టెక్సాస్ : ఓక్లహామాలోని ఎత్తైన జలపాతమైన టర్నర్ ఫాల్స్‌లో మునిగిపోయి తెలుగు విద్యార్థి మృతిచెందాడని సిటీ ఆఫ్ డేవిస్ పోలీసులు తెలిపారు. టెక్సాస్‌లోని విచిత ఫాల్స్‌కు చెందిన నాగ సుభాష్ మోతురు(26) బ్లూ హోల్ పూల్‌లో పడి మృతిచెందినట్టు అధికారులు చెప్పారు.
సుభాష్ టెక్సాస్‌లోని విచిత ఫాల్స్‌లోని మిడ్ వెస్ట్రన్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి టర్నర్ ఫాల్స్‌జలపాతం సందర్శించడానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. కరోనా మహమ్మారితో జలపాతం వద్ద లైఫ్‌గార్డులు ఎవరూ విధుల్లో లేరు. అమెరికాలోనే ఉంటున్న సుభాష్ సోదరి మృధాలిని తన తమ్ముడిని ఇండియాకు తీసుకెళ్లడానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment