సోలార్ ప్లేన్ ఇంపల్స్-2 మరో మజిలీ | Solar Impulse 2 flight lands at Tulsa International Airport | Sakshi
Sakshi News home page

సోలార్ ప్లేన్ ఇంపల్స్-2 మరో మజిలీ

Published Sat, May 14 2016 5:27 PM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM

సోలార్ ప్లేన్ ఇంపల్స్-2 మరో మజిలీ - Sakshi

సోలార్ ప్లేన్ ఇంపల్స్-2 మరో మజిలీ

వాషింగ్టన్: ప్రపంచ పర్యటన కోసం బయల్దేరిన అతిపెద్ద సోలార్ విమానం ఇంపల్స్-2 తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. పర్యటనలోభాగంగా ఆరిజోనా నుంచి ప్రారంభించిన ప్రయాణాన్ని అమెరికాలోని ఒక్లహామాలో ముగించి మరో మజిలీని విజయవంతంగా పూర్తిచేసింది. ఈ విమాన రూపకర్తల్లో ఒకరైన బెర్ట్రాండ్ పికార్డ్ పైలట్‌గా 1,568 కిలోమీటర్ల ప్రయాణాన్ని 17 గంటల 30 నిమిషాల్లో పూర్తిచేసింది.

అదీ ఎటువంటి ఇంధనం లేకుండా కేవలం సౌరఫలకాల ఆధారంగా ఉత్పత్తి అయిన శక్తితోనే గమ్యాన్ని చేరుకుంది. మార్చి 9న ఇంపల్స్-2 తన ప్రపంచ ప్రయాణాన్ని మొదలుపెట్టగా మొదటి ప్రయాణానికి(శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫొనెక్స్ వరకు)ఆండ్రి బార్చ్‌బెర్గ్ పైలట్‌గా వ్యవహరించారు. సౌర ఇంధనంపై అవగాహన కల్పించేందుకే ఈ జైత్రయాత్ర చేపట్టామని దీని పైలట్‌లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement