టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచంలోని చాలా దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుతున్నాయి. పెరుగుతున్న కొత్త ఈవీల సంఖ్యకు తగ్గట్టుగా ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులో లేదు, కొన్ని దేశాల్లో ఉన్నప్పటికీ ఛార్జింగ్ కోసం గంటలు తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.
ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టడానికి.. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ పరిశోధక బృందం ఓ సరికొత్త లిథియం బ్యాటరీని అభివృద్ధి చేసింది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం కేవలం ఐదు నిమిషాలే కావడం గమనార్హం. ఒక ఛార్జ్‌తో ఈ బ్యాటరీ 300 మైళ్లు లేదా 482 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో వినియోగంలో ఉన్న చాలా వాహనాలకు ఫాస్ట్ ఛార్జర్ అవకాశాలు ఉన్నప్పటికీ.. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. అయితే అమెరికన్ యూనివర్సిటీ బృందం రూపోంచిన బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవడం వల్ల వాహన వినియోగదారులకు సమయం చాలా ఆదా అవుతుంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధిత కంపెనీలు నార్మల్ హోమ్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ కావడానికి గంటల సమయం పడుతుంది. ఇలాంటి వాహనాలను ఉపయోగించాలంటే వినియోగదారుడు ముందుగానే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ
అమెరికన్ పరిశోధక బృందం రూపొందించిన బ్యాటరీ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇది ఎప్పుడు వినియోగంలోకి వస్తుంది, భారతదేశానికి ఈ బ్యాటరీలు వస్తాయా? వస్తే ఏ ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగిస్తారనే చాలా విషయాలు తెలియాల్సి ఉంది. వీటి గురించి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే తెలుస్తాయని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment