ఎక్కువ పని తక్కువ అన్న చందంగా తయారైంది. మంత్రులు కనీస అవగాహన కూడా లేకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చుక్కెదురైంది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. గత నెల 9న కంటైనర్ టెర్మినల్‌లో నాదెండ్ల తనిఖీలు చేశారు. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో 259 టన్నుల రేషన్ బియ్యం గుర్తించినట్లు నాదెండ్ల ప్రకటించారు.ఇదే సమయంలో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బియ్యం తీసుకొచ్చిన సంస్థపై కేసు నమోదు చేసినట్లు మంత్రి హడావిడి చేశారు. ఇక, నెల రోజుల తర్వాత అవి రేషన్ బియ్యం కాదంటూ కలెక్టర్ ధృవీకరించారు. ఈ క్రమంలో వాటిని బిబో సంస్థకి ఎగుమతి కోసం అప్పగిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. మంత్రి అనుచరులు బియ్యాన్ని విడిచిపెట్టాలంటూ కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. కాగా, బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
మాకు ఏడుపే మిగిలింది తీవ్ర ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు
-
కస్టం మిల్లింగ్ కహానీ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా నుంచి ఇవ్వాల్సిన కస్టం మిల్లింగ్ రైస్‌ను మిల్లర్లు ఇప్పటివరకు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. జిల్లాలోని మొత్తం 62 పారాబాయిల్డ్, 218 ముడిరైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులకు పౌరసరఫరాల శాఖ ద్వారా కేటాయించిన ధాన్యానికి సంబంధించి కస్టం మి ల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తుతోంది. వివరాల్లోకి వెళ్తే.. 2022–23 వానాకాలం సీజన్లో జిల్లాలోని మిల్లర్లకు 6,03,872 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. ఈ ధాన్యానికి గాను మిల్లర్లు 4,09,535 మెట్రిక్ టన్నుల కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే 3,87,529 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా 22,005 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సిన సీఎంఆర్ పెండింగ్ ఉంది. ► 2022–23 యాసంగి సీజన్ విషయానికి వస్తే 6,35,190 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇచ్చారు. ఇందుకు సంబంధించి 4,32,264 మెట్రిక్ టన్నుల కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 1,22,980 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చారు. ఇంకా 3,09,284 మెట్రిక్ టన్నులు సీఎంఆర్ ఇవ్వాల్సింది పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఇష్టం మిల్లర్లు కొందరు ఇష్టం వచ్చినట్లు మొండికేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,31,289 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. కొత్త ప్ర భుత్వం ఈ నెలాఖరులోగా మొత్తం సీఎంఆర్ ఇవ్వాలని గడువు పొడిగించింది. అయితే మిల్ల ర్లు మాత్రం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ధాన్యం మాఫియా.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన భారీ అక్రమం ఇటీవల బయటకొచ్చింది. బోధన్‌లోని మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే నాలుగు రైస్‌మిల్లులకు 2021–22 యాసంగి, 2022–23 వా నాకాలం సీజన్లకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ (కష్టం మిల్లింగ్ రైస్) కింద తిరిగి పౌరసరఫరాల శాఖకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. మిల్లింగ్ చేసి మిగిలిన సీఎంఆర్ బియ్యం ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్ చెప్పాడు. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని ఏఆర్ ఇండస్ట్రీస్(ఎడపల్లి), ఆర్‌కామ్ ఇండస్ట్రీస్(వర్ని), అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్(వర్ని), ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధన్) అనే మరో నాలుగు మిల్లులకు కేటాయించినట్లు చూపారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ నాలుగు మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఇందులో ఏఆర్ ఇండస్ట్రీస్ నుంచి 2,000 మెట్రిక్ టన్నులు, ఆర్‌కామ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నులు, అబ్దుల్ ఐ నుంచి 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం (సీఎంఎఆర్) మాత్రమే పౌరసరఫరాల శాఖకు ఇచ్చారు. ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. మిగిలిన 26వేల మెట్రిక్ ట న్నుల సీఎంఆర్ బి య్యాన్ని ఇవ్వాలని పౌ రసరఫరాల శాఖ అధికారులు అడుగగా, షకీల్ మిల్లుల నుంచి తమకు బియ్యం రాలేదని చెబుతుండడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చినట్లు నలుగురు మిల్లర్లు చెబుతుండడం విశేషం. ఈ విషయమై రేవంత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రైస్‌మిల్లుల్లో జరుగుతున్న మోసపూరిత కార్యకలాపాలు, అవినీతి అక్రమాలు బహిర్గతం చేయడానికి ఏకకాలంలో కేంద్ర విజిలెన్స్ విచారణ చేప ట్టాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవేంద్ర సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం ఇచ్చారు. సీఎంఆర్ ఇవ్వకపోతే కఠిన చర్యలు ప్రభుత్వానికి తిరిగివ్వాల్సిన కస్టం మిల్లింగ్ రైస్‌ను మిల్లర్లు తక్షణమే ఇవ్వకపోతే కఠినచర్యలు తీసుకుంటాం. కొందరు మిల్లర్ల వైఖరి కారణంగా ప్రభుత్వానికి, రైతుల కు, ఇతర మిల్లర్లకు చెడ్డపేరు వస్తోంది. కొందరు మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా బయట ప్రాంతాల్లో అమ్ముకున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయి. – సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే -
పంట పంటకీ.. డీలర్లకు తూకం తంటా..!
నల్లగొండ: పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని గోదాముల వద్ద తూకం వేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీలర్లుకు ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్) పాయింట్ వద్ద బియ్యం తూకం వేసి ఇవ్వాలన్న కోర్టు ఆదేశాల మేరకు అధికారులు చర్యలకు పూనుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద వేబ్రిడ్జిలు లేకపోవడంతో డీలర్లు బయోమెట్రిక్‌ను గోదాముల్లో సేకరిస్తూ.. బియ్యం తూకం మాత్రం బయట వేబ్రిడ్డిల వద్ద వేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 4,66,529 రేషన్ కార్డులు జిల్లాలో మొత్తం 4,66,529 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటి పరిధిలో 13,96,933 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఉచితంగా ప్రభుత్వం ఐదు కిలోల చొప్పన బియ్యం అందిస్తోంది. అయితే ప్రతినెల డీలర్లు కార్డుదారులకు బియ్యం తూకం వేసి ఇస్తున్నారు. కానీ డీలర్లకు బియ్యం సరఫరా చేసే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద మాత్రం తూకం వేయకుండా బస్తా 50 కేజీల చొప్పున లెక్కగట్టి పంపుతున్నారు. దీనివల్ల బియ్యం తక్కువగా వచ్చి తా ము నష్టపోతున్నామని డీలర్లు కోర్టును ఆశ్రయించడంతో డీలర్లకు బయోమెట్రిక్ విధానంలో బియ్యం తూకం వేసి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఆలస్యంగా బియ్యం పంపిణీ.. డీలర్లకు బయోమెట్రిక్ విధానంలో తూకం వేసి బియ్యం ఇవ్వాలని నిర్ణయించడంతో జూలై మాసానికి సంబంధించి ప్రజలకు బియ్యం పంపిణీని 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ బియ్యం సరఫరాలో ఆలస్యం కారణంగా 10వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించారు. గ్రామీణ డీలర్లకు ఇబ్బందులు.. కోర్టు ఆదేశాల మేరకు జూలై మాసానికి సంబంధించిన బియ్యం తూకం వేసి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే, జిల్లాలోని ఆరు ఎంఎల్ఎస్ పాయింట్లలో డీలర్లు వేలిముద్రలు వేసి బియ్యం మాత్రం ప్రైవేట్ వేబ్రిడ్జిల మీద తూకం వేయించుకుంటున్నారు. పట్టణ ప్రాంతంలోని డీలర్లకు ఎక్కువ బియ్యం ఉండడం వల్ల వారికి ఒక లారీ బియ్యం తూకం వేసేందుకు వీలు అవుతుంది. కానీ, గ్రామీణ ప్రాంతాల డీలర్లకు మాత్రం ఇద్దరు, ముగ్గురికి కలిపి ఒక లారీలో బియ్యం పంపిస్తారు. అలా ముగ్గురికి బయట వేబ్రిడ్జి మీద తూకం వేయడం సాధ్యం కావడం లేదు. దీంతో తూకం వేయకుండా పాత పద్ధతినే 50 కేజీల బస్తా చొప్పన లెక్కగట్టి ఇస్తున్నారని కొందరు డీలర్లు పేర్కొంటున్నారు. తూకం వేయకపోవడం వల్ల మళ్లీ తరుగు వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. -
బియ్యంతో నిండిపోయిన గోదాములు
నల్లగొండ జిల్లాలో గోదాముల్లో 4,81,838 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. అందులో ఎఫ్‌సీఐ గోదాములు బియ్యంతో ఇప్పటికే నిండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి 8.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి జిల్లా మిల్లుల్లో పెట్టింది. గోదాములు ఖాళీ లేక బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం చేస్తోంది. రోజుకు ఒక వ్యాగన్ ద్వారా 3800 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అవసరమైన చోటికి పంపాల్సి ఉండగా, 4 రోజులకు ఒక వ్యాగన్ ద్వారానే బియ్యం సరఫరా చేస్తున్నారు. నిజామాబాద్‌లోనూ ఎఫ్‌సీఐతోపాటు చిన్నాచితక గోదాముల్లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అక్కడ 12 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి మిల్లులకు అప్పగించింది. అక్కడున్న గోదాములు 90 శాతం బియ్యంతో నిండి ఉన్నాయి. అక్కడినుంచి రోజుకు రెండు వ్యాగన్లలో బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు లేదా అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేస్తేనే సేకరించిన ధాన్యాన్ని మిల్లులు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు నాలుగు రోజులకు ఒకసారి ఒక వ్యాగన్ ద్వారా మాత్రమే బియ్యాన్ని ఎక్స్‌పోర్టు చేస్తుండటంతో మిల్లింగ్ కుంటుపడుతోంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గోదాముల్లో బియ్యం నిల్వలు నిండిపోయాయి. ఇతర రాష్ట్రాలకు బియ్యం సరఫరా తగ్గడంతో గోదాముల్లో ఖాళీలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మిల్లుల నుంచి బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం చేస్తోంది. దీనికితోడు తాజాగా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రం నుంచి బియ్యం తీసుకోబోమని పేర్కొనడంతో సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)గా మార్చి ఎఫ్‌సీఐ ఇచ్చే ప్రక్రియ స్తంభించిపోయింది. దీంతో మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యం వర్షాలకు తడిచి నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొంది. కేంద్రం వద్దన్నా ముందుకొచ్చిన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నూతన చట్టం ప్రకారం రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయొద్దని ఆ చట్టంలో పేర్కొంది. అయినప్పటికీ రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. జిల్లాల్లో గోదాముల సామర్థ్యం తక్కువగా ఉన్నా అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వ మార్కెట్‌యార్డులు, ఫంక్షన్ హాళ్లను తీసుకొని మిల్లర్లకు ఇచ్చి అక్కడ ధాన్యం నిల్వ చేయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఎఫ్‌సీఐ గోదాముల్లోని బియ్యం అంతర్రాష్ట్ర సరఫరా మందగించింది. ఒక్కో జిల్లా నుంచి రోజుకు నాలుగైదు వ్యాగన్ల ద్వారా బియ్యం పంపించాల్సి ఉండగా, ప్రస్తుతం ఒకే వ్యాగన్ ద్వారా బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళుతోంది. నల్లగొండ మండలంలోని ఓ రైస్‌మిల్ ఆవరణలో నిల్వ ఉంచిన ధాన్యం ప్రైవేటు గోదాములు ఉన్నా వాడుకోలేని పరిస్థితి.. ఎఫ్‌సీఐ గోదాములు నిండిపోయిన నేపథ్యంలో ప్రైవేటు గోదాములు ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు గోదాములను టెండర్ ద్వారానే తీసుకోవాలని కేంద్రం నిబంధన విధించింది. ఆన్లైన్ టెండర్ జారీ చేసి, 15 రోజులు సమయం ఇవ్వాలని, తర్వాతే గోదాములను తీసుకోవాలని పేర్కొంది. ఇందుకు నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే వద్దంటున్న కేంద్రం 2019–20 రబీ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని సీఎంఆర్‌గా మార్చి ఎఫ్‌సీఐ ఇస్తూ వచ్చారు. చివరలో దాదాపు 1.01 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి చేరలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఇక ఈ సీజన్లో బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని రాష్ట్రం... కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒప్పుకోలేదు. బియ్యం తీసుకోబోమని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గడిచిన సీజన్లలో మిల్లర్లు సకాలంలో బియ్యం ఇవ్వలేదని, అందుకే ఈ సారి ఇప్పటికే గడువు దాటినందున బియ్యం తీసుకోబోమని పేర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకపోతే ప్రభుత్వం సేకరించిన ధాన్యం పరిస్థితి ఏంటన్నది గందరగోళంగా మారింది. -
ఏం చేసేది? ఎఫ్‌సీఐకి తలనొప్పిగా మారిన బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాముల్లో బియ్యం నిల్వలకు చోటు కరువైంది. బాయిల్డ్ రైస్ వినియోగం ఎక్కువగా ఉండే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు పూర్తిగా తమ పరిధిలోనే ఉత్పత్తి పెంచడం, దీనికితోడు రా రైస్ (పచ్చి బియ్యం) వినియోగం వైపు అధికంగా మొగ్గుచూపుతుండటంతో ఇక్కడి గోదాముల నుంచి సరఫరా తగ్గి నిల్వలు పెరుగుతున్నాయి. దీనికితోడు కొత్తగా గత ఖరీఫ్‌కు సంబంధించి మరో ఐదున్నర లక్షల టన్నుల మేర బాయిల్డ్ రైస్ రావాల్సి ఉంది. యాసంగికి సంబంధించి కూడా భారీగా వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి ఇచ్చిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసిన అనంతరం ఎఫ్‌సీఐ దాన్ని సేకరించి తన పరిధిలోని గోదాముల్లో నిల్వ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎఫ్‌సీఐ పరిధిలో 15.8 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములున్నాయి. ప్రతి యాసంగి సీజన్‌కు సంబంధించిన బాయిల్డ్ రైస్‌ను ఎక్కువగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ సరఫరా చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ పడిపోయింది. రాష్ట్రంలో 2019–20 యాసంగి సీజన్‌కు సంబంధించి 40 లక్షల బాయిల్డ్ రైస్ ఎఫ్‌సీఐకి చేరగా, ఇందులో 27 లక్షల మెట్రిక్ టన్నులను వివిధ రాష్ట్రాలకు పంపించింది. ఇందులో మరో 13 లక్షల టన్నులు ఎఫ్‌సీఐ గోదాముల్లోనే ఉన్నాయి. దీనికితోడు 2020–21 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 5.5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఇది వస్తే నిల్వలు మరింత పెరగనున్నాయి. ఇది పోనూ ప్రస్తుత యాసంగిలోనూ 80 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే దాదాపు ఈ సీజన్లో 50 లక్షల టన్నులకు పైగా బాయిల్డ్ రైస్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్థాయిలో నిల్వలు చేసే పరిస్థితి ఎఫ్‌సీఐ వద్ద లేదు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ నెలకు సగటున 2.50 లక్షల నుంచి 3 లక్షల టన్నుల మేర పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. ఈ లెక్కన ఏడాదంతా సరఫరా చేసిన 36 లక్షల టన్నులకు మించి సరఫరా చేయలేదు. అలాంటప్పుడు మిగతా బియ్యాన్ని నిల్వ చేయడం ఎఫ్‌సీఐకి ‘కత్తిమీద సాము’లా మారనుంది. బాయిల్డ్ వద్దంటున్న పొరుగు రాష్ట్రాలు తమిళనాడుకు ప్రతి నెలా 3.50 లక్షల మెట్రిక్ టన్నులు, కేరళకు ప్రతినెలా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ అవసరాలుండేవి. దీనికి తగ్గట్లుగా తెలంగాణ నుంచి సేకరించిన బియ్యం సరఫరా అయ్యేది. ప్రస్తుతం తమిళనాడులో 3 లక్షల టన్నులకు అవసరాలు తగ్గాయి. తన అవసరాలకు సరిపోనూ బాయిల్డ్ రైస్ ఉత్పత్తిని స్వతహాగా పెంచుకుంటోంది. దీంతో తెలంగాణపై ఆధారపడే పరిస్థితి లేదు. ఇక కేరళలోనూ బాయిల్డ్ రైస్ వినియోగం 30 శాతం తగ్గి రా రైస్ వినియోగం పెరిగింది. దీంతో ఆ రాష్ట్రాల నుంచి బాయిల్డ్ డిమాండ్ తగ్గింది. కర్ణాటకలో పూర్తిగా రా రైస్ వినియోగం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రస్తుత యాసంగిలో పూర్తిగా రా రైస్ మాత్రమే ఇవ్వాలని ఎఫ్‌సీఐ రాష్ట్రాన్ని కోరింది. అయితే ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయాలతో రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా 80 శాతం బాయిల్డ్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవాలని ఎఫ్‌సీఐని కోరింది. దీనిపై ఎఫ్‌సీఐ నిర్ణయం వెలువడాల్సి ఉంది. -
లారీ రాదు.. కాంటా కాదు!
ఈమె పేరు నక్క రమ్య. నాగారం పంచాయతీ వార్డు సభ్యురాలు. రెండు ఎకరాల్లో వరి సాగు చేశారు. వంద బస్తాల ధాన్యం పండింది. దీంతో సంతోషించిన ఆమె అధికారులు ఇచ్చిన టోకెన్ ప్రకారం 15రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చారు. అయితే, ఇప్పటి వరకు కూడా తూకం వేయడం లేదు. లారీ వచ్చి ఇక్కడి ధాన్యాన్ని తీసుకెళ్తే తప్ప కాంటా వేయలేమని సిబ్బంది చెబుతున్నారు. అకాల వర్షాలతో భయంగా ఉందని వాపోతున్నారు. హసన్‌పర్తి: కాలం కలిసి రావడంతో చేతికొచ్చిన పంటను చూసి ఆనందపడాలా... రోజులు గడిచిపోతూ అకాల వర్షం కురుస్తున్నా కాంటాలు కాకపోవడంతో ఆందోళన చెందాలా... కాంటాలు అయినా ధాన్యాన్ని తరలించకపోవడంతో దిగులు పడాలా... ఇవీ అన్నదాతల సందేహాలు! కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తూకం వేయకపోగా, తూకం వేసిన ధాన్యాన్ని సైతం తరలించేందుకు లారీలు పంపించకపోవడంతో నిద్ర, ఆహారం మానుకుని నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొనుగోలుకేంద్రాల వద్ద కుప్పలుగా ధాన్యం పేరుకుపోతున్నా అధికారుల పట్టింపులేని తనం రైతుల ఆందోళనకు కారణమవుతోంది. ఓ దశలో రైతులు ఐకేపీ, పీఏసీఎస్ నిర్వాహకులతో గొడవకు దిగుతున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. 92 కొనుగోలు కేంద్రాలు వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 92 కేంద్రాలు ఏర్పాటుచేశారు. జిల్లాలోని వరంగల్, కాజీపేట, ఖిలా వరంగల్, ఐనవోలు, హసన్‌పర్తి, హన్మకొండ, ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 29 కొనుగోలు కేంద్రాలు ఐకేసీ ఆధ్వర్యాన మిగిలిన 63 కేంద్రాలు ఆయా మండలాల్లోని పీఏసీఎస్‌ల ఆధ్వర్యాన నిర్వహిస్తున్నారు. ఈసారి టోకెన్ పద్ధతి ప్రారంభించిన అధికారులు టోకెన్లల తేదీల వారీగానే రైతులు తమ ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ఇంత వరకు బాగానే ఉన్నా... కేంద్రాలకు తీసుకొచ్చిన వారి ధాన్యాన్ని కాంటా వేయడంతో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒకవేళ కాంటా పూర్తయినా మిల్లులకు తరలించడంలో లారీల కొరత కారణంగా జాప్యం జరుగుతుండడంతో రైతులే కాపలా ఉండాల్సి వస్తోంది. పేరుకుపోయిన ధాన్యం... ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద వరి «ధాన్యం పేరుకపోయ్యింది. జిల్లా వ్యాప్తంగా 92 కేంద్రాలు నిర్వహిస్తుండగా, ఒక్కో కేంద్రం ప్రస్తుతం 10 నుంచి 90 లారీలకు సరిపడా ధాన్యం నిల్వ ఉన్నట్లు అంచనా. ఇందులో చాలా వరకు తూకం వేయని ధాన్యమే ఉండడం గమనార్హం. హసన్‌పర్తి మండలంలోని వంగపహాడ్ ప్రాథమిక వ్యవసాయ ప్రాధమిక సహకార కేంద్రం వద్ద 60లారీలు, బైరాన్‌పల్లి కేంద్రం 20 లారీలు, మల్లారెడ్డిపల్లిలో 40 లారీలు, సూదన్‌పల్లి కేంద్రం వద్ద 20లారీలు, నాగారం వద్ద 90 లారీలు, అన్నాసాగరం వద్ద 15 లారీలు, దేవన్నపేట వద్ద 10 లారీలు, సీతంపేట వద్ద 15లారీలు, ఎల్లాపురం వద్ద 10లారీలు, జయగిరి వద్ద15 లారీలు, గంటూరుపల్లి వద్ద 15 లారీలు, పెంబర్తి వద్ద 10లారీలు, పెగడపల్లి వద్ద 30 లారీలకు సరిడా ధాన్యం నిల్వ ఉందని రైతులు చెబుతున్నారు. కాగా, ఇందులో చాలా మంది రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు దాటుతోందని తెలుస్తోంది. కాంటా పూర్తికాక ముందే వర్షం వస్తే తడిచిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజులకో లారీ ఒక కేంద్రానికి లారీ పంపిస్తే.. మరో నాలుగు రోజులు గడిస్తే తప్ప లారీ రావడం లేదని సమాచారం. మిల్లుల వద్ద ధాన్యం దింపడానికి హమాలీల కొరత కారణంగా సమయం పడుతుండగా.. లారీలు కూడా సరిపడా సమకూర్చలేకపోతున్నారని తెలుస్తోంది. కాగా, ధాన్యం తీసుకెళ్లడానికి లారీలు పంపించాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఆర్టీఏ అధికారులకు అప్పగించింది. దీంతో నాలుగు రోజుల క్రితం బాహుపేట ఆర్టీఏ అధికారులకు ఒక ఖాళీ లారీను ఆపి «వంగపహాడ్‌లోని ధాన్యం కేంద్రానికి పంపించారు. ఇద్దరు రైతులను ఆ లారీలో ఎక్కించారు. అయితే లారీ డ్రైవర్ మధ్యలోనే రైతులను దింపేసి వెళ్లిపోయాడు. ఈ మేరకు సాయంత్రం వరకు వారు ఇంటికి చేరుకోకపోవడంతో పీఏసీఎస్ చైర్మన్ తన బైక్‌పై వారిని తీసుకురావాల్సి వచ్చింది. ఇకనైనా లారీ అసోసియేషన్ల బాధ్యులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యుల సమన్వయంతో లారీలను సమకూర్చి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. ఈయన పేరు చేరాలు. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. సుమారు మూడు వందల బస్తాల పంట పండింది. ఏప్రిల్ 29వ తేదీన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తే ఇప్పటి వరకు కాంటా వేయలేదు. రెండు రోజుల క్రితం వీచిన గాలి దుమారానికి ధాన్యం కొట్టుకపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ధాన్యం కాంటా వేసేలా అధికారులు చూడాలని కోరుతున్నాడు రోజూ ఆందోళనే.. ధాన్యం తీసుకొచ్చి పది రోజులైతాంది. ఇప్పటి వరకు తూకం వేయలేదు. రోజూ ఇక్కడికి వచ్చి కాంటా వేయమని అడుగుతున్నాం. లారీలు వస్తే కానీ తూకం వేయలేమని చెబుతున్నారు. సోమవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.– గండు సరోజన, వంగపహాడ్ ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తున్నాం... కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకెళ్లడానికి లారీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ కొనుగోలు కేంద్రానికి అక్కడ ఉన్న ధాన్యం నిల్వల మేరకు లారీలు పంపుతున్నాం. ఇటు ఎల్కతుర్తి, అటు రాంపూర్ వద్ద ఆర్టీఏ అధికారులను ఖాళీ లారీలను ఆపి కొనుగోలు కేంద్రాలకు మళ్లిస్తున్నారు. ఇటీవల లారీల వల్ల ఇబ్బందులు ఎదురైన విషయం వాస్తవమే. వీటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నా. – రాజ్‌కుమార్,సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ -
రేషన్ బియ్యం ‘పక్కదారి’
వర్గల్(గజ్వేల్): విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంజా విసిరారు. డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే 108.50 క్వింటాళ్ల బియ్యంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రామచంద్రాపురం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వినాయక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గురువారం టీఎస్ 30 టీ 3023 నంబర్ గల డీసీఎమ్ వాహనంలో అక్రమంగా పీడీఎస్ రేషన్ బియ్యం గజ్వేల్ మీదుగా తూప్రాన్ వైపు తరలివెళ్తున్నట్లు విజిలెన్స్ అధికారి వినాయక్‌రెడ్డికి పక్కా సమాచారం అందింది. వెంటనే ఆయన తూప్రాన్–గజ్వేల్ రోడ్డుపై నిఘా వేశారు. అదేమార్గంలో పీడీఎస్ బియ్యంతో వస్తున్న సదరు డీసీఎం కన్పించింది. వెంటనే దానిని నిలువరించే ప్రయత్నం చేయగా, వర్గల్ మండల నాచారం పెట్రోల్ బంక్ వద్ద డ్రైవర్ వాహనాన్ని ఆపేసి పారిపోయాడు. డీసీఎమ్ వాహనంలో 217 బస్తాలలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించామని, సుమారు 108.50 క్వింటాళ్ల బియ్యం విలువ రూ. రెండున్నర లక్షలు ఉంటుందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వినాయక్‌రెడ్డి తెలిపారు. వాహనంతో సహా బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. అనంతరం వాటిని రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు. -
ముడుపులు మెక్కి.. ముక్కిన బియ్యం
ముక్కిన, రంగుమారిన బియ్యం పేదలకు ఎలా సరఫరా చేస్తాం.. అవి తీసుకొని మంచి బియ్యం పంపండి.. అని కోరిన అధికారికి తిరుగు టపాలో మెమో అందింది.ఇప్పటికీ ఆ బియ్యం గోదాముల్లో మూలుగుతున్నాయి.. అయినా సరే ఉన్నతాధికారులకు ఖాతరు లేదు.. ఈసారి కూడా ముక్కిన బియ్యమే పంపారు..అవే ఇస్తాం.. తింటే తినండి.. లేదంటే మానేయండి.. అన్నట్లున్న పౌరసరఫరా అధికారుల ఈ నిర్లక్ష్య ధోరణి వెనుక.. పెద్ద గూడుపుఠాణీయే ఉందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.ప్రజాపంపిణీకి అవసరమయ్యే బియ్యం కోసం పొరుగు జిల్లాల మీద ఆధారపడుతున్న విశాఖ జిల్లాకు విజయనగరం జిల్లా నుంచి రెండు నెలలుగా అందుతున్న బియ్యం నాసిరకంగా ఉండటానికి.. అక్కడి అధికారులు, రైస్‌మిల్లర్లు కుమ్మక్కై.. డబ్బులు మెక్కేసి.. ముక్కిన బియ్యాన్ని అంటగడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి..నిబంధనల ప్రకారం 3 శాతంలోపు రంగుమారిన బియ్యాన్నే మిల్లర్ల నుంచి లెవీగా సేకరించాల్సి ఉండగా విజయనగరం అధికారులు ఏకంగా 7 నుంచి 20 శాతం వరకు రంగుమారిన బియ్యం కూడా సేకరిస్తున్నారని.. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా సేకరించి గత నెలలో జిల్లాకు పంపిన బియ్యంలో 5వేలకుపైగా బస్తాలు ముక్కిపోయి గోదాముల్లో మూలుగుతుంటే.. ఈసారి కూడా పంపిన బియ్యంలో 4200 బస్తాలు అటువంటి సరుకేనని తేలింది. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్ర రేఖ దిగువనున్న తెల్ల కార్డుదారులతోపాటు మధ్యాహ్న భోజన పథకం కింద ప్రతి నెలా 20,492 మెట్రిక్‌టన్ను(ఎంటీ)ల బియ్యాన్ని సరఫరా చేస్తుంటారు. ఈ లెక్కన ఏడాదికి 2.50లక్షల ఎంటీల బియ్యం అవసరం. జిల్లాలో సేకరించే ఈ బియ్యం ఏటా 25వేల ఎంటీలకు మించడం లేదు. దీంతో పొరుగున ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరీ కొరత ఏర్పడితే అప్పుడప్పుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి కేటాయింపులు జరుపుతుంటారు. విజయనగరం జిల్లా సివిల్ సప్లయిస్ అధికారులు ముక్కిన, రంగుమారిన బియ్యాన్ని లెవీ కింద తీసుకుంటున్నారు. సాధారణంగా 3 కంటే తక్కువ శాతం రంగుమారి ఉంటేనే లెవీకింద సేకరించాలి. ప్రజాపంపిణీ ద్వారా సరఫరాకు అనుమతిఇవ్వాలి. కానీ ఇక్కడ ఏకంగా ఏడు నుంచి 22 శాతం వరకు రంగు మారిన ధాన్యాన్ని అక్కడి అధికారులు ఏమాత్రం సంకోచించకుండా లెవీ కింద రైసుమిల్లర్ల నుంచి సేకరిస్తున్నారు. ఈ విధంగా పదో..ఇరవై టన్నులు కాదు ఏకంగా 80 వేల టన్నులు సేకరించారు. కిలోకు రూ.32 చొప్పున టన్నుకు రూ.32వేలు వంతున రైసుమిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే ఏకంగా రూ.256 కోట్ల భారీ స్కాం అన్న మాట. ఈ విషయంలో అక్కడి మిల్లర్లు చక్రం తిప్పుతున్నారన్నవాదన ఉంది. భారీగా రూ.కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చేతుల మారడంతోనే పీడీఎస్ కింద సరఫరా ఇందులో సంబంధిత ఉన్నతాధికారులతో పాటు రాజకీయ పెద్దలకు కూడా భారీగానే ముట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ రంగుమారిన బియ్యాన్ని విజయనగరం సివిల్ సప్లయిస్ అధికారులు నిస్సిగ్గుగా పీడీఎస్ కింద సరఫరా చేస్తున్నారు. గత నెలలో ఇదే రీతిలో 1600 టన్నుల బియ్యం పంపగా, అందులో 5వేలకు పైగా బస్తాల బియ్యం ముక్కి పోయాయి. వీటిని వెనక్కి తీసుకెళ్లాలని విశాఖ జిల్లా సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చినా నేటికీ ఆ బియ్యాన్ని తీసుకెళ్లలేదు. పైగా తిప్పి పంపిన కారణంగా ఉన్నతాధికారులు జిల్లా సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మేనేజర్ పల్లవ వెంకటరమణకు మెమో కూడా జారీ చేశారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆ ముక్కిన బియ్యం పీడీఎస్ కింద సరఫరా చేసేది లేదంటూ తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఆ ముక్కిన బియ్యం అనకాపల్లి సివిల్ సప్లయిస్ గోదాముల్లో మూలుగుతున్నాయి. డొంకినవలస గోదాము నుంచి ముక్కిన బియ్యం తాజాగా ఈ నెలలో కూడా అదే విధంగా ముక్కిన, రంగుమారిన బియ్యాన్ని విజయనగరం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ అధికారులు మళ్లీ విశాఖకు పంపారు. ఆ జిల్లా లోని బాడంగి మండలం డొంకినవలస గోదాము నుంచి ఈసారి మరో 49 లారీల ముక్కిన, రంగు మారిన బియ్యాన్ని పంపేందుకు అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాటిలో 29 లారీల బియ్యం ఇప్పటికే మర్రిపాలెం–1,2, పెందుర్తి, భీమిలి, అనకాపల్లి, చోడవరం, వడ్లపూడి ఎంఎల్ఎస్ పాయింట్లకు మంగళవారం చేరుకున్నాయి. ఒక్కో లారీలో 500 బస్తాల చొప్పున 250 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయి. పనికిరానివి 4,200 బస్తాల బియ్యం? ఇప్పటివరకు పరిశీలించిన బస్తాల్లో 4,200 బస్తాల బియ్యం ముక్కిపోయి ఎందుకూ పనికి రానివిగా గుర్తించారు. అన్ని గోదాముల్లో మిగిలిన స్టాక్‌ను కూడా పరిశీలిస్తే మరింత పెరిగే అవకాశం ఉంది. ఇన్ని వేల బస్తాల్లో బియ్యం ముక్కిపోతే విజయనగరం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జీఎం డి.షర్మిల మాత్రం కేవలం వంద బస్తాలే నాణ్యత లే నట్టుగా గుర్తించామని చెప్పుకొచ్చారు. అదేం కాదు ఇప్పటి వరకు పరిశీలించిన బస్తాల్లో 4,200 బస్తాల బియ్యం పూర్తిగా ముక్కిపోయి ఎందుకు పనికి రానివిగా ఉన్నాయని, వాటిని తిప్పి పంపేందుకు చర్యలు చేపట్టామని విశాఖ జిల్లా సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డీఎం వెంకటరమణ ‘సాక్షి’కి తెలిపారు. -
పిల్లల బియ్యం మెక్కేశారు...!
సాక్షి ప్రతినిధి కడప: పాఠశాలలో విద్యార్థులకు వండిపెట్టాల్సిన 60 బస్తాల బియ్యం అక్కడి అధికారి ‘స్థానిక’ సిబ్బందితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా గుటుక్కున మింగేశారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. తమను ప్రశ్నించేవారు లేరనుకున్నారో.. లేక గతంలో బోలెడు అవినీతి చేసినా ఎవరూ కనుగొనలేకపోయారనుకున్నారో తెలియదు కానీ, ఈసారి బడి పిల్లల బియ్యానికే ఎసరు పెట్టి ఏకంగా 60 బస్తాలను మాయం చేశారు. మునుపటి ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ చేసి కొత్త ప్రధానోపాధ్యాయుడు బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈ అవినీతి ఒక్కసారిగా వెలుగు చూడడంతో బియ్యం బకాసురులు ఉలిక్కి పడుతున్నారు. కొండాపురం జిల్లా ఉన్నత పాఠశాలలో 280 మంది విద్యార్థులు చదువుతున్నారు. మధ్యాహ్నబోజన పథకంలో భాగంగా ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల చొప్పున ఈ పాఠశాలలో నెలకు 18 నుంచి 20 బస్తాలు బియ్యం ఖర్చు అవుతాయి. విద్యార్థుల హాజరు ప్రకారం అక్కడ ఖర్చు అయిన బియ్యం కంటే 2017–18 విద్యా సంవత్సరంలో 60 బస్తాలు అదనంగా పంపించినట్లు రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. అంటే ఈ ఏడాది ఏప్రిల్ 23 నాటికి ఆపాఠశాలలో 30 క్వింటాళ్లు నిల్వ ఉండాలి. వాస్తవంలో ఒక్క క్వింటా కూడా మిగులులో లేదు. బాగోతం వెలుగు చూసిందిలా.. గతంలో బియ్యం గోల్మాల్ వ్యవహారం మూడో కంటికి తెలియకుండా ముగిసేది. ఈపరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయుడు ఈశ్వరయ్య మే31న పదవీ విరమణ చేశారు. తదుపరి సీనియర్ ఉపాధ్యాయునికి ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు అప్పగించే సమయంలో బియ్యం వ్యవహారం వెలుగుచూసింది. రికార్డు ప్రకారం తనకు 60 బస్తాలు నిల్వ చూపిస్తే తప్పా పూర్తి బాధ్యతలు తీసుకోలేనని గట్టిగా చెప్పడంతో అటు పూర్వపు ప్రధానోపాధ్యాయుడిని మందలించలేక, ప్రస్తుత ప్రధానోపా«ధ్యాయుడికి నచ్చజెప్పలేక అధికారులు తలపట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. ‘స్థానిక’ సిబ్బందిపైనా అనుమానాలు.. ఈస్వాహా పర్వంలో పూర్వపు ప్రధానోపాధ్యాయుడు ఈశ్వరయ్యతోపాటు స్థానికంగా ఉన్న కొందరు బోధన, బోధనేతర సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరు ప్రధానోపాధ్యాయుడి అలసత్వాన్ని ఆసరాగా తీసుకొని ఎవ్వరికీ చేతనైనన్ని మాయం చేసినట్లు తెలుస్తోంది. ఈపాపంలో తనకు భాగం ఉండడంతో ప్రధానోపాధ్యాయుడు అక్రమార్కులను వారించలేనట్లు సమాచారం. గతంలో సైతం ఈశ్వరయ్య పాఠశాల ఆవరణంలో ఉన్న దశాబ్దాల కాలం నాటి పెద్ద వృక్షాలను నరికించి వాటిని అమ్మకానికి పెట్టినట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి. ఒక ట్రాక్టర్ మొద్దులు తరలించిన అనంతరం ఈ వ్యవహారం మీడియా దృష్టికి రావడంతో విధిలేని పరిస్థితుల్లో అటవీ అధికారులు జోక్యం చేసుకోని కొండాపురం పోలీసుస్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఆ మిగులు మొద్దులు పాఠశాల ఆవరణలో కుళ్లిపోతున్నా కేసు మాత్రం ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. అధికారులు ఏమి చేస్తున్నట్లు.. ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు భోంచేశారన్న విషయాన్ని సంబంధిత ప్రధానోపాధ్యాయుడు ఏ రోజుకు ఆరోజు మొబైల్ యాప్ ద్వారా తెలియజేస్తూండాలి. ఈ లెక్క ఆధారంగానే తర్వాత నెలా బియ్యం కేటాయింపులు చేస్తారు. కొండాపురం పాఠశాలలో 100శాతం విద్యార్ధులు హాజరవుతున్నారని రాసినప్పటికీ ఇక్కడ నెలకు 20 బస్తాలు కంటే ఎక్కువ బియ్యం ఖర్చు కావు. అలాంటిది ఏకంగా మూడు నెలలకు సరిపడే బియ్యాన్ని అధికారులు ఆపాఠశాలకు అదనంగా కేటాయించి ఆవాటి లెక్క జమల అడుగక పోవడం ఆశ్చర్యం కల్గించక మానదు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు దృష్టి సారించకపోయి ఉంటే ఇక 60 బస్తాల స్వాహా పురాణం వెలుగు చూసే అవకాశం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కొండాపురం జడ్పీ హైస్కూల్లో చోటుచేసుకున్న బియ్యం స్వాహా ఉదంతంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా పదవీ విరమణ చేశారు కదా..అనారోగ్యంతో ఉన్నారు కదా....అని ఉపేక్షిస్తూ పోతే వ్యవస్థను మరింత అవినీతి మయం చేసినట్లు అవుతోందని విద్యావేత్తలు వాపోతున్నారు. -
పీడీఎఫ్ బియ్యం పట్టివేత
కురుపాం: మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎఫ్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్ఐ వి.బాలాజీరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు రావాడ కూడలిలో ఓ వ్యాపారి వద్ద అక్రమంగా పీడీఎఫ్ బియ్యం ఉన్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించగా నిల్వ ఉంచిన 1400 కేజీల పీడీఎఫ్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్‌డీటీకి అప్పజెప్పనున్నట్లు ఆయన తెలిపారు. బియ్యం పట్టివేత జామి: మండలంలో అట్టాడ గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రి గంట్యాడ మండలం నుంచి అట్టాడ మీదుగా అక్రమంగా బియ్యంతో వస్తున్న లారీ సమాచారం స్థానికులు పోలీసులకు తెలపడంతో జామి ఎస్ఐ బి.లక్ష్మణరావు సిబ్బంది కలిసి లారీని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లారీలో మొత్తం 201బస్తాలు బియ్యం ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. ఒక్కొక్క బస్తా సుమారు 50క్వింటాళ్లు ఉంటాయన్నారు. గంట్యాడ మండలంలో చినవేమలి, పెదవేమలి, అట్టాడ తదితర గ్రామాల్లో కొందరి వద్ద గ్రామాల్లో రేషన్ బియ్యం బి.సన్యాసిరావు అనే వ్యక్తి కొనుగోలు చేసి వాటిని ఎల్.కోటకు చెందిన కె.మహేష్అనే వ్యక్తికి అమ్మకాలు చేస్తుంటాడని చెప్పారు. మహేష్ ఇక్కడ నుంచి కాకినాడ తదితర ప్రాంతాలకు తరలిస్తాడని తెలిపారు. సోమవారం పట్టుబడ్డ బియ్యం కూడ కాకినాడకు తరలిస్తున్నట్లు చెప్పారు. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు చెప్పారు. -
హయత్‌నగర్ లో బియ్యం బస్తాల చోరీ
హైదరాబాద్: తాళం వేసి ఉన్న దుకాణం షట్టర్ పగటగొట్టిన దొంగలు షాపులో ఉన్న నగదుతో పాటు బియ్యం బస్తాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని హయత్‌నగర్ శాంతీనగర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం గుర్తించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. రూ. 40 వేలతో పాటు, 20 బియ్యం బస్తాలు చోరీకి గురైనట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. -
250 బియ్యం బస్తాలు స్వాధీనం
-
250 బియ్యం బస్తాలు స్వాధీనం
చిత్తూరు : చిత్తూరు జిల్లా వి కోట మండలం నాయకనేరి చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 250 బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. లారీని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి డ్రైవర్‌ను విచారిస్తున్నారు. -
200 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు(కావలి): బియ్యం మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో తహశీల్దార్ సాంబశివరావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు..స్థానిక కేవీఆర్ మిల్లుపై అధికారులు బుధవారం వేకువజామున తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 200 బస్తాల రేషన్ బియ్యం బస్తాలు బయటపడ్డాయి. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.