కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు పరామర్శించారు.
కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు పరామర్శించారు. సోమశిల ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్తో ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.
కాగా కావలి ఎమ్మెల్యే దీక్షపై మంత్రి నారాయణ విమర్శలు ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలిపేలా ఉన్నాయని అంబటి అన్నారు. వైఎస్ పాలనలో తప్ప రైతులకు ఏనాడూ సుఖం లేదని, చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయన్నారు.