మిత్రున్ని కలిసి వెళ్దామని వచ్చిన ఓ వ్యక్తికి రహస్య హంతకుడు ఎదురయ్యాడు. డోర్‌బెల్ దగ్గర నక్కి ప్రతాపం చూపాడు. అనుకోని ఆతిథ్యం లభించడంతో ఆ వచ్చిన వ్యక్తి భయంతో కంపించిపోయాడు. జెరెల్ హేవుడ్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ రోడ్నీ కోప్‌ల్యాండ్‌ను చూడ్డానికి గత ఆదివారం ఓక్లహోమాలోని లాటన్‌కు వెళ్లాడు. కోప్‌ల్యాండ్ ఇంటి బయట ఉన్న డోర్‌బెల్ కొట్టగానే అతని మొహంపై పాము కాటు వేసింది. సరిగ్గా కుడికన్ను పైభాగంలో కోరులు దించింది. దీంతో హేవుడ్ నొప్పితో తల్లడిల్లిపోయాడు. షాక్ నుంచి తేరుకుని.. కోప్‌ల్యాండ్ సాయంతో ఆస్పత్రికి చేరుకున్నాడు. ‘నా ఫ్రెండ్ హేవుడ్‌ని పాము కాటేయడం.. సీసీ కెమెరాలో చూసి షాకయ్యాను’ అని కోప్‌ల్యాండ్ తెలిపారు. తన మిత్రున్ని కరిచిన పాము విషపూరితమైందని కాదని, అతను కోలుకుంటున్నాడని తెలిపారు. కాగా, 5 అంగుళాల పొడవున్న పాము కాటేసిన వీడియోల షోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఇక ఇంట్లోకి దూరేందుకు యత్నించిన పామును చంపేశారు.
డోర్‌బెల్ దగ్గర అనుకోని అతిథి..!
Published Wed, May 8 2019 7:00 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement