ప్రతీకాత్మక చిత్రం
నాకిప్పుడు 60 ఏళ్లు. వెజైనా దగ్గర చర్మం కలర్ చేంజ్ అయింది. చిన్న గడ్డలాగా కూడా తెలుస్తోంది. ఏమైనా ప్రమాదమా? డాక్టర్‌ను సంప్రదించాలా? – సీహెచ్. సుజాత, కరీంనగర్
మీ వయసును బట్టి చూస్తే మీ సమస్యను ఫాలో అప్ కేస్‌గా పరిగణించాలి. డాక్టర్‌ను సంప్రదిస్తే.. ముందుగా బయట నుంచే చెక్ చేస్తారు. కొన్ని రకాల స్కిన్ ఇన్‌ఫెక్షన్స్‌లో కూడా ఇలా కలర్ మార్పు కనపడుతుంది. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ద్వారా లోపల ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉందా అని చూస్తారు. యూరిన్ టెస్ట్ చేస్తారు. కొన్నిసార్లు పులిపిర్లు కూడా ఇలానే ఉంటాయి.
అవేం ప్రమాదకరం కావు. కానీ కొంతమందిలో vulval lesions(వల్వల్ లీజన్స్) అని ఉంటాయి. ఇవి కొంతవరకు ఇన్వెస్టిగేషన్స్, ఫాలో అప్స్‌లోనే తెలుస్తాయి ప్రమాదకరమా .. కాదా అని. స్కిన్ బయాప్సీ చేయవలసి రావచ్చు. కొన్ని ప్రత్యేకమైన క్రీమ్స్ వాడమని చెప్తారు. రోగనిరోధక శక్తి పెరగడానికి కొన్ని మల్టీవిటమిన్ మాత్రలను సూచిస్తారు.
ఫాలో అప్ ట్రీట్‌మెంట్‌లో లేకపోతే వంద మందిలో అయిదుగురికి ఇవి క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది. వల్వల్ హైజీన్ అంటే మంచి నీటితో శుభ్రం చేసుకోవడం. ఏ మార్పు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం వల్ల ప్రమాదాన్ని అరికట్టవచ్చు.
- డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్.
చదవండి: Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల..
Comments
Please login to add a commentAdd a comment