ప్రేయసిని మోసం చేసిన హాలీవుడ్ స్టార్! | Harry Styles cheating on Kendall Jenner? | Sakshi
Sakshi News home page

ప్రేయసిని మోసం చేసిన హాలీవుడ్ స్టార్!

Published Mon, Jan 25 2016 9:55 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

ప్రేయసిని మోసం చేసిన హాలీవుడ్ స్టార్!

ప్రేయసిని మోసం చేసిన హాలీవుడ్ స్టార్!

లండన్‌: 'వన్ డైరెక్టర్' స్టార్ హ్యారీ స్టైల్స్‌ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఈ హాలీవుడ్ స్టార్ ఒకవైపు మోడల్ కెండల్‌ జెన్నర్‌తో ప్రేమాయణం సాగిస్తూనే.. మరోవైపు ఫ్యాషన్ స్టైలిస్ట్ పండోరా లెనార్డ్‌ (27) రాసలీలలు సాగిస్తున్నాడు. గత డిసెంబర్‌లో కెండల్‌తో ప్రేమలో మునిగి ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన హ్యారీ ఇటీవల ఓ రోజంతా లెనార్డ్‌తో గడిపినట్టు వార్తలు వస్తున్నాయి. కెండల్‌కు తెలియకుండా వీరిద్దరు రహస్యంగా గడిపినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే, హ్యారీ, లెనార్డ్ ఇద్దరు సన్నిహితులని, హ్యారీ, కెండల్ అధికారికంగా డేటింగ్ చేసిన తర్వాత కూడా వీళ్లు మళ్లీ కలిసి గడిపారని వార్తలు రావడం సరికాదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. లెనార్డ్ యాంటీ ఏజెన్సీ మోడలింగ్ కంపెనీని స్థాపించింది. లిటిల్ మిక్స్, జేస్సీ జే వంటి ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ తో పనిచేసిన ఈ భామ మీరిద్దరు మళ్లీ కలిసి గడిపారా? అంటే 'నో కామెంట్‌' అంటూ తోసిపుచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement