
పులివెందుల/సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ జిల్లా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పాస్టర్ బెనహర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు. సీఎస్‌ఐ చర్చికి సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. వైఎస్ విజయమ్మ క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జార్జిరెడ్డి కుమారులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి.. వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, ఎన్.శివప్రకాష్‌రెడ్డి, మంత్రులు సురేష్, అవంతి, అంజాద్ బాషా, ఆళ్ల నాని, కడప, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్‌బాబు, అమరనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లి చేరుకున్న సీఎం వైఎస్ జగన్..: సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల వైఎస్సార్ జిల్లా పర్యటన ముగించుకుని బుధవారం సాయంత్రం తాడేపల్లి చేరుకున్నారు. ఈ నెల 23వ తేదీ ఉదయం ఆయన తాడేపల్లి నుంచి వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు, కడపలో పలు అభివృద్ధి పనులకు.. 24న రాయచోటి, 25న పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment