ఈ హీరోకు ప్రపంచంలోనే అందమైన కళ్లు..
'వన్ డైరెక్షన్' స్టార్ హ్యారీ స్టైల్స్‌కు అరుదైన కితాబు లభించింది. ఆయనకు ప్రపంచంలోనే అత్యంత అందమైన కళ్లు, చుబుకం (గడ్డం) ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. సెంటర్ ఫర్ అడ్వాన్స్ ఫేషియల్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ప్రచురించిన ఈ అధ్యయనంలో పురుష సెలబ్రిటీల్లో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారనే విషయాన్ని వారి ముఖంలోని పలు భాగాల కొలతల ఆధారంగా నిర్ధారించారు.
అత్యంత సుకుమారమైన కళ్ల విషయంలో స్టైల్స్ ఈ జాబితాలో ప్రథమస్థానంలో నిలిచాడు. అతని కళ్ల పొడవు, కళ్ల మధ్య దూరం వంటి అంశాల్లో 98.15శాతం పర్ఫెక్ట్ రేషియోతో అతను ఈ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. పర్ఫెక్ట్ చిన్ విషయంలోనూ 99.7శాతం రేషియో మొదటిస్థానంలో నిలిచాడు.