కట్నపిశాచాల కిరాతకం..
ఓదెల:
అత్తింటి ఆరళ్లకు అబల బలైంది. అదనపు వరకట్నం కోసం భర్త కుటుంబసభ్యులు వివాహిత ప్రాణాలు తీశారు. వివాహిత తల్లిదండ్రుల ఎదుటే కిరోసిన్ పోసి నిప్పంటించారు. కళ్లెదుటే కన్నకూతురు మంటల్లో హాహాకారాలు చేస్తుంటే తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లాయి. స్పృహతప్పి పడిపోయిన కూతురు ను తల్లిదండ్రులే ఆస్పత్రికి తరలించారు. వివాహిత మూడు రోజులుగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ శనివారం ప్రాణాలొదిలింది. వివరాలు మృతురాలి తండ్రి యాట రామస్వామి, సుల్తానాబాద్ సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం..
తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌కు చెందిన యా ట రామస్వామి కూతురు లావణ్య వివాహం ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన వీర్ల రవీందర్‌తో జూన్ 1, 2013న జరిగింది. వివాహ సమయంలో రూ.10 ల క్షల వరకట్నంతోపాటు పది తులాల బంగారం అప్పజెప్పారు. రవీందర్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్ది నెలలుగా మరో రూ.5 లక్షలు కావాలని లావణ్యను భర్తతోపాటు అత్తింటి కుటుంబసభ్యులు వే ధింపులు ప్రారంభించారు. ఈవిషయమై ఇటీవల పె ద్దల సమక్షంలో పంచాయితీ సైతం నిర్వహించారు. స యోధ్యతో లావణ్య అత్తారింటికెళ్లింది. అయినా భర్తలో మార్పు రాలేదు. భర్తతోపాటు బావ కుమారస్వామి, తోడికోడలు భారతి, అత్త రాజమ్మ, మామ కొంరయ్య వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు భరించలేని లావణ్య ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. లా వణ్య తల్లిదండ్రులు ఈ నెల 25న కొలనూర్‌కు వచ్చా రు. అత్తింటివారు అదనపు వరకట్నం కోసం చిత్రహిం సలు పెడుతున్నారని ఆమె తల్లిదండ్రుల ఎదుట బో రున విలపించింది. ఇక్కడ ఉండలేనని ప్రాణభయం ఉందన్నది. రామస్వామి తమ కూతురును తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. లావణ్య ఇంట్లోకెళ్లి బట్టలు తీసుకొస్తుండగా అత్తింటివారు మూకుమ్మడిగా దాడి చేసి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటిం చారు. స్పృహతప్పి పడిపోయిన కూతురును కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థతి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. మూడు రోజులుగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది.
ఐదుగురిపై కేసు
భర్త వీర్ల రవీందర్, బావ కుమారస్వామి, తోడికోడలు భారతి, అత్త రాజమ్మ మామ కొంరయ్యలపై కేసు నమోదు చేసినట్లు సుల్తానాబాద్ సీఐ సత్యనారాయణ తెలిపారు. మృతురాలు తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.