White discharge
-
Health Tips: వైట్ డిశ్చార్జ్ అవ్వడం సాధారణమేనా?
నాకిప్పుడు ఏడవ నెల. బేబీకి కిడ్నీలో వాపు ఉందన్నారు. దీని వలన బేబీ పుట్టిన తర్వాత ఏమైనా సమస్య వస్తుందా? ఇది అందరికీ ఉంటుందా? – నీరజ, కర్నూలుమీరు చెప్పిన సమస్యను ఫీటల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఇది సర్వసాధారణ సమస్య. సాధారణంగా ఐదవ నెల స్కాన్‌లో బయటపడుతుంది. కొద్దిమందికి మాత్రమే ఏడవ నెల, ఎనిమిదో నెల స్కానింగ్‌లలో కనబడుతుంది. ప్రెగ్నెన్సీలో తల్లి శరీరంలోని తాత్కాలికంగా కండరాలు సాగడం వలన బేబీకి కిడ్నీ వాపు కనిపించవచ్చు. ఇది డెలివరీ తరువాత తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు కిడ్నీకి, యురేటర్కి మధ్య బ్లాకేజ్ రావచ్చు లేదా యూరేటర్కి , బ్లాడర్కి మధ్య వాల్వ్ పనిచేయకపోవచ్చు. కిడ్నీలో సిస్ట్ ఉన్నప్పుడు బేబీ కిడ్నీలో వాపు ఎక్కువగా ఉంటుంది. డెలివరీ తర్వాత స్కానింగ్‌లో బేబీ సైజును బట్టి పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలావరకు మందులతోనే తగ్గిపోతుంది. అరుదుగా కొంతమందికి చిన్న సర్జరీ చేయాల్సి వస్తుంది. గర్భిణీలకు 8వ నెల, 9వ నెలలో చేసే స్కాన్‌లో బేబీ కిడ్నీ వాపును బట్టి పీడియాట్రిక్ నెఫ్రాలాజిస్ట్ను సంప్రదించి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. డెలివరీ తర్వాత పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ చేసి, అవసరమైతే సర్జరీకి ప్లాన్ చేస్తారు. బేబీ స్కాన్‌లో రీనల్ పెల్విస్ వాపు 7 మి.మీ. కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సర్జరీ అవసరమవుతుంది. సాధారణంగా 4 వారాల తరువాత మళ్లీ స్కానింగ్ చేసి, కణితి ఏమైనా ఉందో లేదో చూస్తారు. కణితి ఉన్నట్లయితే, హిస్ట్టరోస్కోపీ చేసి, దాన్ని చిన్న ప్రక్రియ ద్వారా తీసివేసి, బయాప్సీకి పంపుతారు. డెలివరీ తర్వాత బేబీకి ఇంకా కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్, కొందరికి అవసరాన్ని బట్టి ఎక్స్‌రే తీస్తారు. డెలివరీ తర్వాత స్కాన్‌లో నార్మల్‌గా ఉంటే ఆ తర్వాత ఏ పరీక్షలూ అవసరం ఉండవు.నాకు 25 ఏళ్లు. ఈ మధ్యే పెళ్లయింది. మొదటి నుంచీ వైట్ డిశ్చార్జ్ ఉంది. పెళ్లయ్యాక మరీ ఎక్కువైంది. కొన్నిసార్లు బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉంటున్నాయి. డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందా? లేదంటే మెడికల్ షాప్‌లో మందులు అడిగి వేసుకోవచ్చా?– సంధ్యారాణి, కామారెడ్డియంగ్ ఏజ్‌లో వైట్ డిశ్చార్జ్‌ని నిర్లక్ష్యం చేయకూడదు. చాలామందికి వైట్ డిశ్చార్జ్‌తో పాటు దుర్వాసన, దురద, మంట కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇది యాంటీబయాటిక్స్‌తో తగ్గవచ్చు. కానీ డాక్టర్ని సంప్రదించకుండా మెడికల్ షాప్‌లో మందులు కొని వేసుకోవద్దు. గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వెజైనల్ స్పెక్యులమ్ ఎగ్జామ్ చేసి సమస్యను తెలుసుకుంటారు. గర్భసంచి ముఖద్వారానికి ఇన్ఫెక్షన్ రావడం మంచిది కాదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కూడా అది హాని చేస్తుంది. అందుకే డాక్టర్‌కి చూపించుకుంటే అసలు సమస్య ఏంటనేది తెలుస్తుంది. కొంతమందికి గర్భసంచి ముఖద్వారం పైన కొన్ని గ్రోత్స్ ఉంటాయి. అదనంగా టిష్యూ పెరగడం వల్ల వస్తాయివి. వీటిని పాలిప్స్ అంటారు. సాధారణంగా ఇవి రెడ్ లేదా గ్రే కలర్లో ఉంటాయి. వీటికి సంబంధించి చాలావరకు ఏ సింప్టమ్ ఉండకపోవచ్చు. చెక్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కానీ కొంతమందికి ఎప్పుడూ నీళ్లలా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. లైంగికచర్యలో పాల్గొన్నప్పుడు స్పాటింగ్, బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటివి కనిపిస్తే కచ్చితంగా తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సెలైన్ సోనోగ్రఫీ ద్వారా ఈ పాలిప్ గర్భసంచిలో ఉందా లేదా గర్భసంచి ముఖద్వారం మీద ఉందా అని చెక్ చేస్తారు. పాలిప్ సైజ్, నేచర్ కూడా తెలుస్తాయి. హిస్టరోస్కోపీ ప్రక్రియ ద్వారా ఈ పాలిప్ని డే కేర్‌లోనే రిమూవ్ చేస్తారు. దాన్ని బయాప్సీకి పంపితే, అది ఎలాంటి పాలిప్, మళ్లీ వచ్చే చాన్స్ ఉందా, ఫాలో అప్ ఎలా చెయ్యాలి అనేవి డీటెయిల్డ్‌గా తెలుస్తాయి. ఏడాదికోసారి రెగ్యులర్ పెల్విక్ పరీక్ష చేయించుకోవాలి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
Health Tips: విపరీతంగా వైట్ డిశ్చార్జ్.. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
నాకు 25 ఏళ్లు. విపరీతంగా వైట్ డిశ్చార్జ్ అవుతోంది. దురద, మంట కూడా ఉన్నాయి. ఎన్ని మందులు వాడినా గుణం కనిపించట్లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి? – ఈ మెయిల్ ద్వారా అందిన ప్రశ్న. వైట్ డిశ్చార్జ్ అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య. దీనివల్ల ఓ పది శాతం మంది ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఉంటారు. కొంతమందికి మాత్రం విపరీతమైన దురద, మంట, మూత్రనాళంలో మంట, తెల్లగా పెరుగులా వైట్ డిశ్చార్జ్ అవడం వంటి సమస్యలు ఉంటాయి. ఈ పరిస్థితిని కాండిడియాసిస్ (ఫంగల్ వెజైనల్ ఇన్ఫెక్షన్) అంటారు. దీనికి చికిత్స చేసినా అయిదు శాతం మందిలో మాత్రం ఈ సమస్య మళ్లీ వస్తుంది. కొంతమందిలో అల్సర్స్లా కూడా మారుతుంది. మధుమేహం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లలో , యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడే వాళ్లలో, గర్భనిరోధక మాత్రలు తీసుకుంటున్న వాళ్లలో ఈ సమస్య ఎక్కువ. డాక్టర్‌ను సంప్రదిస్తే వెజైనల్ పరీక్ష చేసి వైట్ డిశ్చార్జ్ (హై వెజైనల్ స్వాబ్)ను ల్యాబ్‌కు పంపిస్తారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ను నిర్ధారణ చేయడానికి. అసలు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా.. వెజైనా దగ్గర ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం, శుభ్రమైన కాటన్ ఇన్నర్ వేర్‌నే వాడడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ జోలికి వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యను సరిగ్గా నిర్ధారించి.. దానికి తగిన చికిత్సను అందిస్తే ఈ సమస్య తొంభై శాతం నయమవుతుంది. ఇన్ఫెక్షన్ మరీ తీవ్రంగా ఉంటే fluconazole మాత్రలను వారానికి ఒకటి చొప్పున రెండు– మూడు వారాలు వాడాలి. కొంతమందికి ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తలెత్తుతుంది. డాక్టర్‌ను సంప్రదించి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్లీ ఈ ఇన్ఫెక్షన్ రావడాన్ని రికరెంట్ కాండిడియాసిస్ అంటారు. అలాంటప్పుడు ట్రీట్మెంట్ను ఎక్కువ వారాలు కొనసాగించాల్సి ఉంటుంది. మేడమ్.. నాకు పందొమ్మిదేళ్లు. పీరియడ్స్ టైమ్‌లో బ్రెస్ట్ చాలా నొప్పిగా ఉంటోంది. ఇదేమైనా క్యాన్సర్‌గా మారుతుందా? నాకు చాలా భయంగా ఉంది. దయచేసి ఆన్సర్ ఇవ్వగలరు. – ఇ. నైమిష, బెంగళూరు పీరియడ్స్ సమయంలో బ్రెస్ట్ నొప్పిగా ఉండడం అనేది సర్వసాధారణమైన సమస్య. ఇది చాలా వరకు పాతికేళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రెండు వైపులా లేదా ఒక బ్రెస్ట్‌లో మాత్రమే నొప్పి రావచ్చు. కొంతమందికి ప్రతి నెలా వస్తుంది. కొందరికి ఎప్పుడో ఒకసారి ఉంటుంది. ఇది చాలా వరకు పీరియడ్స్ సమయంలో జరిగే హార్మోన్స్ చేంజ్ వల్ల వస్తుంది. బహిష్టు సమయంలో చాలా మందికి వాటర్ రిటెన్షన్ (నీరు పట్టడం) జరుగుతుంది. దానివల్ల బ్రెస్ట్ పరిమాణం పెరిగి నొప్పి కలగొచ్చు. లేదంటే బ్రెస్ట్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా నొప్పి రావచ్చు. మీ వయసులో క్యాన్సర్ వచ్చే చాన్సెన్స్ చాలా అరుదు. అయినా ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. పరీక్ష చేస్తారు. బ్రెస్ట్ పరిమాణం, గడ్డలు ఏమైనా ఉన్నాయా? నిపుల్ నుంచి పస్ గానీ, బ్లీడింగ్ గానీ, గ్రీన్ డిశ్చార్జ్ కానీ ఉందా? అని చెక్ చేస్తారు. 35 ఏళ్లలోపు వారికి బ్రెస్ట్ పెయిన్‌కి కొన్ని సార్లు ఏ పరీక్షలూ అవసరం ఉండవు. మీకు బ్రెస్ట్‌లో ఏదైనా గడ్డలాంటిది ఉన్నా.. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నా.. బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ లేదా బయాప్సీ సూచిస్తారు. బహిష్టు సమయంలోనే వచ్చే బ్రెస్ట్ నొప్పికి చాలా వరకు బ్రెస్ట్ సపోర్ట్ బ్రా, వదులుగా ఉండే లోదుస్తులు వేసుకోవాలి. కొన్నిసార్లు పారాసిటమాల్ వంటి సింపుల్ పెయిన్ కిల్లర్స్‌ను వాడొచ్చు. కాఫీ, టీల జోలికి వెళ్లొద్దు. విటమిన్ ఇ మాత్రలు వాడొచ్చు. నొప్పి నివారణలో ఇవీ సహాయపడనప్పుడు డాక్టర్‌ను సంప్రదించి.. వైద్యులు సూచించిన మాత్రలు తీసుకోవడం మంచిది. నాకిప్పుడు ఎనిమిదో నెల. బేబీ ఎదుగుదల సరిగాలేదని చెప్పారు డాక్టర్. దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పరిమళ, ఖనాపూర్, తెలంగాణ కొంతమంది గర్భిణీలకు ప్రెగ్నెన్సీ చివరి మూడు నెలల్లో కొంతమందికి స్కానింగ్‌లో బిడ్డ ఎదుగుదల సరిగ్గాలేనట్టు తెలుస్తుంది. దీనిని స్మాల్ ఆఫ్ జెస్టేషనల్ ఏజ్ అంటారు. ఇది అంత ప్రమాదకరం కాదు. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. మీరు, మీ భర్త ఇద్దరూ అంతగా హైట్ లేకపోవడం, బరువు కూడా తక్కువగా ఉండడం, కొన్ని ప్లెసెంటా సరిగ్గా పనిచెయ్యక బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉండడం, మీకు హై బీపీ ఉండడం, కొన్ని మందులు, రక్తహీనత, కొన్ని జన్యుపరమైన సమస్యలు, ప్రెగ్నెన్సీలో తలెత్తే ఇన్ఫెక్షన్స్ వంటివి ఆ కారణాల్లో ఉండొచ్చు. ఇలా సమస్యలకు మూలం తెలిసినప్పుడు దానికి తగిన చికిత్సను అందజేస్తారు వైద్యులు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి. పోషకాహారం.. ముఖ్యంగా మాంసకృత్తులు ఎక్కువగా (హై ప్రొటీన్ డైట్) ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. బిడ్డ ఎదుగుదలను రెండు లేదా మూడు వారాలకు ఒకసారి చెక్ చేస్తారు డాక్టర్. బిడ్డకు రక్తప్రసరణ ఎలా ఉందనేదీ వారానికి ఒకసారి చెక్ చేస్తారు. రక్తప్రసరణ, ఉమ్మనీరు సరిగ్గా ఉంటే, తొమ్మిదవ నెల నిండిన తర్వాత ప్రసవానికి ప్లాన్ చేస్తారు. సాధారణ కాన్పుకి ప్రయత్నించవచ్చు. బిడ్డకు రక్తప్రసరణ సరిగా లేకపోతే కొన్నిసార్లు ముందస్తు ప్రసవానికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు బిడ్డకు శ్వాస సమస్యలు తలెత్తకుండా ఒక కోర్స్ కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణ కాన్పు కాకుండా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. బిడ్డకు ప్రత్యేకమైన కేర్ అవసరం ఉండొచ్చు. ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు, పోషకాహారం తీసుకోవాలి. తగినంత వ్యామాయం అవసరం. నిరంతరం పొట్టలో బిడ్డ కదలికలను కనిపెట్టుకుంటుండడం, ఏదైనా ఇబ్బంది అనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 17. నాకు వైట్ డిశ్చార్జీ చాలా ఎక్కువగా అవుతోంది. దురద ఎక్కువగా ఉంటోంది. ఇలా వైట్ డిశ్చార్జీ అవ్వడం వల్ల బలహీనపడతారని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? - స్రవంతి, ఏలూరు మహిళల్లో వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది... సాధారణంగా యోనిలోనూ, సర్విక్స్ నుంచి మ్యూకస్ స్రవించడం వల్ల, సన్నగా తీగలాగా, నీరులాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఇందులో వాసన, దురద ఉండవు. ఇది రజస్వల అయ్యే ముందు, పీరియడ్స్ వచ్చే ముందు, పీరియడ్స్ మధ్యలో, అండం విడుదలయ్యేటప్పుడు స్రవిస్తుంది. దీని గురించి ఆందోళన అక్కర్లేదు. ఇక రెండోది... బ్యాక్టీరియల్, ఫంగల్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది. ఇందులో తెల్లబట్ట పెరుగులాగా, కొందరిలో నురగలాగా, కాస్త పచ్చగా ఉండి, దురద-మంటలతో కూడి ఉంటుంది. దీనిని అశ్రద్ధ చేయకూడదు. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే, వారు దానికి తగిన యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స చేస్తారు. వైట్ డిశ్చార్జీ వల్ల బలహీనపడటం అంటూ ఏదీ ఉండదు. ఇది కేవలం అపోహ మాత్రమే. ఇలా ఎవరైనా బలహీనపడతూ ఉంటే... దానికి వేరే కారణాలు ఉండవచ్చు. అంటే రక్తహీనత, రోగనిరోధకశక్తి తగ్గడం వంటి సందర్భాల్లో తరచూ ఇన్ఫెక్షన్ వచ్చి బలహీనపడటం జరగవచ్చు. అంతేగానీ వైట్డిశ్చార్జీతో మీరు చెప్పే పరిణామం సంభవించదు. నా వయసు 16. ఇటీవలే రజస్వల అయ్యాను. రుతుస్రావం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? - సుమ, నిర్మల్ రజస్వల అయినవారు రుతుస్రావం అవుతున్న సమయంలో ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వుంచిది. అంటే వూంసాహారం తినేవాళ్లరుుతే చికెన్, వేటవూంసం, చేపలు, వూంసాహారంతో లివర్; శాకాహారులైతే తాజా ఆకుకూరలు, ఎండుఖర్జూరం, నువ్వులు (జింజెల్లీ సీడ్స్), అటుకులు వంటి పదార్థాలు పీరియుడ్స్కు వుుందే తీసుకుంటూ ఉండండి. దానివల్ల మీరు కోల్పోయే ఐరన్ భర్తీ అయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు పీరియుడ్స్లో ఉన్న సవుయుంలో ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అవారుుడ్ చేయుండి. ఆ సవుయుంలో అవి తీసుకుంటే మీరు వురింత వుందకొడిగా తయూరవుతారు. ఒకేసారి ఎక్కువగా తీసుకునే బదులు కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహరం తీసుకోండి. ఆ సవుయుంలో నీళ్లు, పళ్లరసాల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగండి. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్