ప్రతీకాత్మక చిత్రం
మా పాపకు పదేళ్లు. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇరిటేటింగ్‌గా ఫీలవుతోంది. వెజైనల్ క్రీమ్ ఏదైనా వాడొచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దీప, హిందూపురం
చిన్న పిల్లల్లో చాలామందికి యూరిన్, వెజైనా ప్లేసెస్‌లో దురద, మంట ఉంటుంది. చాలా మంది రాత్రిపూట స్క్రాచ్ చేస్తూంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. దీనిని vulvovaginitis అంటారు. నెలసరి మొదలయ్యే ముందు కూడా కొంతమంది ఇలా దురద, ఇరిటేషన్‌తో ఇబ్బందిపడుతుంటారు. సున్నితమైన ప్రాంతం కాబట్టి ఎక్కువగా స్క్రాచ్ చేయడం వల్ల రక్తం కూడా వస్తుంది. వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం.
యూరిన్‌కు వెళ్లిన తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోమని ఆడపిల్లలకు నేర్పాలి. వాష్ చేసుకునేటప్పుడు ముందు భాగం నుంచి వెనుక భాగం వైపుగా వాష్ చేయాలి. ఆ నీళ్లలో కెమికల్స్, పెర్‌ఫ్యూమ్స్, డెటాల్ వంటివి వేయకూడదు. వీటివల్ల ఇరిటేషన్ పెరుగుతుంది. మోషన్‌కు వెళ్లిన తర్వాత యూరిన్ ప్లేస్, వెజైనా కూడా వాష్ చేసుకోమని చెప్పాలి. టైట్‌గా ఉండే దుస్తులు, నైలాన్ ఇన్నర్‌వేర్స్ వేసుకోకూడదు.
రాత్రివేళ వదులుగా ఉండే కాటన్ డ్రెస్‌లు వేసుకోవాలి. వాషింగ్ పౌడర్‌లో ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్స్‌ను వాడకపోవడమే మంచిది. బబుల్ బాత్స్ చేయకూడదు. మలబద్ధకం లేకుండా.. రాకుండా ఆహారంలో పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, పళ్లు తినాలి. తగినన్ని నీళ్లు తాగాలి. గాఢత కలిగిన సబ్బులను వాడకూడదు. యాంటీ సెప్టిక్ లేదా యాంటీబయాటిక్ క్రీముల వల్ల మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి వెజైనాలో ఇంబాలెన్స్ వస్తుంది.
మామూలు నీళ్లల్లో కొంచెం ఉప్పు వేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలకు కాస్మెటిక్ లోషన్స్ వాడకూడదు. ఎప్పుడైనా వెజైనా ఇరిటేషన్‌తోపాటు రక్తస్రావం అవుతున్నా.. వాసన వస్తున్నా.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. పరీక్ష చేసి తగిన మందులు ఇస్తారు. యూరిన్ ఇన్‌ఫెక్షన్ ఉందో లేదో కనుక్కోవడానికి యూరిన్ టెస్ట్ చేస్తారు. పైన చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది. ఇన్‌ఫెక్షన్స్ రాకుండానూ ఉంటాయి.
- డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్.
చదవండి: C- Section Wound Infection: సిజేరియన్.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా?
Lump In Breast During Pregnancy: ఐదో నెలలో రొమ్ములో గడ్డలు తగలడం నార్మల్ కాదు! వెంటనే..
Comments
Please login to add a commentAdd a comment