married lives
-
అందర్నీ సంతోషంగా ఉంచాలంటే... నేను వెళ్లి ఐస్ క్రీమ్ అమ్ముకోవాలి!
నటాషా స్టాంకోవిక్, హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జూలై 18న విడిపోయారు. అప్పట్నుంచి నటాషాకు ప్రశ్నలు మొదలయ్యాయి. ‘‘ఏమ్మాయ్, ముచ్చటైన జంట కదా మీది? ఎందుకు విడిపోయారు?’’‘‘భర్త ఏమైనా అంటే సర్దుకు΄ోవాలి కానీ, పెట్టే బేడా సర్దుకుని బయటికి వచ్చేయటమేనా?’’‘‘ఇప్పుడేమిటి? మీ దేశం వెళ్లిపోతావా? ఇక్కడే ఉండిపోతావా?’’. ‘‘కొడుకు పెద్దవాడౌతున్నాడు. వాడి భవిష్యత్తు ఆలోచించకుండా విడాకులకు నువ్వు కూడా ఎందుకు తొందరపడ్డావ్?’’. ‘‘అతనే విడాకులు కావాలని అడిగినా కూడా, కాళ్లా వేళ్లా పడి అతడితోనే ఉండిపోవాలి కానీ, పంతానికి పోతే ఇలా?’’ఇవీ ఆ ప్రశ్నలు! హార్దిక్‌కి మాత్రం సహజంగానే ఎలాంటి ప్రశ్నలూ లేవు. ఎప్పటిలాగే అతడు మిడిల్–ఆర్డర్లో రైట్ హ్యాండ్‌తో బ్యాటింగ్, ఫాస్ట్–మీడియంలో రైట్ ఆర్మ్‌తో బౌలింగ్ చేసుకుంటూ, తన ఆట తను ఆడుకుంటున్నాడు. నాలుగేళ్ల క్రితం 2020 మే 31న నటాషా, హార్ధిక్‌ల పెళ్లి జరిగింది. అదే ఏడాది జూలై 30న వాళ్లకు కొడుకు (అగస్త్య) పుట్టాడు. అప్పటికి ఎంతకాలంగా వాళ్లు డేటింగ్లో ఉన్నారో ఎవరికీ తెలియదు. అసలు వాళ్ల లవ్ స్టోరీనే పెద్ద రహస్యం. పెళ్లి కాగానే నటాషా కెరీర్‌కు బ్రేక్ పడింది. నటాషా చక్కటి డాన్సర్, మంచి నటి, పాపులర్ మోడల్. నటనలో తన కెరీర్‌ను మలుచుకోవటం కోసం 2012లో ఇరవై ఏళ్ల వయసులో సెర్బియా నుండి ఇండియా వచ్చారావిడ. ‘సత్యాగ్రహ’ ఆమె తొలి సినిమా. ఫిలిప్స్, క్యాడ్బరీ, టెట్లీ, జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులకు మోడలింగ్ కూడా చేశారు. అయితే పెళ్లి తర్వాత ఆమె డాన్స్, యాక్టింగ్, మోడలింగ్ అన్నీ మూలన పడ్డాయి. తిరిగి నాలుగేళ్ల తర్వాత మాత్రమే గత నెలలో ‘తేరే కర్కే’ అనే మ్యూజిక్ వీడియో విడుదలతో ఆమె తన కెరీర్‌ను ప్రారంభించగలిగారు.ఈ పునరాగమనం సందర్భంగా ‘బాంబే టైమ్స్’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో (ఆ ఇంటర్వ్యూ ఎక్కువగా ఆమె విడాకుల మీదే సాగింది) ఆమె ఎంతో దృఢంగా మాట్లాడారు. తను తిరిగి సెర్బియా వెళ్లేది లేదని, ముంబైలోనే ఉండిపోతానని, విడాకులు తీసుకున్నప్పటికీ ఆగస్త్య కోసం హార్దిక్, తను తరచు కలుసుకుంటూనే ఉంటామని చెప్పారు. చివరిగా ఒక ప్రశ్న దగ్గర ఆమె కొన్ని క్షణాలు మౌనం వహించారు. ‘‘మీరు విడాకులు తీసుకున్నందుకు మీ వైపు గానీ, హార్దిక్ వైపు గానీ ఎవరూ సంతోషంగా లేరనే మాట వినిపిస్తోంది?’’ అని అడిగినప్పుడు.. ఆ కొన్ని క్షణాల మౌనం తర్వాత ఆమె నవ్వుతూ ... ‘‘అందర్నీ సంతోషంగా ఉంచాలంటే నేను వెళ్లి ఐస్‌క్రీమ్ బండిని నడుపుకోవాలి..’’ అన్నారు. ఆమె నవ్వుతూనే ఆ మాట అన్నా, ‘విడిపోవటం ఎవరికి మాత్రం సంతోషకరమైన విషయం..’ అని తన మనసులో అనుకునే ఉంటారు. (చదవండి: సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో.. ) -
ఆకాశంలో సగానికి అన్యాయమా!
దేశం మొత్తాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉదంతం తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ వైవాహిక బంధంలో జరిగే అత్యాచారం (మారిటల్ రేప్) గురించి ప్రస్తావించి దాన్ని నేరంగా గుర్తించాలని సిఫార్సు చేసినప్పుడు ‘మర్యాదస్తులు’ నొచ్చుకున్నారు. ఆ చర్య వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయదా... వారి పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చదా అని చాలామంది ప్రశ్నించారు. ఈ అంశంపై అంతకు చాన్నాళ్ల ముందే వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ మళ్లీ దాన్ని ఎజెండాలో తెచ్చింది. దాంపత్య జీవితంలో ఉండే లైంగిక సంబంధం పరస్పర అన్యోన్యత ఆధారంగా ఏర్పడుతుందనీ, దాన్ని కేవలం ‘సమ్మతి’ అనే పదంలో కుదించటం అసాధ్యమనీ అఫిడవిట్ అంటున్నది. గతంలోని భారత శిక్షాస్మృతి (ఐపీసీ) అయినా, దాని స్థానంలో అమల్లోకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అయినా దాంపత్య జీవితంలో జరిగే అత్యాచారానికి మినహాయింపునిచ్చాయి. అత్యాచారానికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపీసీ సెక్షన్ 375 నిర్దేశిస్తూ ఈ నేరానికి పాల్పడే భర్తకు మినహాయింపునిచ్చింది. బీఎన్ఎస్ఎస్లో ఈ సెక్షన్ 63గా మారింది. మినహాయింపు కూడా యధాతథంగా కొనసాగింది. భార్య వయస్సు 18 యేళ్లు దాటిన పక్షంలో భర్త జరిపే అత్యాచారానికి మినహాయింపు ఉంటుందని చట్టం చెబుతోంది. ఈ మినహాయింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తే మొత్తం వివాహ వ్యవస్థపైనే అది తీవ్ర ప్రభావం చూపగలదని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ హెచ్చరిస్తోంది. చట్టంలో ఉన్న మినహాయింపు అత్యాచారం చేయటానికి భర్తకిచ్చే లైసెన్సు కాదంటూనే ఆ అంశాన్ని చట్టంవైపుగా కాక సామాజిక కోణం నుంచి చూడాలని అభిప్రాయపడింది. సంబంధిత పక్షాలన్నిటితో, రాష్ట్రాలతో చర్చించాక చట్టసభ తీసుకోవాల్సిన నిర్ణయం గనుక న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని తెలిపింది. భార్య సమ్మతికి రక్షణ కల్పించేందుకు ఇప్పుడున్న చట్టాల్లో ఏర్పాట్లున్నాయనీ, గృహ హింస చట్టంవంటివి రక్షణగా నిలుస్తాయనీ చెప్పింది. నేరం ఒకటే అయినప్పుడు దాన్ని వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా ఎలా పరిగణిస్తారు? హత్య జరిగితే అది చోటుచేసుకున్న ప్రాంతాన్ని బట్టి దాన్ని హత్యాయత్నంగా అనుకోగలమా? పరిచితుడో, అపరిచితుడో మహిళపై అత్యాచారం చేస్తే దానికి శిక్ష ఉన్నప్పుడు... భర్త అదే పనిచేసినప్పుడు మినహాయింపు ఇవ్వటం ఏ రకంగా న్యాయం? 2022లో ఢిల్లీ హైకోర్టులో మారిటల్ రేప్‌పై పిటిషన్ దాఖలైనప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఒకరు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని అభిప్రాయపడితే, అది సరికాదని మరో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అనంతరం కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు రెండూ మారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించాల్సిందేనని తీర్పులు వెలువరించాయి. మన పౌరులైనా, విదేశీ పౌరులైనా చట్టం ముందు అందరూ సమానులనీ, అందరికీ సమానమైన రక్షణ లభిస్తుందనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. భర్త చేసే అత్యాచారం నేరంగా పరిగణించకూడదని మినహాయింపునివ్వటం వివాహ బంధంలోని మహిళకు ఈ అధికరణ వర్తించబోదని చెప్పటం కాదా? కానీ కేంద్రం అలా అనుకోవటం లేదు. ఇది పెళ్లయితే స్త్రీ తన హక్కును కోల్పోతుందని పరోక్షంగా చెప్పటం కాదా? మన దేశంలో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారన్న అఫిడవిట్ అభిప్రాయంతో విభేదించనవసరం లేదు. అలాగే వివాహ వ్యవస్థకుండే బహుముఖ పార్శా్వల్లో భార్యాభర్తల లైంగిక సంబంధం ఒకటి మాత్రమేనని చేసిన వాదననూ తప్పుబట్టనవసరం లేదు. కానీ సామాజిక విశ్వాసాలకూ, రాజ్యాంగ విలువలకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడినప్పుడు ఒక గణతంత్ర రాజ్యం రాజ్యాంగ విలువలకు మాత్రమే ప్రాధా న్యమివ్వాలి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అన్ని సమాజాల్లోనూ భిన్న ఆధిపత్య ధోరణులు అల్లుకుపోయి వుంటాయి. పితృస్వామిక సమాజాల్లో స్త్రీలపై ఆధిపత్యం సాధించటానికి పురుషుడి చేతిలో అత్యాచారం ఒక ఆయుధం. దీన్ని చాలా ముందుగా గుర్తించబట్టే సోవియెట్ యూనియన్ 1926లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 1950లో జెకోస్లోవేకియా, 1969లో పోలెండ్ ఈ మాదిరి చట్టాలు చేశాయి. ఇవన్నీ అప్పటికి సోషలిస్టు రాజ్యాలు. ప్రస్తుతం దాదాపు 150 దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయి. భార్య లైంగిక స్వయంప్రతిపత్తిని భర్త అయినా సరే దెబ్బతీయరాదనీ, అది నేరపూరిత చర్య అవుతుందనీ ఈ చట్టాలు భావిస్తున్నాయి. సకల ప్రజాస్వామ్య దేశాలకూ భారత్ తల్లిలాంటిదని చెప్పుకుంటున్న మనం మాత్రం మారిటల్ రేప్ విషయంలో ఇంకా తడబాటు ప్రదర్శించటం సబబేనా?దాంపత్య జీవనంలో భర్తలు సాగించే హింసను మన దగ్గర మహిళలు మౌనంగా భరిస్తున్నారు. భరించ శక్యం కాని స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బయటికొస్తున్నారు. భర్త లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని వారిలో అతి కొద్దిమంది మాత్రమే వెల్లడిస్తున్నారు. స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ డేటా ప్రకారం ముంబైలోని ధారవిలో ఈ సంస్థ ముందు 3,878 ఫిర్యాదులు దాఖలుకాగా అందులో 52.11 శాతం లైంగిక హింసకు సంబంధించినవే. 19.33 శాతంమంది తమ భర్త తమపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపారని ఆ సంస్థ అంటున్నది. భార్య అభీష్టాన్ని బేఖాతరు చేయటం నేరమన్న స్పృహ పురుషుడిలో కలగాలంటే మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించటం ఒక్కటే మార్గం. ఇందుకు భిన్నంగా ఆలోచించటం జనాభాలో సగానికి అన్యాయం చేయటమే. -
ఆ సర్జరీ చేయించుకుంటే .. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందా?
బేరియాట్రిక్ సర్జరీ వల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందా? పిల్లల్ని కనడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా? – జి. పూర్ణిమ, వేములవాడ బాడీమాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) అంటే మీ ఎత్తుకు ఎంత బరువు ఉండాలో కాలిక్యులేట్ చేసే పద్ధతి. ఈ బీఎమ్ఐ 40 .. అంతకన్నా ఎక్కువ ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. వైవాహిక జీవితంలో సమస్యలు? అధిక బరువుతో ఉండీ.. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నవారికి.. డయాబెటిస్, హై బీపీ, స్లీప్ ఆప్నియా వంటివి తగ్గించుకోవడానికి కొన్నిసార్లు బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తరువాత వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కనీసం ఏడాది నుంచి రెండేళ్లు గ్యాప్ ఇవ్వాలి. ప్రత్యేకంగా టెస్టులు విటమిన్ సప్లిమెంట్స్, మైక్రోన్యూట్రైంట్స్, ఫోలిక్ యాసిడ్ వంటివి ముందుగానే ఇవ్వాలి. హైరిస్క్ ప్రెగ్నెన్సీలాగా ప్రెగ్నెన్సీ టైమ్ అంతా మల్టీడిసిప్లినరీ టీమ్‌తో చూపించుకోవాలి. బీఎమ్ఐ తగ్గటం వల్ల హై బీపీ, హై సుగర్ చాన్సెస్ తగ్గుతాయి. జెస్టేషనల్ డయాబెటిస్ ఉందా అని అందరికీ చేసే టెస్ట్స్ కాకుండా వాళ్లకు ప్రత్యేకంగా టెస్ట్స్ చేస్తారు. బేరియాట్రిక్ సర్జరీ కాంప్లికేషన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. సర్జన్, డైటీషియన్, సైకాలజిస్ట్‌ల ఫాలో అప్‌లో ఉండాలి. డెలివరీ డెసిషన్ అనేది ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్‌ని బట్టి తీసుకోవాలి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
కట్నపిశాచాల కిరాతకం..
ఓదెల: అత్తింటి ఆరళ్లకు అబల బలైంది. అదనపు వరకట్నం కోసం భర్త కుటుంబసభ్యులు వివాహిత ప్రాణాలు తీశారు. వివాహిత తల్లిదండ్రుల ఎదుటే కిరోసిన్ పోసి నిప్పంటించారు. కళ్లెదుటే కన్నకూతురు మంటల్లో హాహాకారాలు చేస్తుంటే తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లాయి. స్పృహతప్పి పడిపోయిన కూతురు ను తల్లిదండ్రులే ఆస్పత్రికి తరలించారు. వివాహిత మూడు రోజులుగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ శనివారం ప్రాణాలొదిలింది. వివరాలు మృతురాలి తండ్రి యాట రామస్వామి, సుల్తానాబాద్ సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌కు చెందిన యా ట రామస్వామి కూతురు లావణ్య వివాహం ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన వీర్ల రవీందర్‌తో జూన్ 1, 2013న జరిగింది. వివాహ సమయంలో రూ.10 ల క్షల వరకట్నంతోపాటు పది తులాల బంగారం అప్పజెప్పారు. రవీందర్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్ది నెలలుగా మరో రూ.5 లక్షలు కావాలని లావణ్యను భర్తతోపాటు అత్తింటి కుటుంబసభ్యులు వే ధింపులు ప్రారంభించారు. ఈవిషయమై ఇటీవల పె ద్దల సమక్షంలో పంచాయితీ సైతం నిర్వహించారు. స యోధ్యతో లావణ్య అత్తారింటికెళ్లింది. అయినా భర్తలో మార్పు రాలేదు. భర్తతోపాటు బావ కుమారస్వామి, తోడికోడలు భారతి, అత్త రాజమ్మ, మామ కొంరయ్య వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు భరించలేని లావణ్య ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. లా వణ్య తల్లిదండ్రులు ఈ నెల 25న కొలనూర్‌కు వచ్చా రు. అత్తింటివారు అదనపు వరకట్నం కోసం చిత్రహిం సలు పెడుతున్నారని ఆమె తల్లిదండ్రుల ఎదుట బో రున విలపించింది. ఇక్కడ ఉండలేనని ప్రాణభయం ఉందన్నది. రామస్వామి తమ కూతురును తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. లావణ్య ఇంట్లోకెళ్లి బట్టలు తీసుకొస్తుండగా అత్తింటివారు మూకుమ్మడిగా దాడి చేసి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటిం చారు. స్పృహతప్పి పడిపోయిన కూతురును కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థతి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. మూడు రోజులుగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఐదుగురిపై కేసు భర్త వీర్ల రవీందర్, బావ కుమారస్వామి, తోడికోడలు భారతి, అత్త రాజమ్మ మామ కొంరయ్యలపై కేసు నమోదు చేసినట్లు సుల్తానాబాద్ సీఐ సత్యనారాయణ తెలిపారు. మృతురాలు తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.