
సాక్షి, న్యూఢిల్లీ : మూత్రానికి విలువ పెరుగుతోంది.. ఒక లీటర్ యూరిన్‌కు రూపాయి విలువను ప్రభుత్వం నిర్ణయించింది. ఇదేంటి అనుకుంటున్నారా? నిజం. దేశంలో ఎరువుల కోరత తగ్గించే క్రమంలో కేంద్రం ప్రభుత్వం ఎవరూ ఊహించని ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోని తాలుకా, తహసీల్ కార్యాలయాల్లో యూరిన్ బ్యాంక్‌లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. యూరిన్ బ్యాంక్‌ల్లో సేకరించిన యూరిన్‌తో యూరియాను తయారు చేయవచ్చని.. ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల యూరియాను దిగుమతి చేసుకునే అవసరం లేకుండా అతి తక్కువ ధరకే నాణ్యమైన యూరియాను మన రైతులకు అందించవచ్చని ఆయన తెలిపారు.
యూరిన్‌లో నైట్రోజన్ శాతం అధికంగా ఉంటుందని ఆయన తెలిపారు. అయితే దృరదృష్టవశాత్తు దీనిని మనం ఉపయోగించుకోవడం లేదన్నారు. దేశంలో వ్యర్థాన్ని సంపదగా మార్చే ఇటువంటి ఆలోచనను అందరూ అంగీరిస్తారని ఆయన చెప్పారు.
పైలెట్ ప్రాజెక్ట్
యూరిన్ నుంచి యూరియా రూపొందించే కార్యక్రం మొదటగా మహరాష్ట్రలోని నాగ్‌పూర్ దగ్గరున్నధాఫ్‌వడ ప్రాంతంఓ ఏర్పటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు, ప్రజలు, స్థానికులు ఎవరైనా.. 10 లీటర్ల యూరిన్‌ను బ్యాంక్‌కు అందిస్తే.. లీటర్‌కు రూపాయి చొప్పున 10 రూపాయలు కూడా వారికి అందిస్తామని ఆయన తెలిపారు.