ముంబై: విద్యుత్ వాహన తయారీ సంస్థ హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మంగళవారం రెండు కొత్త- స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. లియో, ఎల్‌వైఎఫ్ పేరుతో తీసుకొచ్చిన ఈ-స్కూటర్‌లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 125 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఈ రెండింటి ధరలు వరుసగా రూ.72,500, రూ.65,000గా ఉన్నాయి. వీటిలో 2ఎక్స్ లీథియం-అయాన్ బ్యాటరీను అమర్చారు. ఇది గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో 19.5 లీటర్ల బూట్ స్పేస్, ఇంటర్నెట్, జీపీఎస్, మొబైల్ యాప్ వంటి అఫేటెడ్ ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఈ స్కూటర్లు 180 కిలోల లోడింగ్ సోమర్థ్యం కలిగి ఉన్నాయి.
ఇక త్వరలో విడుదల చేయబోయే ఈ-బైక్ OXO100ని ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ. వరకూ ప్రయాణించవచ్చు. ఈ సందర్భంగా హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు కేతన్ మెహతా మాట్లాడుతూ.. ‘‘మిలినియల్స్, జనరేషన్-జెడ్ స్థిరమైన, సౌకర్యవంతమైన ప్రయాణాలను కోరుకుంటున్నారు. మేము విడుదల చేసిన ఉత్పత్తులు దేశంలోని ఇ-మొబిలిటీ ఖాళీని భర్తీ చేయగలవు. రెండు మోడళ్లు, ప్రీమియం ఫీచర్లతో పాటు, చక్కటి బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి’’ అని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి కనీసం ఐదు ఎలక్ట్రిక్ వాహన మోడళ్లను అవిష్కరిం చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment