ఈ బీరు ఖరీదు 4 కోట్లు  | Expensive Beer In History Cost More Than Rs 4 Crore | Sakshi
Sakshi News home page

ఈ బీరు ఖరీదు 4 కోట్లు 

Published Wed, Nov 16 2022 2:07 AM | Last Updated on Wed, Nov 16 2022 2:07 AM

Expensive Beer In History Cost More Than Rs 4 Crore - Sakshi

హే... బీరుకు అంత ఖరీదుంటుందా? ఏదో పాత వైనో, విస్కీనో, షాంపేనో అయినా నమ్మొచ్చు. కానీ.. బీరు కు మరీ అంత కాస్ట్‌ ఉండటం ఏంటి? సహజంగా వచ్చే కామెంట్‌. కానీ, ఈ బీరు చాలా విలువైనది. ఎందుకంటే అది 140 ఏళ్ల కిందటిది. దీని వెనుక ఎంతో చరిత్ర ఉంది. అదే దీన్ని అత్యంత ఖరీదైన మద్యంగా చేసింది. ఒక్లోహామాకు చెందిన ఓ వ్యక్తి 2007లో ఈ బీర్‌ ‘ఆల్‌సాప్స్‌ ఆర్కిటిక్‌ ఆలె’ని మసాచుసెట్స్‌కు చెందిన ఓ సెల్లర్‌ నుంచి కొన్నాడు.

షిప్పింగ్‌తో కలిపి రూ. 24 వేలు అయ్యింది. ఆ బాటిల్‌తో పాటు... లామినేట్‌ చేసిన చేతిరాత నోట్‌ ఒకటి వచ్చింది. ‘ఈ బాటిల్‌ను 1919లో నేను పొందాను. దీన్ని 1852లో ఆర్కిటిక్‌ యాత్ర కోసమే తయారు చేశారు’ అని ఆ బాటిల్‌ అమ్మిన పెర్సీ.జి.బోలస్టర్‌ పేర్కొన్నాడు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆసక్తితో పరిశోధిస్తే ఈ చరిత్ర తెలిసింది. ‘ఆ బీర్‌ను సర్‌ జాన్‌ ఫ్రాంక్లిన్‌ ఆర్కిటిక్‌ యాత్ర కు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్లారు.

అప్పటికే ఆ వాయవ్య మార్గంలో రెండుసార్లు ప్రయాణించిన ఫ్రాంక్లిన్‌ బృందాన్ని ఆ యాత్ర మింగేసింది. రెండు ఓడలు మునిగిపోయాయి. 129 మంది మరణించారు. వారిని వెదకడానికి వెళ్లిన అడ్మిరల్‌ సర్‌ ఎడ్వర్డ్‌ బెల్చెర్‌కు.. వాళ్లు తీసుకెళ్లిన సరుకుల్లో ఈ బీర్‌ మాత్రమే దొరికింది’ అని తెలుసుకున్నాడు. ఆ అరుదైన బీర్‌ను ఈబేలో వేలం వేస్తే... 157కు పైగా బిడ్లు వచ్చాయి. చివరకు రూ.4 కోట్లకు ఆ బాటిల్‌ను ఎవరో కొనుగోలు చేశారు. దాన్ని తాగారా? లేదా? అనేది మాత్రం తెలియదు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement