
రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. 2019 ఏడాదికిగానూ గత రెండురోజుల్లో వైద్య, భౌతికశాస్త్రాల్లో నోబెల్ విజేతలను ప్రకటించిన పురస్కార కమిటీ.. తాజాగా రసాయన శాస్త్రంలో గ్రహీతల పేర్లను వెల్లడించింది. జాన్ బి.గూడెనఫ్, స్టాన్లీ విట్టింగమ్, అకిరా యోషినోకు ఈ అవార్డ్‌ను సంయుక్తంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధికి చేసిన విశేష పరిశోధనలకు వారికి ఈ పురస్కారం లభించింది. వీరు అభివృద్ధి చేసిన లిథియం ఆయాన్ బ్యాటరీలు పోర్టబుల్ టెక్నాలజీ విప్లవానికి కారణమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment