నా వయసు 17. నాకు వైట్ డిశ్చార్జీ చాలా ఎక్కువగా అవుతోంది. దురద ఎక్కువగా ఉంటోంది. ఇలా వైట్ డిశ్చార్జీ అవ్వడం వల్ల బలహీనపడతారని విన్నాను. ఇది ఎంతవరకు నిజం?
- స్రవంతి, ఏలూరు
మహిళల్లో వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది... సాధారణంగా యోనిలోనూ, సర్విక్స్ నుంచి మ్యూకస్ స్రవించడం వల్ల, సన్నగా తీగలాగా, నీరులాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఇందులో వాసన, దురద ఉండవు. ఇది రజస్వల అయ్యే ముందు, పీరియడ్స్ వచ్చే ముందు, పీరియడ్స్ మధ్యలో, అండం విడుదలయ్యేటప్పుడు స్రవిస్తుంది. దీని గురించి ఆందోళన అక్కర్లేదు.
ఇక రెండోది... బ్యాక్టీరియల్, ఫంగల్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది. ఇందులో తెల్లబట్ట పెరుగులాగా, కొందరిలో నురగలాగా, కాస్త పచ్చగా ఉండి, దురద-మంటలతో కూడి ఉంటుంది. దీనిని అశ్రద్ధ చేయకూడదు. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే, వారు దానికి తగిన యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స చేస్తారు. వైట్ డిశ్చార్జీ వల్ల బలహీనపడటం అంటూ ఏదీ ఉండదు. ఇది కేవలం అపోహ మాత్రమే. ఇలా ఎవరైనా బలహీనపడతూ ఉంటే... దానికి వేరే కారణాలు ఉండవచ్చు. అంటే రక్తహీనత, రోగనిరోధకశక్తి తగ్గడం వంటి సందర్భాల్లో తరచూ ఇన్ఫెక్షన్ వచ్చి బలహీనపడటం జరగవచ్చు. అంతేగానీ వైట్‌డిశ్చార్జీతో మీరు చెప్పే పరిణామం సంభవించదు.
నా వయసు 16. ఇటీవలే రజస్వల అయ్యాను. రుతుస్రావం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
- సుమ, నిర్మల్
రజస్వల అయినవారు రుతుస్రావం అవుతున్న సమయంలో ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వుంచిది. అంటే వూంసాహారం తినేవాళ్లరుుతే చికెన్, వేటవూంసం, చేపలు, వూంసాహారంతో లివర్; శాకాహారులైతే తాజా ఆకుకూరలు, ఎండుఖర్జూరం, నువ్వులు (జింజెల్లీ సీడ్స్), అటుకులు వంటి పదార్థాలు పీరియుడ్స్‌కు వుుందే తీసుకుంటూ ఉండండి. దానివల్ల మీరు కోల్పోయే ఐరన్ భర్తీ అయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు పీరియుడ్స్‌లో ఉన్న సవుయుంలో ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అవారుుడ్ చేయుండి. ఆ సవుయుంలో అవి తీసుకుంటే మీరు వురింత వుందకొడిగా తయూరవుతారు. ఒకేసారి ఎక్కువగా తీసుకునే బదులు కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహరం తీసుకోండి. ఆ సవుయుంలో నీళ్లు, పళ్లరసాల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగండి.
డాక్టర్ వేనాటి శోభ
సీనియర్ గైనకాలజిస్ట్
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్
గైనిక్ కౌన్సెలింగ్
Published Thu, Jun 11 2015 11:04 PM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement