One direction
-
అడ్డంగా బుక్కయిన సూపర్ సింగర్
లాస్ ఏంజెల్స్: హాలీవుడ్‌కు చెందిన వన్ డైరెక్షన్ సింగర్ నియాల్ హోరన్ (22) మరోసారి వార్తల్లో నిలిచాడు. తన ఆల్బమ్‌తో ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగించిన ఈ హాలీవుడ్ సింగర్ తాను చేసిన పనికి అడ్డంగా బుక్కయ్యాడు. ముద్దుగుమ్మలతో పార్టీ అనంతరం వీధి చివరి బహిరంగంగా మూత్రం విసర్జిస్తూ దొరికిపోయాడు. వెస్ట్ హాలీవుడ్లో1 ఓక్ క్లబ్ లో హంగాయా పూర్తయిన తర్వాత శుక్రవారం రాత్రి దీపస్తంభం దగ్గర యూరినేట్ చేస్తూ ఫోటోలకు చిక్కాడు. ఆ ఫోటోలు ఇపుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఒకవైపు ఖరీదైన బూట్లు, బట్టల్లో రాకింగ్ స్టార్ లా వెలిగిపోతూ.. మరోవైపు నియాల్ ఇలాంటి అనాగరిక చర్యకు పాల్పడడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా వన్ డైరెక్షన్ ఆల్బంతో నియాల్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అతని స్వరానికి యూత్ ఫిదా అయింది. కాగా వన్ డైరెక్షన్ ఆల్బంతో నియాల్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అతని స్వరానికి యూత్ ఫిదా అయిపోయారు. అలాంటి మ్యూజిక్ బ్యాండ్ అతనితో బ్రేకప్ చేప్పే ఆలోచనలో ఉన్నట్టు ఆ మధ్య వార్తలు రావడంతో అతని కెరియర్ డైలమాలో పడింది. ఈ నేపథ్యంలోనే గోల్ప్ ఏజెన్సీ పెట్టే ప్రయత్నాల్లో మునిగి తేలుగుతున్నట్టు సమాచారం. -
ప్రేయసిని మోసం చేసిన హాలీవుడ్ స్టార్!
లండన్: 'వన్ డైరెక్టర్' స్టార్ హ్యారీ స్టైల్స్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఈ హాలీవుడ్ స్టార్ ఒకవైపు మోడల్ కెండల్ జెన్నర్‌తో ప్రేమాయణం సాగిస్తూనే.. మరోవైపు ఫ్యాషన్ స్టైలిస్ట్ పండోరా లెనార్డ్ (27) రాసలీలలు సాగిస్తున్నాడు. గత డిసెంబర్లో కెండల్తో ప్రేమలో మునిగి ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన హ్యారీ ఇటీవల ఓ రోజంతా లెనార్డ్తో గడిపినట్టు వార్తలు వస్తున్నాయి. కెండల్కు తెలియకుండా వీరిద్దరు రహస్యంగా గడిపినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, హ్యారీ, లెనార్డ్ ఇద్దరు సన్నిహితులని, హ్యారీ, కెండల్ అధికారికంగా డేటింగ్ చేసిన తర్వాత కూడా వీళ్లు మళ్లీ కలిసి గడిపారని వార్తలు రావడం సరికాదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. లెనార్డ్ యాంటీ ఏజెన్సీ మోడలింగ్ కంపెనీని స్థాపించింది. లిటిల్ మిక్స్, జేస్సీ జే వంటి ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ తో పనిచేసిన ఈ భామ మీరిద్దరు మళ్లీ కలిసి గడిపారా? అంటే 'నో కామెంట్' అంటూ తోసిపుచ్చింది. -
'నా ప్రేమనంతా కూడగట్టి నీకు పంపిస్తున్నా'
'వన్ డైరెక్షన్ బ్యాండ్'.. ఈ పేరు మీరు ముందే విన్నారా.. ప్రపంచంలోని గొప్ప మ్యూజిక్ బ్యాండ్లలో ఇదీ ఒకటి. ఇందులోని సభ్యులంతా యువకులే. వీరు పాడితే అవతలివారు ఎగిరిగంతేయాల్సిందే. ఈ బృందంలోని హ్యారీ స్టైల్స్ అనే బ్యాండ్ బాబు.. ఓ పాఠశాల అమ్మాయికి ఐ లవ్ యూ అంటూ ప్రేమ సందేశం పంపాడు. అయితే, ఇది స్వార్థంతోనో, మనసుపడో కాదు.. ప్రాణాలతో పోరాడుతున్న ఆ బాలికకు ధైర్యం నింపేందుకు. న్యూజెర్సీలోని ఓ హైస్కూల్లో బ్రియన్నా అనే బాలిక చదువుతోంది. ప్రస్తుతం ఆమె ల్యుకేమియాతో బాధపడుతోంది. బ్రియాన్నా హ్యారీ స్టైల్స్‌కు ఫ్యాన్. ఈ విషయం తెలుసుకున్న హ్యారీ కదిలిపోయి స్వయంగా ఓ వీడియోను తయారు చేసి ట్విట్టర్లో ఆ బాలికకు పంపాడు. అందులో చిరిగిన జీన్స్ వేసుకుని ఉన్న హ్యారీ ' హాయ్ బ్రియాన్నా, నిన్ను కలిసినందుకు చాలా సంతోషపడుతున్నాను. నువ్వు నాకు చిన్న ఫ్యాన్వని విన్నాను. కానీ నేను మాత్రం నీకు పెద్ద అభిమానిని. నీ గురించి నేను మొత్తం విన్నాను. నువ్వు చాలా ధైర్యమైన దానివని తెలుసుకున్నాను. నా ప్రేమనంతా కూడగట్టి నీకు పంపిస్తున్నాను. నేను త్వరలోనే నిన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఉండు. ప్రేమతో.. ఐలవ్ యూ.. బై' అని వీడియో రికార్డు చేశాడు.