అడ్డంగా బుక్కయిన సూపర్ సింగర్ | Niall Horan caught urinating on LA street | Sakshi
Sakshi News home page

అడ్డంగా బుక్కయిన సూపర్ సింగర్

Published Mon, Mar 7 2016 3:45 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM

Niall Horan caught urinating on LA street

లాస్ ఏంజెల్స్:  హాలీవుడ్కు చెందిన వన్ డైరెక్షన్  సింగర్  నియాల్ హోరన్ (22)  మరోసారి వార్తల్లో నిలిచాడు. తన ఆల్బమ్తో  ప్రపంచవ్యాప్తంగా  యువతను  ఉర్రూతలూగించిన ఈ హాలీవుడ్ సింగర్  తాను చేసిన పనికి అడ్డంగా బుక్కయ్యాడు. ముద్దుగుమ్మలతో పార్టీ అనంతరం వీధి చివరి బహిరంగంగా మూత్రం విసర్జిస్తూ దొరికిపోయాడు.

వెస్ట్ హాలీవుడ్లో1 ఓక్ క్లబ్ లో  హంగాయా పూర్తయిన తర్వాత శుక్రవారం రాత్రి దీపస్తంభం దగ్గర  యూరినేట్ చేస్తూ ఫోటోలకు చిక్కాడు. ఆ ఫోటోలు ఇపుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.  ఒకవైపు ఖరీదైన బూట్లు, బట్టల్లో రాకింగ్ స్టార్  లా వెలిగిపోతూ.. మరోవైపు  నియాల్  ఇలాంటి అనాగరిక  చర్యకు పాల్పడడం పట్ల  నెటిజన్లు మండిపడుతున్నారు.

కాగా  వన్ డైరెక్షన్ ఆల్బంతో నియాల్  ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అతని స్వరానికి   యూత్ ఫిదా అయింది.  కాగా  వన్ డైరెక్షన్ ఆల్బంతో నియాల్  ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అతని స్వరానికి   యూత్ ఫిదా అయిపోయారు. అలాంటి  మ్యూజిక్ బ్యాండ్ అతనితో బ్రేకప్ చేప్పే ఆలోచనలో ఉన్నట్టు ఆ మధ్య వార్తలు రావడంతో అతని కెరియర్ డైలమాలో పడింది. ఈ నేపథ్యంలోనే  గోల్ప్ ఏజెన్సీ పెట్టే ప్రయత్నాల్లో మునిగి తేలుగుతున్నట్టు  సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement