12న కావలికి సీఎం వైఎస్‌ జగన్‌ | CM Jagan will attend Kavali MLA Son Wedding Reception on June 12th | Sakshi
Sakshi News home page

CM Jagan-Kavali Visit: 12న కావలికి సీఎం వైఎస్‌ జగన్‌

Published Thu, Jun 9 2022 8:48 AM | Last Updated on Thu, Jun 9 2022 3:07 PM

CM Jagan will attend Kavali MLA Son Wedding Reception on June 12th - Sakshi

కావలి (నెల్లూరు): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 12వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కావలికి రానున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు సాకేత్‌కుమార్‌రెడ్డి, మహిమల వివాహ రిసెప్షన్‌ కావలిలోని జాతీయ రహదారిపై ఉన్న ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో 12న జరుగనుంది.

నూతన వధూవరులను ఆశీర్వదించడానికి సీఎం హెలికాప్టర్‌లో కావలికి వస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్పీ సీహెచ్‌ విజయారావు బుధవారం కావలికి విచ్చేసి హెలిప్యాడ్‌ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించారు. కాగా సీఎం పర్యటనకు సంబంధించి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.  ఎమ్మెల్యే కుమారుడి వివాహం హైదరాబాద్‌లో గురువారం ఉదయం జరుగుతుంది.

చదవండి: (Maha Samprokshanam: మహా సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement