
బ్యాటరీల దొంగలతో ఎస్‌ఐ రాజగోపాల్,పోలీసులు
సాక్షి, బ్రహ్మంగారిమఠం : మండలంలోని నందిపల్లె దగ్గర ఉన్న ఎయిర్‌టెల్ సెల్‌టవర్ బ్యాటరీల దొంగతనం కేసులో ఇద్దరిని బుధవారం అరెస్టు చేసి వారివద్ద నుంచి 13 బ్యాటరీలు స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్‌ఐ రాజగోపాల్ తెలిపారు. మంగళవారం సెల్‌టవర్‌కు సంబంధించిన బ్యాటరీలు దొంగిలించారని సిబ్బంది ఫిర్యాదు చేశారన్నారు. కడపకు చెందిన జేష్టాది రామయ్య, రాజులను అదుపులోకి తీసుకొని విచారించగా వారివద్ద 13 బ్యాటరీలు ఉన్నాయన్నారు. వీటి విలువ రూ. 91వేలు ఉంటుందన్నారు, కేసు నమోదు చేసి బద్వేల్ కోర్టుకు పంపుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్‌సీలు వీరయ్య, రమణ, పొలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment