Health Tips: ప్రెగ్నెన్సీలో ఈ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుందా? | Health Tips By Dr Bhavana Kasu:Tests To Take During Pregnancy 1st Trimester | Sakshi
Sakshi News home page

Pregnancy 1st Trimester: మూడో నెల.. ప్రెగ్నెన్సీలో ఇవి చేయాల్సిన అవసరం ఉంటుందా?

Published Thu, Aug 11 2022 4:26 PM | Last Updated on Thu, Aug 11 2022 4:32 PM

Health Tips By Dr Bhavana Kasu:Tests To Take During Pregnancy 1st Trimester - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Health Tips- Pregnancy 1st Trimester: నాకు 25 ఏళ్లు. ఇప్పుడు మూడో నెల. మా ఫ్రెండ్‌కి ఫస్ట్‌ ట్రైమిస్టర్‌ స్క్రీనింగ్‌ అనే బ్లడ్‌ టెస్ట్‌ చేశారు. మా డాక్టర్‌ నాకు అలాంటి టెస్ట్‌ చెప్పలేదు. ఈ టెస్ట్‌ ఎవరు చేసుకోవాలి? ప్రెగ్నెన్సీలో ఇవి చేయాల్సిన అవసరం ఉంటుందా? – కె. పూర్ణిమ, ఉమ్నాబాద్‌

ఫస్ట్‌ ట్రైమిస్టర్‌ అంటే మొదటి మూడు నెలల ప్రెగ్నెన్సీ. ఈ టైమ్‌లో కొన్ని ఇంపార్టెంట్‌ స్కాన్, బ్లడ్‌టెస్ట్‌లు ప్రతి గర్భిణీకి సూచిస్తారు. ఫస్ట్‌ ట్రైమిస్టర్‌ స్క్రీనింగ్‌ లేక డబుల్‌ మార్కర్‌ అనే టెస్ట్‌లు తల్లి రక్తంలో చెక్‌ చేస్తారు. ఈ టెస్ట్‌ ద్వారా బేబీకి ఉన్న కొన్ని క్రోమోజోమ్‌ సమస్యలు తెలుస్తాయి. డౌన్‌ సిండ్రోమ్‌ అనే క్రోమోజోమ్‌ లోపం వల్ల బిడ్డకు మెదడు, బాడీ సరిగా డెవలప్‌ కాదు.

ఇంటెలిజెన్స్‌ తక్కువ ఉంటుంది. ఈ టెస్ట్స్‌లో మూడు క్రోమోజోమ్‌ డిజార్డర్స్‌ అంటూ టీ 21, టీ 18, టీ13ను చెక్‌ చేసి మీకు ఎంత చాన్స్‌ ఉంది అనేది చెప్తారు. ఈ రోజుల్లో ప్రతి గర్భిణీకి ఈ పరీక్షలను సూచిస్తున్నాం. ముందుగా రిస్క్‌ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలు రిస్క్‌ను మాత్రమే చెప్తాయి. కచ్చితమైన నిర్ధారణ, హైరిస్క్‌ వచ్చిన వాళ్లకు తదుపరి పరీక్షలను ఫీటల్‌ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేస్తారు. ఈ ఫీటల్‌ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ అనేది స్పెషలైజ్డ్‌ స్కాన్స్‌ చేసే ప్రదేశం.

 Nuchal translucency స్కాన్‌ అనేది చేస్తారు. ఈ టెస్ట్‌ ద్వారా మీకు తరువాత ప్రెగ్నెన్సీలో బీపీ, బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన సమస్యలేమైనా వస్తాయా అని కూడా అంచనా వేస్తారు. దీనివల్ల తగిన జాగ్రత్తలను ముందే తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎన్‌టీ స్కాన్, బ్లడ్‌ టెస్ట్‌ల ద్వారా స్కాన్‌ సాఫ్ట్‌వేర్‌తో రిస్క్‌ కాలిక్యులేషన్‌ చేస్తారు. మీకు 1:150 కన్నా తక్కువ రిస్క్‌ ఉంటే టెస్ట్‌లు అవసరం లేదు.

హై రిస్క్‌ అంటే 1:150 కన్నా ఎక్కువ రిస్క్‌ ఉందని అర్థం. అంటే వాళ్లకు ఉమ్మనీరు టెస్ట్‌ గానీ లేక NIPS (Non invasive prenatal screenings) గానీ చేస్తారు. అందుకే అందరూ గర్భిణీలు ఈ టెస్ట్‌లు చేయించుకోవాలి. ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా ఈ టెస్ట్‌లు చేస్తే మంచిది. మీరు డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఈ టెస్ట్‌ల గురించి వివరంగా కౌన్సెలింగ్‌ చేస్తారు. ఎన్‌టీ స్కాన్, ఈ ఎఫ్‌టీఎస్‌ టెస్ట్‌ ద్వారా 90 శాతం రిస్క్‌ను అంచనా వేయొచ్చు. ఇది స్క్రీనింగ్‌ టెస్ట్‌ మాత్రమే.  
-- డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌.

చదవండి: Tips To Recover From C Section: ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డెలివరీ అయిన మొదటి 6 వారాలు...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement